Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support by : Mrs Lakshmi
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఈ రోజు మా(సాయి సురేష్) సిస్టర్ సునిత కి పెళ్ళైన 14 సంవత్సరాలకి బాబా అనుగ్రహం తో బాబు పుట్టిన ఒక చక్కటి సాయి లీలను మీ ముందు ఉంచుతున్నాను.
ఇది టైపు చేస్తూ ఉంటే చంద్రాబాయి కి బాబా బిడ్డను అనుగ్రహించిన నాటి లీల నాకు గుర్తుకు వస్తుంది. ఆమెకు ఎలా బాబా రక్షణ అనుక్షణం ఉండేదో మా సిస్టర్ కి కూడా బాబా అలానే రక్షణ ఇచ్చారు. అంతటి అద్భుతమైన అనుభవం ఇది.
ఇక ప్రియ సాయి బంధువులరా మా సిస్టర్ అనుభవాలను తన మాటలలోనే చదవి ఈ సాయి లీలలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి.
ఓం సాయి రామ్. సద్గురు సాయి నాద్ మహారాజ్ కి జై, సాయి నాదునికి శతకోటి నమస్కారములు…
నా పేరు సునిత, మా వారి పేరు జయరాజు. మేము వైజాగ్ నివాసులము.
మా వివాహం జరిగి 14 సంవత్సరములు అయ్యింది. మా వివాహ జీవితంలో ఎటువంటి కలహాలు గాని, కష్టములు గాని ఎప్పుడు లేవు.
ఆనందముగా ఉండేవారము. కలహాలు, బాధలు లేకపోయిన ఏదో లోటు ఉండేది. కారణం మాకు పిల్లలు లేకపోవటం. ఏన్నో పూజలు చేసాము.
వైజాగ్ లో ఉన్న డాక్టర్స్ అందరిని కలిసాము. కానీ లాభం లేకపోయింది.
మా జీవితం పువ్వులు లేని చెట్టులా కనిపించేది. యెంత ఉన్న ఆనందం లేదు మా జీవితంలో. కొన్ని సంవత్సరములు గడిచిన తరువాత నాకే తెలియకుండా బాబా గారికి దగ్గర అయ్యాను.
బాబా కోసం ఎక్కువ అలోచించేదాన్ని. ఎప్పుడు బాబా నాతో ఉన్నారు అనే భావన నాలో ఎక్కువ అయ్యింది.
అన్ని విషయాలు బాబాతో షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. బాబాతో రోజు ఫోటోలో చూసి మాట్లుడుకునేదాన్ని. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేస్తున్నా బాబా నాతోనే ఉన్నారు అనే నమ్మకం నాలో ఎక్కువ అయ్యింది.
కొన్ని రోజుల తర్వాత మా చిన్నాన్న గారికి ఆరోగ్యం బాగాలేదు. చిన్నాన్నని వైజాగ్ కేర్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు.
అప్పుడు మా చిన్నాన్న గారి అబ్బాయి సాయి సురేష్ (అవును మీ అందరికి తెలిసిన సాయి సురేష్) మా బ్రదర్ తో టైం స్పెండ్ చేసే అవకాశం కుదిరింది.
మా బ్రదర్ తో ఎప్పుడు కలిసిన బాబా కోసమే మాట్లాడేవాళ్ళం. అప్పుడు ఇంకా కొన్ని నాకు తెలియని విషయాలు బాబా గురించి తెలిసాయి. అప్పుడు బాబా పట్ల నా అవగాహన ఇంక విస్తృతమైంది.
బాబా మీద విశ్వాసం ఇంక బలపడింది.
ఎప్పటి నుండో నేను మా వారు షిర్డీ వెళ్ళాలని అనుకొనేవాళ్ళం కానీ వెళ్ళలేకపోయేవాళ్ళం.
నాలో నేను బాబాని నా బిడ్డగా భావించేదాన్ని. ఎవరైనా నాకు పిల్లలు లేరా అని అడిగితే, బాబా యే నా బిడ్డ అనేదాన్ని. బాబా నాకు బిడ్డను ఇస్తారు, లేకపోయిన పరవాలేదు బాబా ఉన్నారు కదా అని ఎప్పుడు అనేదాన్ని. బాబాతో ఎప్పుడు “బాబా నాకు బిడ్డని ఇవ్వండి. కానీ నేను షిర్డీ వచ్చిన తరువాత ఇవ్వండి”
అనేదాన్ని. సాయి ఫ్రెండ్స్ ఇవి అన్ని బాబాకి నాకు మద్య జరిగిన సంభాషణలు. ఈ రోజు మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గాని నన్ను మీరు పిచ్చిదాన్ని అనుకోవద్దు.
అప్పుడు మా జీవితంలో ఎప్పుడు లేని ఒక అనుభవం జరిగింది. మా ఇంటిలో ఉన్న ఫిష్ ఎక్వేరియం లో చేపలు పిల్లలు పెట్టాయి. మేము చాలా సంతోషించాము.
అప్పుడు నాకనిపించింది. నాకు బిడ్డను ఇవ్వటానికి బాబా షిర్డీ రమ్మంటున్నారు అని. షిర్డీ వెళ్ళటానికి మేము రిజర్వేషన్ చేయించుకున్నాము.
మా తో పాటు మా అమ్మగారు వస్తానంటే ఆమెకి కూడా రిజర్వేషన్ చేసాము. నా ఆనందానికి అవధులే లేవు. స్ట్రీట్ లో అందరికి షిర్డీ వెళ్తున్నామని చెప్పాను.
షిర్డీ బయలుదేరే రోజు ఉదయం 4 గంటలకు తయారవటానికి ముందు వాటర్ ట్యాంక్ లో నీరు లేవని మోటార్ వేసి మర్చిపోయాము.
మొత్తం మా మెడ మీద ఉన్న రెండు ట్యాంక్ లు నిండిపోయి వాటర్ మేడపై నుండి క్రిందకి పైపు ద్వారా పోయింది. అలా పైపు ద్వారా వాటర్ వెళ్ళినప్పుడు శబ్దం అతి భయంకరంగా వచ్చింది. ఆ శబ్దం విని భయం వేసింది.
అప్పుడు బాబా ఏదో చెప్తున్నారు అని అనిపించింది. బాబా అంత నీ దయ, అంత మంచే జరగాలని బాబా ని తలుచుకొని రైల్వే స్టేషన్ కి బయలుదేరాము.
బాబా దయ వలన ప్రయాణం చాలా చక్కగా జరిగి షిర్డీ చేరుకున్నాము.
షిర్డీ లో మొదటిసారి అడుగుపెట్టి, కాసేపట్లో బాబా దర్శనం చేసుకోబోతున్నమనే ఆనందంలో ఉబ్బితబ్బుబ్బి అయ్యాను. రూమ్ కి వెళ్లి స్నానాలు చేసి బాబా దర్శనానికి వెళ్ళాము.
బాబాని మొదటిసారి చూడగానే నాకే తెలియకుండా నా కళ్ళు నిండి నీరు నిండిపోయాయి. ఆనందంతో కళ్ళ నుండి నీరు వచ్చాయి. మొదటిసారి బాబాని చూసినప్పుడు బాబా తప్ప నాకు ఇంకేమి కనిపించలేదు.
శిర్దిలో ఐదు రోజులు ఉన్నాము. ఈ ఐదు రోజులలో కాకడారతి, మధ్యాహ్నరతి, సంధ్య హారతి, శేజారతి అన్ని చూసాము. ఈ ఐదు రోజులలో ఎంతో ప్రశాంతత పొందును. బాబా మాటలలో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చారు. మనసంతా ఆనందం తో నిండి పోయింది.
అదే సమయంలో వైజాగ్ లో హుధుదు తుపాన్ వచ్చింది. వైజాగ్ అంతా నాశనం అయిపొయింది.
అప్పుడు నాకు అర్ధం అయ్యింది. మేము బయలుదేరే రోజు ఆ భయంకర సంకేతం బాబా ఇచ్చి. ఏదో ప్రళయం రాభోతుందని బాబా సూచించారని.
రేపు తరువాయి భాగం…..
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 2 వ భాగం
- సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 3 వ భాగం
- బాబా గురువుగారి అనుగ్రహం వల్ల మగ బిడ్డ ప్రసవం.
- మాకు షిర్డీ వెళ్లి బాబా ని దర్శించుకోవటమే పెద్ద పండుగ.
- బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 1 వ భాగం–Audio”
సాయినాథుని ప్రణతి
December 22, 2016 at 10:32 amఈ లీల చదివి చాలా ఆనందాని పొందం.మల్లి శిరిడీలోని అనుభుతులను ఆస్వదించె బాగ్యనిప్రసాదించరు మన సాయిబాబా
sreenivas Murthy
December 23, 2016 at 6:01 amగురువారం మంచి లీల షేర్ చేసారు సాయి