Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై !! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై !!
నా పేరు అమరేశ్వరి. మాది తెనాలి.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-102-ఆ రోజు రాత్రి బాబావారు నాకు కలలో కనిపించి 5:03
నాకు బాబా ప్రసాదించిన అనుభవమును మీ అందరితో పంచుకుంటున్నందుకు చాల సంతోషంగా ఉంది.
అప్పుడు నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రేపు ఫిజిక్స్ పరీక్ష అనగా ముందు రోజు రాత్రి నాకు చాలా కడుపునొప్పి, నీరసంగా ఉంది.ఆ రోజు రాత్రి నేను అసలు ఏమి చదువలేక పోయాను.
నాకు ఎలాగైనా ఆ పరీక్షలో కనీసం పాస్ మార్కులు అయిన వస్తే చాలని బాబాను గట్టిగా వేడుకొన్నాను.
పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత చూసుకుంటే ఆ ఫిజిక్స్ పరీక్షలో 60 మార్కులకు గాను 21 మార్కులు వచ్చాయి. ఖచ్చితంగా 21 మార్కులకే పాస్ మార్కులు.
బాబా వారు నా మోర విని నా కోరిక తీర్చారని నాకు చాలా అద్భుతం, ఆశ్చర్యం వేసింది.
తరువాత ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చాయని చెప్పారు.
ఆ రోజు రాత్రి నాకు సరిగా నిద్ర పట్టడం లేదు.ఎందుకంటే నాకు ఎలాగైనా 1000కి 700 పైగా మార్కులు వస్తాయా? రావా? అని అనుకుంటున్నాను.
ఆ రోజు రాత్రి బాబావారు నాకు కలలో కనిపించి ఎందుకు భయపడుతున్నావు?
నీకు కరెక్ట్ గా 734 మార్కులు వచ్చాయి అని అన్నారు. తరువాత మా నాన్న గారు నాకు అప్పుడే ఫోన్ చేసి నా రిజల్స్ కనుక్కొని నాకు చెప్పారు. సరిగ్గా బాబావారు కలలో చెప్పినట్లుగానే నాకు 734 మార్కులు వచ్చాయి.
ఇది ఆశ్చర్యము కదా! అప్పుడు నాకు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు సింగ్వే అను పూరి నుండి వచ్చిన ‘అనంతమాధవ్ కులకర్ణి’ అనే విద్యార్దికి కూడా ముందుగానే పరీక్షలలో నీకు 114వ ర్యాంకు వస్తుందని చెప్పిన విషయం నాకు గుర్తుకు వచ్చింది.
తరువాత నేను డిగ్రీలో ఉన్నప్పుడు అర్దసంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి.
మ్యాథ్స్ లో 100కు 75 (లేక) 80 మార్కులు రావాలని అన్నారు. ఆ రోజు నేను జవాబుపత్రములో చేసిన లేక్కలికి కరెక్ట్ గా వచ్చేది 70 మార్కులే కాని ఒక లెక్క 5 మర్కులది చేశాను.
కాని అది తప్పని తెలిసింది. అప్పుడు నాకు చాలా భయం వేసింది. 70 మార్కులే వస్తాయి ఎలా ఏమి చేయాలి అనిపించింది. ఆ లెక్క ఎలాగోలా కరెక్ట్ అయితే బాగుండని బాబావారిని వేడుకున్నాను.
రెజల్ట్ వచ్చిన తరువాత చూసుకుంటే కరెక్ట్ గా 75 మార్కులు వచ్చాయి. నా ఆనందానికి అవధులు లేవు. పిలిచినంతనే పలికే దైవము నా బాబానే అని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను.
తరువాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పాస్ అవుతానో లేదో అని అనుకున్నాను. తరువాత రిజల్ట్ చూసుకుంటే 62% వచ్చింది.
అలాగే డిగ్రీ సెకండ్ ఇయర్ పరీక్షలు బాగా వ్రాశాను. అప్పుడు అందరు పేపర్ వాల్యుషన్ చాలా కష్టంగా జరుగుతుందని అన్నారు. నేను బాబాను ప్రార్దించాను.
నేను ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ బాగా వ్రాశాను. ఈ సారి ఎక్కువ పర్సెంటేజ్ కుడా వస్తుంది అని అనుకున్నాను.
అప్పుడు బాబావారు నాకు కలలో కనిపించి “నాకు ఫస్ట్ ఇయర్ పర్సెంటే కన్నా సెకెండ్ ఇయర్ లో 78% వచ్చింది అని చెప్పారు. బాబావారు చెప్పినట్లుగానే జరిగింది.
తరువాత డిగ్రీ ఫైనల్ ఇయర్ కేమిస్ట్రి థర్డ్ పేపర్ లో అందరు ఒక ప్రశ్నకు జవాబు వ్రాశారు.
నేను కూడా రాశాను. కాని వాళ్ళు లెసన్ మొత్తం వ్రాస్తే నేను దానిలో సగం మాత్రమె వ్రాశాను. నేను ఫెయిల్ అవుతానేమోనని అనుకున్నాను.
అందరు భయపెట్టారు.కానీ తరువా ఒక రోజు నేను మా ఇంట్లో బాబావారి పూజ చేస్తుండగా నా ప్రక్కన వచ్చి ఎవరో కూర్చున్నట్లు, నా భుజంతట్టి, ఆ సబ్జెక్టులో నీకు మంచి మార్కులే వస్తాయి అని నాకు ధైర్యం చెప్పారు.
రిజల్స్ వచ్చిన తరువాత చూసుకుంటే ఆ సబ్జెక్టులో 100 కి 62 మార్కులు వచ్చాయి. నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో 84% వచ్చింది.
ఇలా అడుగడుగునా బాబావారు నా వెన్నంటేవుండి నాకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని కల్గించి నీతోనే నేను వున్నాను నాకు అభయమిచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు నేను మనసారా బాబావారికి సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటూ…మరిన్ని అనుభవాలు మీతో త్వరలో పంచుకోవాలని ఆశిస్తూ…
మీ గురుబంధువు
కె. అమరేశ్వరి,
తెనాలి.
సంపాదకీయం: సద్గురులీల (జూలై – 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆ రోజు రాత్రి కలలో బాబా కన్పించి నాకు సెకండ్ హ్యండ్ మైకు సెట్టు ఒద్దు–Audio
- బాబావారు కలలో కనిపించి ప్రసాదమిచ్చుట.—Audio
- బాబా మహిమ – సరస్వతి కటాక్షం
- మా పాపకు గురువుగారి దర్శనం అయినప్పటి నుండి అన్నీ తాను అనుకున్నట్లు జరుగుతూ ఉన్నాయి. – Audio
- కంప్యూటర్ అవగాహన ఏమాత్రం లేని నాకు GE కంపెనీ లో జాబ్ ఇప్పించిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments