Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ప్రతీ రోజు నాకు సాయి అనుభవాలు — రవి
కొంతమంది సాయి భక్తులు ప్రతీ రోజూ ఆయన లీలలను అనుభవిస్తున్నారన్నది నిజం. ఈ రోజు నేను ఒక భక్తునికి బాబా వారు ప్రతీరోజు ఏదో విధంగా తమ దర్శనాన్ని కలుగచేస్తున్న లీలని మీకు చెపుతాను. నేను రవిగారి మెయిల్ చదువుతున్నప్పుడు ఆయన యెన్నో విషయాలని చెపుతున్నట్లుగా నాకు అనిపించింది. నేను రవి మెయిల్ చదువుతున్నప్పుడు అందులో నాకు అతనికి బాబా మీద ఉన్న ధృఢ భక్తి కనపడింది. నేను రవి మెయిల్ జత చేస్తున్నాను.
బాబా దయవల్ల నేను కూడా బాబా భక్తుడినే. నాకు ప్రతీరోజు ఆయన అనుభవాలు కలుగుతున్నాయి. ఆయన కటాక్షం నా మీద, నా కుటుంబం మీద ఉన్నందుకు నేను మనస్పుర్తిగా కృతజ్ఞుడను. మనం కనక ప్రతీ క్షణం గడిచేకొద్దీ సాయిని ప్రార్థించినా, గుర్తు చేసుకుంటూవున్నా, అప్పుడు బాబా తప్పకుండా ప్రతీరోజు చక్కటి లీలలతో మనలని అనుగ్రహిస్తూ ఉంటారని నేను భావిస్తున్నాను.
ఆయన విధానం కొంచెం వేరుగా ఉంటుంది. ఒక్కోసారి ఆయన తన ఉనికిని , ఈ-మెయిల్స్ ద్వారా, స్నేహితుల ద్వారా, ఉద్యోగాల ద్వారా, లేక ఏమైనా బాధాకరమైన అనుభవాల ద్వారా, కలలు, ఆర్థిక నష్టాలు వగైరా, ఇలా ఆయన దివ్య చర్యల జాబితా అంతం లేనిది.
సాయి బోధనల నుండి నా అనుభవం 1990 నుండి ఉంది. ప్రతీ సంఘటన కూడా మంచి అవనీ, చెడు అవనీ నాకు గురువారమునాడే (బాబా వారము) జరుగుతున్నాయి. నా వివాహము గురువారము నాడు జరిగింది. మా యిద్దరు అబ్బాయిలు కూడా గురువారమునాడే జన్మించారు.
నేను భారతదేశానికి వచ్చేముందు చాలా విపరీతమైన నడుము నొప్పి ఉండేది. అప్పుడు నేను సచ్చరిత్ర చదువుతున్నాను. దాని వల్లే బాబా నా నడుము నొప్పిని తీసివేశారు.
నాకు మెడ కూడా తిప్పలేనంతగా స్పాండిలైటిస్ ఉంది. ఆఖరికి బాబా ఊదీ వల్ల ఆపరేషన్ లేకుండా ఒక అద్భుత లీలగా నయమయింది.
2004 ఫిబ్రవరిలో బాబా దయవల్ల షిరిడీ దర్శించుకున్నాను. షిరిడిలో 7 రోజులు ఉన్నాను. నేను షిరిడీ నించి తిరిగి వచ్చిన తరువాత, నేను యు.ఎస్.ఏ. లో అడుగుపెట్టగానే సాయి నాకు ఉద్యోగం ఇచ్చారు.
సాయి నాకు మంచి విద్యనిచ్చారు. విజయవంతంగా నేను ఫుడ్ మరియు న్యూట్రిషన్ డీటాక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను.
చిన్న విగ్రహం కొనుక్కోవడానికి సాయి నాకు అవకాశమిచ్చారు, అది యెన్నోవిధాలుగా అద్భుతమైనది. సుందరమైన ఆ చిన్న విగ్రహంలో బాబా సజీవంగా ఉన్నారు.
జీవితంలో నాకెప్పుడైనా ప్రశ్న గాని, సమస్య గాని ఎదురైనప్పుడు, సంజ్ణలకోసం ఆకాశంలోకి చూస్తాను. బాబా తగిన సూచన చేస్తారు. చాలా సార్లు నేను “ఎస్” ( “S” ) గుర్తులు ఆకాశంలో చూశాను.
అప్పుడప్పుడు నేను కాగితం మీద, “అవును”, “కాదు” అని రాసి చీటీలు వేసి మా అబ్బాయి చేత బాబా సమాధానం కోసం తీయిస్తాను. చీటీ ద్వార ఏది వస్తే అది బాబా సందేశంగా బావించి తదనుగుణంగా నడుచుకుంటాను.
మీతో నా అనుభవాలని పంచుకుంటున్నందుకు నాకు చాలా అనందంగా ఉంది. జీవితంలో ప్రతీ వారికి బాబా అనుభూతులనిచ్చుగాక. ఏ లీలలను చదివినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒకేసారి తన బిడ్డలనందరినీ సమంగా రక్షిస్తున్నందుకు సాయికి కృతజ్ణతలు చెపుతున్నాను.
మీకు కూడా ఏమైనా అనుభవాలు ఉంటే రవిగారిలాగే అందరితో పంచుకోండి.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆ రోజు రాత్రి కలలో బాబా కన్పించి నాకు సెకండ్ హ్యండ్ మైకు సెట్టు ఒద్దు–Audio
- ఆ రోజు రాత్రి బాబావారు నాకు కలలో కనిపించి ఎందుకు భయపడుతున్నావు?—Audio
- గురుపౌర్ణమి రోజు భక్తురాలి ఇంటికి వెళ్లిన బాబా వారు.
- సాయి భక్తుడు రామకృష్ణ అనుభవాలు–Audio
- నన్ను ఆరోగ్యవంతున్ని చేసి, నా కుమార్తె వివాహం జరిపించిన బాబా వారు…రవి కుమార్
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ప్రతీ రోజు నాకు సాయి అనుభవాలు — రవి”
Maruthi.Velaga
February 13, 2017 at 8:09 amJai Saibaba..