సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 2 వ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం…

బాబా కి కొబ్బరికాయ సమర్పిస్తే బాబా బిడ్డని ప్రసాదించే వృత్తాంతాలు మనం సచ్చరిత్రలో చదివాము. అందువలన షిర్డీ లో బాబా కి కొబ్బరికాయ ఇవ్వాలని అనుకున్నాను. ఎందుకంటే బాబాకి నేను కొబ్బరికాయ ఇస్తే  బాబా నాకు బిడ్డను ఇస్తారని నాకు అనిపించింది. సమాధి మందిరంలోనికి కొబ్బరికాయను సెక్యూరిటీ గార్డ్స్ తీసుకు వెళ్ళనివ్వలేదు. బాబాకి ఏదైనా యిస్తామనుకుంటే బాబా మన నుండి దానిని ఎలాగైనా తీసుకుంటారు కదా! అని నేను మనసులో  అనుకుంటున్నాను. మరి నా దగ్గర ఎలా తీసుకుంటారు బాబా అనుకుంటూ బాబా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అప్పుడు మా మదర్ టీ త్రాగుదామన్నారు. టీ షాప్ కి వెళ్లి టీ త్రాగుతున్నాము. ఆ షాప్ పక్కన కొబ్బరికాయల షాప్ ఉంది. మేము టీ త్రాగి అక్కడి నుండి బయలుదేరాము. అప్పుడు చక్కని చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చి నా చేయి పట్టుకొని నాకు కొబ్బరి బొండం కావాలి ఇవ్వు అని అడిగాడు. నేను ఆ షాప్ అతనిని రేటు యెంత అని అడిగాను. పెద్దది 50, చిన్నది 40 రూపాయలని చెప్పారు. అప్పుడు నేను చిన్నది ఇవ్వు అని షాప్ అతనికి చెప్పను. కానీ ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు. నాకు పెద్దది కావాలని మారాము చేసాడు. అప్పుడు నేను చివరకు వాడి ఇష్ట ప్రకారం పెద్ద కొబ్బరి బొండం కొని ఇచ్చాను. ఆ పిల్లవాడు త్రాగుతున్నాడు. అప్పుడు మా వారు మొత్తం మీద బాబాని ఏడిపించావు అని అన్నారు. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది బాబా నేను ఇస్తాను అనుకున్న కొబ్బరికాయ నువ్వు ఎలా తీసుకుంటావో అనుకున్న విషయం. వెంటనే వెనకకు తిరిగి బాబుని చూసాను. కానీ బాబు ఎక్కడ కనిపించలేదు. ఆ రూపంలో బాబా నేను ఇస్తానన్న కొబ్బరికాయ స్వీకరించారని నాకు చాలా సంతోషంగా అనిపించింది.

మా షిర్డీ యాత్ర చాలా బాగా జరిగింది. స్వీట్ మెమోరీస్ మనసు నిండా పెట్టుకొని షిర్డీ నుండి వైజాగ్ వస్తున్నాము. వైజాగ్ లో వచ్చిన హుదుద్ తుఫాన్ వలన విజయవాడ వచ్చినప్పటికీ ట్రైన్స్ ఏవి వైజాగ్ వెళ్ళడం లేదు. అయిన నేను భయపడలేదు. అన్నింటికీ బాబా ఉన్నారు. బాబా చూసుకుంటారు అనుకున్నాను. కొద్దిసేపటికి స్టేషన్ మైక్ లో వైజాగ్ ట్రైన్ బయలుదేరుతుంది అని చెప్పారు. అలాగా వైజాగ్ వచ్చిన మొదటి ట్రైన్ మాదే.  వైజాగ్ లో దిగాము.  వైజాగ్ లో కరెంటు లేదు, వాటర్ లేదు. అంత భయకరంగా ఉంది. కాకపోతే మా ఇంట్లో మాత్రం నేను షిర్డీ బయలుదేరిన రోజు మోటర్ వేసి మరిచిపోవడం వలన, రెండు ట్యాంక్ లు నిండిపోవడం వలన మాకు ఒక వారం రోజులపాటు వాటర్ కి  ఎటువంటి ఇబ్బంది రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను బాబా ప్రతి నిమషం మమ్ము చూస్తూ మాకు ఏ ఇబ్బంది లేకుండా చేసారని.

3 నెలలు పోయిన తరువాత బాబా నాకు గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. నేను తల్లిని కొబోతున్నానని డాక్టర్ చెప్పారు. నిజంగా ఎంత సంతోషకరమైన విషయం సాయి ఫ్రెండ్స్. బాబా నాకు ఇంత గొప్ప గిఫ్ట్ యివ్వబోతున్నారా అని నా కంటి నుండి ఆనందభాష్పాలు. నేను చెప్పలేను సాయి ఫ్రెండ్స్ నా ఆనందానికి ఇంక అంతేలేదు. బాబాకి నేను, మావారు శతకోటి వందనాలు చెప్పుకున్నాము. డాక్టర్ నాకు ఆ రోజు నేను తల్లిని కొబోతున్నానని చెపుతుంటే అతను నాకు బాబా లాగానే అనిపించారు. నేను డాక్టర్ గారి కాళ్ళు పట్టుకొని ఇవి నా బాబా చరణాలు అని ఏడ్చేసాను. తరువాత డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు అని చెప్పారు.

కానీ నాకు మా ఇంటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో బ్యూటీ పార్లర్ ఉంది. షాప్ ని నేను చూసుకోవాలి. స్టాఫ్ ఉన్నారు కానీ నేను కూడా ఉండాలి. షాప్ కి వెళ్ళకపోతే కాదు. నాకు నా పుట్టబోయే బిడ్డ కూడా ముఖ్యమే. మరి ఏమి చేద్దామని ముందు భయపడ్డాము, ఆలోచించాము. కాని బాబా ఉన్నారు కదా భయం ఎందుకు? అన్ని బాబానే చూసుకుంటారు అని రోజు షాప్ కి వెళ్ళేదాన్ని. రాత్రి 8.30 కి వచ్చేదాన్ని. అందరు ఏన్నో తిట్టేవారు. పెద్దలు ఇంత లేటుగా ఇంటికి రాకూడదు, ఇలా తిరగాకూడదు, రెస్ట్ తీసుకోవాలి, ఇలా ఇంకెన్నో చెప్పేవారు. కానీ నేను ఎప్పుడు దేనికి ఆలోచించలేదు, భయపడలేదు, బాబా నాతో ఉన్నారు. నాకు ఏమి కాదు అనే ఒక గట్టి నమ్మకంతో 9 నెలలు పూర్తీ చేశాను. వారంలో ఒక్క రోజు ఇంటి దగ్గర ఉండేదాన్ని. మిగత రోజులు షాప్ కి వెళ్లి వస్తు ఉండేదాన్ని. సాదారణంగా ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో అందరు ఇంట్లో చిన్న పిల్లల  ఫోటో లు కనపడేలా పెట్టుకుంటారు. నేను మాత్రం బాబా ఫొటోలే ఇంటి నిండా ఎటుచూసినా కనపడేలా  పెట్టుకున్నాను. ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు, ఇంటి పని, షాప్ పని అన్ని నేనే చేస్తూ 9 నెలలు బాబా గారి దయవలన, బాబా తోడుతో జరిగిపోయాయి. డాక్టర్ నాకు నవంబర్ 8,2015 కి డెలివరీ డేట్ ఇచ్చారు. నవంబర్ 7 వరకు నా పనులు నేనే చేస్తూ వచ్చాను. ఈ 9 నెలలు బాబా నన్ను కంటి పాపలా కాపాడుతూ వచ్చారు. నా సాయి కి ఏమిచ్చి ఈ ఋణం తీర్చుకోగలను.

రేపు తరువాయి భాగం…..

సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 2 వ భాగం

సాయినాథుని ప్రణతి

మీ అనుభవం చాలా ఆనందాని కలిగిస్తుంది. మి లాగె నాకు బాబా ఒక మంచి ప్రండ్ ను ప్రసాదించారు .ఎంత మంచి ఫ్రండ్ అంటె అది మాటలలో చెపలెను నా పరిస్తితికి అనుగుణంగా నడుచుకుంటారు నా ఫ్రండ్ .ఒక్కోక్క సారి అనిపిస్తుంది నాకు బాబా నా ఫ్రండ్ రుపంలొ వచ్చి నాకు సహాయం చెస్తునారా అని.నా ఫ్రండ్ చెపిన మాట బాబా తన బిడ్డలను ఎనటికి వదిలి పెటరు అని .బాబాకు శతకోటి వందనాలు.

సాయినాథుని ప్రణతి

బాబా ఎది చెసిన మన శ్రెయస్సు కొసమె చెస్తారు ఒక సాయిబందువు చెపినమాట

True Akka ..but naa vishayam lo enduko okati late chestunnadu ..Mrg gurinchi tanaki teliyali epudu anedi ..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles