Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ముందు భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఒక రోజు కలలో బాబాది పెద్దది పాలరాతి విగ్రహం కనిపించింది..అక్కడ కొందరు బాబాకి స్నానం చేయిస్తున్నారు.అభిషేకం )నేను దూరం నుండి చూస్తున్నాను.అప్పుడు బాబా విగ్రహం చేయి చాపి నువ్వుకూడా వచ్చి వీళ్ళుచేస్తున్నట్టుగచేయి అని పిలిచారు.నేను హ్యాపీ గా వెళ్లి బాబా విగ్రహం మీద మగ్ తో వాటర్ పోసి చేయి తో విగ్రహం మొత్తం రాస్తున్నాను.
అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఔను బాబా విగ్రహం ఎలా మాట్లాడింది? ఎలా చేయి చాపింది?.ఇది విగ్రహమా లేక బాబా శరీరమా? అని డౌట్ వచ్చింది.కానీ చూస్తే విగ్రహం లాగే ఉంది.ఎలా తెలుసుకోవడం అనిఆలోచనలలో బాబా పాదాలు రాస్తున్నాను.అక్కడ నాకు వెచ్చగా అనిపించింది..అదేంటి..
రక్త ప్రసరణ జరిగితేనేకదా వెచ్చగా ఉంటుంది.అంటే ఇది బాబా శరీరమేనా? అని డౌట్ వచ్చి క్లారిటీ కోసం బాబా పాదం పట్టుకుని గిల్లాను..అప్పుడు బాబా విగ్రహం నుండి కొద్దిగా పక్కకి వంగి నొప్పి పెట్టినట్టుగా. ఆ అన్నారు.అప్పుడు నాకు ఓహో ఇది విగ్రహం కాదు శరీరమేఅని క్లారిటీ వచ్చింది.
వెంటనే బాబా కి ఆలా నొప్పిపెట్టేలా గిల్లినందుకు బాధ అనిపించి,సారీ బాబా అనుకున్నాను.వెంటనే నేను ఇలా బాబాని గిల్లి నొప్పి కలిగించడం ఎవరైనా చూస్తే వాళ్ళకి బాబా అంటే ఇష్టం కాబట్టి ఆఇష్టం తో నన్నేమైనా తిడతారేమో అని అందరిని చూసాను.కానీ వాళ్లకు ఇదంతా ఏమి తెలియదు.
నేను చేసిన పని నాకు బాబాకి మాత్రమే తెలుసు.అందరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు నేన్ను హమ్మయ్య థాంక్స్ బాబా అని చెప్పి నేనుకూడా బాబా విగ్రహానికి స్నానం చేయిస్తుండగా,సడన్ గా నేను బాబాకి కొంచం దూరంలో నిలబడి ఉన్నాను.
నేను ఇక్కడికి ఎలా వచ్చానుఅని అనుకుంటూ, బాబా దగ్గరికి వెళ్లాలని అడుగు వేస్తుండగా ..ఒక పులిచర్మము కప్పుకొని,విభూతి పెట్టుకుని,రుద్రాక్షమాలలు ధరించిన ఒకతను నా పక్కన ఉన్నాడు.
నాకు తను శివుడు కాదు శివుడైతే మెడలో పాము ఉండాలి కదా ఇతనికి లేదు కాబట్టి ఇతను శివుడు కాదు కానీ విభూతి పెట్టుకున్నాడు కనుక శివలోకం లోని ఎవరైనామునీశ్వరుడేమో అనుకున్నాను.
ఏంటి ఒక మునీశ్వరునికి ఇంత దగ్గరగా నిలుచున్నాను మనస్సులో అనుకుని,బాబా వైపు వెళదాము అని అడుగు ముందుకు వేయబోతున్నప్పుడు తను నాతో,నువ్వు ఒక్కదానివే బాబా దగ్గరికి వెళ్ళలేవు.నేనే నిన్ను బాబా దగ్గరకు తీసుకుని వెళ్ళాలి,నేనే తీసుకువెళతాను అన్నారు.
అప్పుడు నేను ఈయనేంటి ఇలా అంటున్నారు అనుకుని,నాకు మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు నేను వెళ్ళగలను.ఇప్పటివరకు నేను బాబా దగ్గరే ఉండి స్నానం చేయించాను.ఇప్పుడు ఎందుకో ,ఎలానో ఇటు వచ్చాను.అన్నాను.దాని అతను నువ్వు వెళ్ళలేవు.
నీకు తనపట్ల నమ్మకం కలిగించడానికి ఇప్పటివరకు బాబా నిన్ను తన దగ్గరకు పిలిపించుకున్నాడు.కానీ ఇప్పుడు నిన్ను నేను తీసుకెళ్లవలసిందే తప్ప నువ్వుగా బాబా దగ్గరికి వెళ్ళలేవుఅన్నారు.
నాకు కోపం వచ్చి నాకు ఎవరూ అవసరం లేదు. నేను బాబా దగ్గరకు ఇప్పుడే వెళతాను చూడండి .బాబా దగ్గరలోనే ఉన్నాడు ఎక్కువ దూరం కూడా లేడు కాబట్టి నేను వెళతాను అని చెప్పాను.
దానికి తను సరే వెళ్ళడానికి ప్రయత్నించు యెంత దూరం వెళతావో అంతదూరం వెల్లు. అనగానే హమ్మయ్య అనుకుంటూముందుకు నడిచాను.కానీ యెంత దూరం నడిచినా బాబా దగ్గరికి వెళ్ళలేకపోయాను ఇంకా నేను ఎక్కడ స్టార్ట్ చేసి ఓపది,ఇరవై అడుగులు వేసానో అక్కడే ఉండిపోతున్నా.
బాబా మాత్రం ఆ దూరం లో కనిపిస్తున్నారు…బాబా చుట్టూ అందరూ ఉన్నారు..ఇక నేను వెళ్ళలేను, ఆమ్మో మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఇప్పటికే చాల సేపైంది ,నేనుబాబా దగ్గరినుండి వచ్చి .అని అనుకుని,వెనకకు తిరిగే సరికి ఆ మునీశ్వరుడు అప్పుడున్న ప్లేస్ లోనే ఉండి, నా ఇబ్బందిని చూస్తూ నేను అప్పుడే చెప్పనా నా తోడులేకుండా నువ్వు వెళ్ళలేవు అని ఇప్పుడు చూడు.వెళ్లలేకపోతున్నావు అన్నారు.
నేను తనవైపు చూసి మీరు చెప్పినట్టే నేను వెళ్ళలేకపోయాను.మీ మాట వినకపోవడం నా తప్పే.ఇప్పుడు నన్ను తొందరగా బాబా దగ్గరకు తీసుకువెళ్లారా ప్లీజ్ అని అడగగానే సరే అని నా దగ్గరకు వచ్చారు…..ఇంతలో మెలుకువ వచ్చింది.
అప్పుడు ఆ మునీశ్వరుడెవరో నాకు అర్థంకాక ఏదో కలలే అని కొట్టిపారేసా కానీ,కొన్ని సంవత్సరాల తరువాత గురువుగారుపరిచయమైన తరువాత కొన్ని రోజులకి ఈ ఎక్సపీరియెర్న్స్ రాస్తున్నప్పుడు, ఒక్కసారిగా తళుక్కుమంది.ఆ మునిఎవరోకాదు శరత్ బాబూజీ గారే అని.
ఆ కలలోనే కాదు,నిజ జీవితం లో కూడా ఓ పట్టాన నేను అంత తొందరగా గురువుగారికి సరెండర్ అవలేదు.ఒకసారి ఇతను నా గురువు అని అనుకున్నాక,ఇప్పుడు ఇక గురువుగారే నాకు అన్నీ.
ఎక్కడో చదివాను .మనం బాబా తో పెంచుకున్న అనుబంధం వలన అయన చూపే ప్రేమ వల్ల,మనం ఆయనే మనగురువు, దైవం అని అనుకుంటాము..
బాబా మనలను ప్రేమిస్తూ మనం ఇంకా ఒక మెట్టు పైకి ఎదగాలి ఇంకా తొందరగా తనదగ్గరకు తన బిడ్డలని రప్పించుకోవాలనే ఆలోచనతో. మన మనస్సుకు,అలోచనా సరళికి తగ్గట్టుగా గురువునిచూపెడతారు.
కానీ బాబా మీద ఉన్న ప్రేమ వల్ల బాబానే నా గురువు,దైవం ఇంకెవరు అవసరం లేదు అని మొండికేసి అయన ఇచ్చిన గురువుని వద్దనుకుంటాం.కానీ మన మీద పేమతో మన కోరికలు తీరుస్తూనే, మన గురువుకి మనలని దగ్గర చేయాలనీ,మనం త్వరగా ఆ మార్గం లో నడిచి తనకి తొందరగా దగ్గర కావాలని తలచి తన ప్రయత్నాలన్నీ తను చేస్తుంటారు అని.
ఇక్కడ గురువుగారు చెప్పింది ఒకటి గుర్తుకు వస్తుంది. బాబా మనలను శ్రద్ద ,సబూరి అడుగుతారు కానీ మనం ఇవ్వం,మనం ఇవ్వకుంటే ఆయనైనా ఇవ్వాలి కదా అందుకే అయన మన మీద అంతులేని శ్రద్ద సబూరిని ప్రదర్శిస్తారు. ఏమైనా బాబా తాను అనుకున్నది సాధిస్తారు.అదీ బాబా అంటే అని.నిజమే .నా విషయం లో నేనుగురువుగారికి దగ్గరవడంలో బాబా చూపిన శ్రద్ద,సహనం గుర్తుకువస్తే ఆనందంతో ఏడుపు వస్తుంది.
తరువాతి భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నేను బాబాకి హారతినిచ్చి చేసిన విన్నపాలు మాత్రమే మమ్మల్ని ఆపద(యాక్సిడెంట్)నుండి కాపాడాయి.
- బాబా నాకు జాబ్ ఇచ్చినా ,ఇవ్వకున్నా నేను బాబాని మాత్రమే అడగాలి
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
- బాబా నీ దగ్గర నాకు రెండు పూటలా రెండు రొట్టెలు పెట్టి చీపురు తో ఊడ్చే పని అయినా నాకు ఇప్పించు
- ప్రేమగా పెడితే నేను ఏదైనా తింటానని తినకపోవడం అంటూ ఉండదని నాకు సందేశమిచ్చారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నేను చేసిన పని నాకు బాబాకి మాత్రమే తెలుసు.”
kishore Babu
January 13, 2017 at 5:02 pmVery Good miracle…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా..
Sai Suresh
January 14, 2017 at 7:54 ammi experiences chala bagunnayi sai
సాయినాథుని ప్రణతి
January 14, 2017 at 10:50 amమీ అనుభవం చదివి నేను చాలా ఆనందించాను. ఈ సాయిలీలాస్ లో మీ అనుభవాని share చెయండం కూడ బాబా ,గురువుగార్ల అనుగ్రహమే అనిపించింది.గురువుగారికి మనం అంటే ఎంత ప్రేమో అనిపిస్తుంది .
Sreenivas
January 16, 2017 at 5:40 amసాయి వంటి దైవంబు లేడోయ్ లేడోయ్… సాయినాథుని శరత్ బాబూజీ