సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 3 వ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం…

నవంబర్ 8 వ తేది ఉదయం సాయి టెంపుల్ కి వెళ్లి అక్కడి నుండి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. అందరు భయపడ్డారు. ఈ పిల్ల చెపితే వినలేదు, రెస్ట్ తీసుకోలేదు ఏమౌతుందో అని అందరికి ఒకటే భయం. అప్పుడు బాబా చూపించారు అద్భుతం. 5kg లా బరవుతో చక్కని బాబు పుట్టాడు. అందరు ఆశర్యపోయారు. భలే పుట్టాడని అందరు ఆనందించారు. చూసారా బాబా నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో. బాబు కి సాయి పుష్కర్ అని పేరు పెట్టాము, ముద్దగా సాయి కొడుకు అని పిలుస్తాను. బాబు కి వన్ మంత్ అయిన తర్వాత నుండి మళ్ళి నేను షాప్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. రోజు బాబుని కూడా తీసుకోని వెళ్ళేదాన్ని. చిన్న పిల్లాడిని అలా తిప్పకూడదు గాలి, దూలి వస్తుంది అని అందరు అన్నారు. కానీ బాబా ఉన్నారు. ఆయనే చూసుకుంటారని రోజు బాబుని షాప్ కి తీసుకోని వెళ్ళేదాన్ని.  నా బాబుకి ఇప్పుడు 13 నెలలు వచ్చాయి. నమ్మండి సాయి ఫ్రెండ్స్ ఒక్క రోజు కూడా దిష్టి తీయడం లాంటివి ఏమి చేయలేదు. ఇప్పటివరకు నా సాయి కొడుకుకి చిన్న జలుబు గాని, విరోచనాలు గాని, ఇంక ఇటువంటి సమస్య గాని రాలేదు. రోజు బాబా విభూతి పెడతాను అంతే. బాబా నా బిడ్డకి ఏ ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అనుక్షణం బాబా తోడూ ఉంటె భయం ఎందుకు? నా బాబా నా కొడుకు రూపంలో నా తోనే ఉన్నారు. నా కొడుకు చిరునవ్వులో బాబా కనిపిస్తారు. ఇంత అందమైన కొడుకు, ఎప్పుడు నవ్వుతు ఉన్న కొడుకుని చూస్తూ ఉంటె నాకు అనుక్షణం బాబా నే గుర్తు వస్తారు.

సాయి సురేష్:  ఇప్పుడు నేను మా సిస్టర్ షిర్డీ నుండి వచ్చిన నుండి  తన ప్రగ్నేన్సి కన్ఫర్మ్ అని తెలిసిన మద్య  మూడు నెలలలో జరిగిన ఒక అనుభవాన్ని చెప్తాను. మా డాడీ హాస్పిటల్ లో ఉన్న సమయంలో మా సిస్టర్ కి బాబా పట్ల ఉన్న అమితమైన ప్రేమను చూసాను. వాళ్ళు షిర్డీ వెళ్లి వచ్చిన తర్వాత నాకు నవంబర్ లో తనకు బాబా విగ్రహం ఇవ్వాలని ప్రేరణ కలిగింది. బాబా ని అడిగితే అయన కూడా సమ్మతించారు. కానీ నేను మా సిస్టర్ ని అడిగినప్పుడు తను ఏవో కొన్ని కారణాల వలన సుముఖంగా లేరు. బాబా అనుగ్రహం ఉంది కాబట్టి ఆయనే తను అంగీకరించేటట్లు చేస్తారు అని నేను ఊరుకున్నాను. జనవరి నెలలో సంక్రాంతికి మా సొంత ఊరు వెళ్లి తిరిగి వైజాగ్ వెళ్ళేటప్పుడు మా సిస్టర్, బావ మా ఇంటికి వచ్చారు. అప్పుడు మా ఇంట్లో బాబా ని చూసి తను ఎంతగానో మురిసిపోయింది. కాసేపు అలానే బాబా ను చూస్తూ ఉండిపోయింది. అప్పుడు మళ్ళి తనకి నేను బాబా విగ్రహం ఇస్తాను అన్న ప్రస్తావన వచ్చింది. అప్పుడు నేను తన సందేహాలకు కొంత వివరణ ఇచ్చాను. అప్పుడు తను సరే నేను అలోచించి నా నిర్ణయం చెప్తానని అన్నారు. ఫెబ్రవరి నెల మొదటి వారం లో మా సిస్టర్ తన అంగీకారాన్ని తెలిపారు. సరే బాబా ఏ రోజు నిర్ణయిస్తే ఆ రోజు బాబా విగ్రహం తీసుకుందాం కొంచెం వెయిట్ చేయమని చెప్పను. కొన్ని కారణాల వలన డిలే అవుతూ చివరికి బాబా ఏప్రిల్ 14, 2015 ఏకాదశి రోజు విగ్రహం తీసుకోమని సూచించారు. బాబా నిర్ణయ ప్రకారం ఏప్రిల్ 14 న విగ్రహం తీసుకోని ఏప్రిల్ 15 న మొదటి అభిషేకం, పూజ బాబాకు చేసుకున్నాము. అప్పుడు మా సిస్టర్ చాలా గుడ్ న్యూస్ చెప్పింది. ఏమిటంటే ఆ రోజు నుండి తనకి మూడో నెల అని. ఆ వార్త వినగానే నాకు చాలా సంతోషమనిపించింది. పెళ్ళైన 14 సంవత్సరాలకి తను ప్రగ్నేంట్ అంటే అమితంగా తనను నమ్ముకున్న తన బిడ్డకి బాబా ఇచ్చిన అత్యంత అద్భుతమైన వరం అనిపించింది. అప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చి మా సిస్టర్ ని అడిగాను. అదేమిటంటే బాబా విగ్రహం తీసుకోవడానికి తను అంగీకరించిన తర్వాత ప్రగ్నేన్సి కన్ఫర్మ్ అయ్యిందా అని. అప్పుడు తను అవునని చెప్పింది. అంటే మా సిస్టర్ బాబా విగ్రహం తీసుకోవడానికి అంగీకారం తెలిపిన ఒక వారంలో బాబా మా సిస్టర్  కి ఈ వరాన్ని ఇచ్చారు. మా సిస్టర్  మొదటినుండి బాబా నే తన బిడ్డగా భావించేది. అందువలన బాబా తన పెద్ద కొడుకుగా(తల్లి,  తండ్రి, గురువు,  దైవం, సర్వం తానుగా)  ముందుగా ఇంటికి వచ్చి, మా సిస్టర్ కు ఆ తొమ్మిది నెలలు ఏ కష్టం లేకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా వాడిని కూడా ఎల్లవేళలా సంరక్షిస్తున్నారు. ఒకటేమిటి అన్నివిధలా మా సిస్టర్ ని, బావగారిని, సాయి కొడుకుని ఆ ఇంటి పెద్ద కొడుకులా అన్ని సందర్భాలలోనూ తోడుగా ఉండి కాపాడుకుంటున్నారు.
సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 3 వ భాగం

kishore Babu

How Sai is taking care about Her and HER Son..She is really Lucky.Sai Baba…Sai Baba.

సాయినాథుని ప్రణతి

Wonderful experience .saibaba . Saibaba….

బాబా లీలల మీద ఏ మూలో కొద్దిగా సందేహం ఉన్న సాయి భక్తులకు సునీత గార్కి బాబా వారు ఇచ్చిన లీలలు నిజముగా సందేహములను నివృతి చేసేవే…..సాయి బాబా…సాయి బాబా….సాయి బాబా

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles