నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (4వ. భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

చీకటి ముసురుకుంటోంది. దీపాలు వెలిగించాలి. నూనె కోసం బజారుకి వచ్చారు బాబా. ప్రేమ్‌చంద్‌ దుకాణం ముందు నిల్చుని నూనె కోసం చేతిలోని డబ్బాని అతని ముందు ఉంచారు.

ఆ డబ్బాలో నూనె పొయ్యడం ఇష్టం లేదు ప్రేమ్‌చంద్‌కి. ఆ మాట కూడా చెప్పడం ఇష్టం లేదు. నౌకర్ని కేకేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. నౌకరు వచ్చాడు. అతని ముందు డబ్బాని ఉంచారు బాబా.‘‘దుకాణంలో నూనె లేదు బాబా! నిండుకుంది.’’ అన్నాడు నౌకరు.

గట్టిగా చెప్పాడు. అబద్ధం ఆడుతూ వణికిపోయాడతను.‘‘లేదని అయ్య చెప్పమన్నాడు సామీ.’’ అన్నాడు మెల్లగా. చేతులు జోడించాడు. నవ్వుతూ తలాడించి ముందుకు కదిలారు బాబా.

పక్కనున్న దుకాణంలోని గోపీచంద్‌ ముందు డబ్బాను జాపారు.‘‘ఎళ్ళెళ్ళు, నూనె లేదు.’’ అన్నాడు గోపీచంద్‌. నిండుగా నూనె ఉంది. కనిపిస్తోంది. అయినా లేదంటున్నాడు. సరే అనుకున్నారు బాబా.

అక్కణ్ణుంచి మరి కొంచెం ముందుకు వచ్చి, మరో దుకాణదారు ముందు డబ్బాని ఉంచారు. అక్కడా అదే సమాధానం.‘‘నూనె లేదు.’’అందరూ ఒకటే మాట! అర్థమయింది బాబాకి. నవ్వుతూ వెను తిరిగారు. మసీదుకి చేరుకున్నారు.

‘‘నూనె ఇస్తే దీపాలు వెలిగించడం కాదు, నూనె ఇవ్వలేదు, దీపాలు వెలిగించమను చూద్దాం. నూనె లేకుండా దీపాలు వెలిగించగలిగితే అప్పుడు బాబా నిజంగా దేవుడే!’’ అన్నారు వ్యాపారులు.

‘‘అడిగింది ఇస్తూ పోతూంటే అంతా దేవుళ్ళే!’’ అని నవ్వుకున్నారు.‘‘ఈ చీకట్లో మసీదులో బాబా ఎలా ఉన్నదీ చూద్దాం, పదండి.’’ అనుకున్నారు వ్యాపారులు. బయల్దేరారు అక్కడికి.

ప్రమిదలు తుడిచి మరీ సిద్ధం చేశాడు శ్యామా. వరుసగా గోడ మీద ప్రమిదలు పేర్చాడు.

నూనెతో బాబా వస్తే వత్తులు వేసి, దీపాలు వెలిగించాలి. ఆ పని బాబా చూసుకుంటారు. ఖాళీ డబ్బాతో వచ్చిన బాబాని చూశాడు శ్యామా.

‘‘ఏమయింది బాబా? డబ్బాలో నూనె లేదు!’’ ఆశ్చర్యపోయాడు శ్యామా.‘‘లేదు’’ నవ్వారు బాబా.‘‘మరి దీపాలు వెలిగించడం ఎలా?’’

‘‘ఇలా’’ అన్నారు బాబా. మంచినీటి కుండ దగ్గరగా నడిచారు.వ్యాపారులంతా ఆసరికి మసీదుకి చేరుకున్నారు. చాటుగా దాగున్నారు. బాబా ఏం చేసేదీ చూడసాగారు.

మంచినీటి కుండ మీది చెంబును అందుకున్నారు బాబా. ఆ చెంబుతో కుండలోని నీటిని తీసుకున్నారు. కడుపు నిండుగా ఆ నీరు తాగారు. కాస్సేపు ధ్యానంలో కూర్చున్నారు. తర్వాత లేచి, కడుపులోని నీటిని చెంబులోకి వమనం చేశారు.

ఆశ్చర్యపోయాడు శ్యామా. చాటుగా ఉన్న వ్యాపారులు కూడా బాబా చర్యకి విస్తుపోయారు.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles