ప్రేమగా పెడితే నేను ఏదైనా తింటానని తినకపోవడం అంటూ ఉండదని నాకు సందేశమిచ్చారు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-98-ప్రేమగా పెడితే నేను ఏదైనా తింటానని తినకపోవడం 3:06

నా పేరు ప్రియాంక, మా నివాసము హైదరాబాదు. నేను ఒకరోజు శిరిడీసాయి ఆరతి సి. డి,  చూస్తున్నాను   .ఆ సి.డి.లో బాబావారికీ  భక్తులు స్వీటు నివేదన చేస్తున్నారు.

అప్పుడు నేను “బాబా నువ్వు స్వీట్లు తింటావో లేదో తెలియకపోయినా, నీకు స్వీట్లు అంత ప్రేమగా పెడుతున్నారు.అని అనుకున్నాను.

మా అమ్మ వాళ్ళుకూడా మాకు అంత ప్రేమగా పెట్టారు అని భాధపడ్డాను.

నువ్వైనా మాకు స్వీటు తినిపించు అని అనుకున్నాను.

నేను ఆ విషయం గురించి తరువాత మరిచి పోయాను. కొన్ని రోజులకు మా అమ్మమ్మా వాళ్ళ  ఇంట్లో బాబావారి భజన జరిగింది.

ఆ రోజు భజనకి వెళ్ళె ముందర మా అమ్మ ఏమి తిసుకొనివెళ్ధామని అడిగితె నేను స్వీట్లు అని సమాధానమిచ్చాను.

అప్పుడు భజన జరిగేటప్పుడు నాకు “బాబావారి నోరు కదులుతున్నట్లుగా కనిపించింది”. నేను భ్రమ అనుకున్నాను. మరలా రెండవసారి చూడగా బాబావారి నోరు కదులుతున్నట్లుగా కనిపించింది. అప్పుడు నేను నా పక్కన ఉన్న మా అక్కను, మా మామయ్యను అడిగాను.

వాళ్ళు తమకు ఏమి కన్పించడం లేదని సమాధానమిచ్చారు. నేను మరలా పరిశీలనగా చూశాను.

అప్పుడు  నాకు బాబావారు స్వీటు(కలకండ) తింటున్నట్లుగా స్పష్టంగా కనిపించింది.నేను బాబా చిత్రపటాన్ని చూడసాగాను. అప్పుడు బాబావారు నాకు ఇలా చెప్తున్నారు. “నేను స్వీటు(కలకండ) తింటున్నాను.

నన్ను చూడు…నన్ను చూడు అన్నారు. అప్పుడు నేను “బాబా నువ్వు స్వీటు తింటే ఎవరికీ గొప్ప? నువ్వు అందరికి పెడితే అది గొప్ప అని అనుకున్నాను.

అప్పుడు నాకు నువ్వు తింటావో లేదో అని బాబావారిని అడిగిన విషయం మరచిపోయాను.

తరువాత భజన అయిపోయింది. ఆ రోజు ఎప్పుడు లేనిది మా అమ్మ నన్ను పిలిచి నా నోటిలో స్వీటు పెట్టింది. అప్పుడు నేను వెంటనే మా అమ్మగారి కాళ్ళు మొక్కాను. ఎందుకంటే నేను బాబాను స్వీటు తినిపించమని అడిగాను.

అందుకు ఆరోజు నాకు బాబా స్వీటు మా అమ్మగారి రూపంలో తినిపించారు.

కానీ నేను ఈ విషయం గ్రహించలేకపోయాను. కొన్ని రోజుల తరువాత నేను ఒక రోజు ఈ విషయం గురుంచి ఆలోచించాను. అప్పుడు నాకు బాబా ఇలా సమాధానమిచ్చారు. ” ప్రేమగా పెడితే నేను ఏదైనా తింటానని తినకపోవడం అంటూ ఉండదని నాకు సందేశమిచ్చారు”

“నాకు నా చిత్రపటానికి తేడాలేదన్న బాబావారి పలుకులకు నిదర్శనము!”

మీ గురుబంధువు,
ప్రియాంక,
హైదరాబాదు.

సంపాదకీయం: సద్గురులీల (పిబ్రవరి – 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles