Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
శరీరంలో విషం పాకినంత మేరా పిల్లాడు కళావిహీనంగా కనిపించాడు. ఎప్పుడయితే బాబా కసరి, కిందికి దిగమన్నారో అప్పుడు విషం కిందికి దిగినట్టుంది, పాము కాటేసిన చోట తప్ప, పిల్లాడిప్పుడు జీవకళతో ప్రకాశించసాగాడు.
శ్యామాకిప్పుడు బాగా అర్థమయింది. బాబా ఆగమన్నది విషాన్ని. పిల్లాడిలో ప్రవహించకుండా ఆగమని హెచ్చరించారు దాన్ని. అంతే! ఆగిపోయింది.‘‘బాబుకేం కాదు, భయపడకండి.’’ అన్నారు బాబా.
పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అక్కణ్ణుంచి ముందుకు కదిలారు. చిట్టడవిలోకి ప్రవేశించారు. పిల్లాడిని కాటేసిన పాము కోసం కోపంగా అటూ ఇటూ చూడసాగారు.కనిపించింది పాము. పొద చాటుగా పడగ విప్పి నిల్చుంది.‘‘దొరికావు’’ అన్నారు బాబా.
అటుగా అడుగులు వేశారు. పారిపోయేందుకు ప్రయత్నించింది పాము. పట్టుకున్నారు బాబా.‘‘ఎక్కడికి పోతావు? చెప్పిన మాట వినిపించుకోవేం?’’ కసిరారు దాన్ని. మోచేతికి చుట్టుకుని పోయి, పడగ విప్పి బుసలు కొడుతున్న పాముని హెచ్చరించారు.‘‘అల్లరి చెయ్యొద్దు.’’ అన్నారు. వెనక్కి తిరిగి వచ్చారు.
కాటేసిన చోట మంటగా ఉందే మో! ఊదుకుంటూ కూర్చున్న పిల్లాడి దగ్గరగా వచ్చారు. చేతిలో పాముతో అక్కడికి ప్రవేశించిన బాబాని చూసి ఆశ్చర్యపోయారంతా.
కొందరు భయపడ్డారు. శ్యామాకయితే నోట మాట లేదు. విషాన్ని హెచ్చరిస్తాడు. పాముని పట్టుకుని నిలబడతాడు. సాధారణ మానవుడు కాదియన.
అయితే అటు శివుని అంశతో జన్మించి ఉండాలి. లేదంటే ఇటు విష్ణువు అంశతో వర్ధిల్లి ఉండాలనుకున్నాడు శ్యామా.
‘‘ఎవరి అంశతో జన్మిస్తేనేం? ముందు బాబు బతకాలి. మనకి కావాల్సింది అదే’’ అన్నారు బాబా, శ్యామాని చూస్తూ. శ్యామా మరింతగా ఆశ్చర్యపోయాడు.
మనసులో తను అనుకుంటున్న ప్రతి మాటా బాబాకి తెలిసిపోతోంది. ఇదెలా సాధ్యం? బాబా తన గుండెల్లో లేడు కదా? అనుకున్నాడతను.‘‘ఎందుకు లేను?
నన్ను నమ్మిన వారి గుండెల్లోనే కాదు, భక్తుల అణువణువునా నేను ఉన్నాను.’’ అన్నారు బాబా. శ్యామాని నవ్వుతూ చూశారు. చేతులు జోడించి నమస్కరించడం తప్ప చేసేదేమీ లేకపోయింది శ్యామాకి.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (2వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (5వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (4వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (3వ. భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments