సాయి భక్తుడు రామకృష్ణ అనుభవాలు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

సాధారణంగా నేను చిన్నప్పుడు 13 సంవత్సరముల వరకు అయ్యప్ప భక్తుడను. 13 నుండి 22 ఇయర్స్ వరకు టెంపుల్స్ కు చాల దూరంగా ఉన్నాను.

ఒక రోజు నేను సనత్ నగర్ , హైదరాబాదు బాబా గుడికి వెళ్ళాను . మొట్ట మొదట బాబా గుడికి వెళ్ళినప్పుడు బాబా ముఖం లో నవ్వు కనిపించింది. బాబాగారిని చూస్తుంటే చాల సంతోషం అనిపించింది.

అప్పటినుంచి ప్రతి గురువారం బాబా శేజ హారతి కి వెళ్ళడం మొదలుపెట్టాను. అలా మొదలు పెట్టి ఇప్పటికి మిస్ కాలేదు. కొన్ని రోజులకు కొంతమంది భక్తుల ద్వార బాబా గురించి వింటుంటే చాల సంతోషంగా ఉండేది.

ఆ క్రమంలో చాల హ్యాపీ గా ఉన్నాను. బాధలు ఉన్న గుర్తు రాకుండా ఉండేవి.

తర్వాత బాబా ఫోటో తీసుకోని రూమ్ లో పూజ రోజు చేస్తూ, రోజు టెంపుల్ కి వెళ్ళటం అలవాటు అయ్యింది. ఏదైనా రోజు టెంపుల్ కి వెళ్ళాక పొతే ఆ రోజు ఏదో మిస్ అయ్యాను అనిపిస్తుంది.

రోజు బాబా గుడికి వెళ్తూ గుడిలో ఉన్నది, రూమ్ లో ఉన్నది బాబా నే కదా గుడి లో పూజ ఒకసారి చేస్తే చాలు మళ్ళి రూమ్ లో ఎందుకని రూమ్ లో పూజ మానేసాను.

కానీ బాబా గారు 11 వ రోజు నాకు  కలలో కనిపించి “నీ రూమ్ లో కూడా పూజ చేస్తూ ఉండు నేను నీ ఇంటిలోనే ఉన్నాను” అన్నారు.

కొన్ని రోజుల తర్వాత శేజ హారతి కి వెళ్ళడం సడన్ గా కొన్ని రోజులు మానేసాను. అప్పుడు బాబా స్వప్నం లో కనిపించి “హారతి కి వెళ్ళు” అని చెప్పారు.

మా ఇంటిలో అందరు షిర్డీ వెళ్లారు. కానీ నేను జాబు వలన వెళ్ళలేకపోయాను. బాబా నన్ను వదిలి అందరిని షిర్డీ కి పిలుచుకున్నావు అని నేను బాధ పడ్డాను.

సరిగా 11 వ రోజు ఆఫీస్ పని మీద షిర్డీ వెళ్ళాల్సివచ్చింది. ఏ జాబు వలన నేను ముందు షిర్డీ వెళ్ళలేక పోయానో అదే జాబు పని తో నన్ను బాబా షిర్డీ పిలిపించుకున్నారు. నాకు చాల సంతోషం అనిపించింది.

బాబా దయామయుడు. మొదటి నుండి నన్ను వదలకుండా వెంటే ఉన్నారు.

బాబా కు 108కిలోల పంచదార తో అభిషేకం చేయాలి అనిపించింది. కానీ దానికి కావలిసిన అమౌంట్ నా దగ్గర లేదు. అది బాబా నే సమకూరుస్తారు అనుకున్నాను.

బాబా “నా భక్తుల సత్సంకల్పలు నేను నెరవేరుస్తాను” అన్నారు కదా! అలానే కొన్ని రోజుల తర్వాత వివిధ రకాలుగా బాబా అభిషేకం చేయించుకున్నారు.

మా సిస్టర్ పెళ్లి విషయం బాబా పై నమ్మకం తో ఆయనపై వదిలితే సమయానికి బాబా సహాయం చేసారు. మా సిస్టర్ కి పెళ్ళైన సంవత్సరం తర్వాత చాల సమస్యలు ఉండేవి.

నాకు చాల బాధగా అనిపించేది. కానీ చేసిన కర్మ అనుభవించాలి కదా! బాబా నువ్వు దిక్కు అని బాబా కే వదిలివేశాను.

మా సిస్టర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు మేనకోడలు పుట్టాలని కోరిక. బాబా అనుగ్రహం వలన గురువారం నాకు మేనకోడలు పుట్టింది.

తన పేరు సాయి ప్రసన్న. రెండవ సారి మేనల్లుడు కూడా గురువారం రోజే పుట్టాడు. బాబు పుట్టడానికి ముందే బాబా స్వప్నంలో బాబు పుడతాడని చూపించారు.

ఇక్కడ సనత్ నగర్ బాబా గుడిలో ఏది అనుకున్న చాల త్వరగా జరుగుతుంది.

ఉదాహరణకు పంచదార తో, తమలపాకులతో అభిసేఖం జరిగాయి. కానీ సాయి సత్యవ్రతం చేయాలి అన్న నా కోరిక ఒక సంవత్సరం  వరకు నెరవేరలేదు.

ఒక సంవత్సరం తర్వాత అనుకోకుండా ఒకరోజు పంతులు గారు నాతో మే 21, 2016 పౌర్ణమి రోజున వ్రతం చేద్దాం అన్నారు. నాకు చాల సంతోషం కలిగింది.

నేను ఉహించానేలేదు బాబా సరిగా మా సిస్టర్ పెళ్లి రోజున సాయి సత్యవ్రతం చేయడానికి అనుమతిని ఇవ్వటం చాల ఆనందాన్ని కలిగించింది.

మా సిస్టర్ బావ హ్యాపీ గా ఉన్నారు. ఆ రోజు నుండి మా బాబా గుడిలో ప్రతి నెల పౌర్ణమికి ఆపకుండా సాయి సత్యవ్రతం చేయాలని సంకల్పించుకొని మొదలు పెట్టం. అలా మొదలు పెట్టిన తర్వాత నాల్గవ పౌర్ణమికి చేసిన సత్యవ్రతం నాడు బాబా గులాబి రేకు మీద దర్శనం ఇచ్చారు. ఇది  నా జీవితంలో అద్భుత విషయం.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయి భక్తుడు రామకృష్ణ అనుభవాలు–Audio

నమ్మి కొలిస్తే చాలు. నేనున్నాను అని పలికే ధైవము మన దేవాది దేవుడు.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles