బాబా నాకు జాబ్ ఇచ్చినా ,ఇవ్వకున్నా నేను బాబాని మాత్రమే అడగాలి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై !!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!

ముందు భాగం ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

ఒక రోజు మా టెంపుల్ ఆంటీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సచ్చరిత్ర పారాయణ పెట్టుకున్నారు.తొమ్మిది వారాల పాటు,ఎవరైనా తొమ్మిది మంది కచ్చితంగా వచ్చి పారాయణ చేయాలి అని చెప్పారు.

హాస్టల్ కీ దగ్గరగానే వాళ్ళ ఇల్లు కాబట్టి నేను తొమ్మిది వారాలు వెళ్లి పారాయణ   చేశాను.జాబ్ కావాలనే అడిగాను బాబాని. పారాయణ అయిపోయిన తరువాత టెంపుల్ కీ వచ్చి బాబా ముందు కూచున్నాను.

బాబా పక్కన దత్తుడి విగ్రహం ఉంటుంది.కానీ నేనెప్పుడూ అటు వైపు వెళ్ళను.జస్ట్ ఫార్మాలిటీ కోసం వెళ్లి ఒక దణ్ణం పెట్టుకోవడం (అది కూడా బాబా అందరిని గౌరవించాలి అని చెబుతారు అని )తప్ప,ప్రత్యేకంగా అభిమానం అంటూ ఏమి  లేదు .

ఆరోజు ఆలా కూచున్న టైం లో దత్తుడి దగ్గర యేవో  పూజలు జరుగుతున్నాయి.పూజారి కూచోమంటే ,ఏదో తప్పక లోపల బాబా నామం చెబుకుంటూ దత్తుడి దగ్గర పూజలో కూచున్నాను.

(నిజం చెప్పాలంటే నాకు దత్తుడు అంటే భయం కూడా ఉండేది.తనకి చాల నిష్ఠగా ఉండాలి.క్రమశిక్షణగా భక్తిగా ఉండాలి,లేకుంటే చాల పనిషమెంట్ ఇస్తాడు,దత్తుడు చాల పవర్ ఫుల్ అని అంతకు ముందు టెంపుల్ లో చాల మంది చెప్పారు.అది బాగా ఎక్కేసింది మనసులో సో ,నాకు కొంచం భయం అనిపించేది దత్తుని దగ్గరకు వెళ్లాలంటే ).

కానీ ఫస్ట్ టైం దత్తుని దగ్గర ఆలా పూజలో కూచునప్పుడు చాల ప్రశాంతంగా అనిపించింది.ఆ సంతోషం లో ఆటోమాటిక్ గ అలవాటు ప్రకారం దత్తుడిని కూడా నాకు ఏదైనా జాబ్ వస్తే గురుచరిత్ర పారాయణ చేస్తాను అని మొక్కుకున్నాను మనసులో,ఆలా అనుకున్నానో లేదో,మళ్లీ బాబా ని కాకుండా దత్తుడిని అడిగాను ఏంటి అని భయం కూడా వేసింది.

కోరుకున్నట్టుగానే రెండు రోజులలోనే చిన్న జాబ్ వచ్చింది. (ఇక్కడ..నేను మంచి జాబ్ రావాలి అనుకోలేదు ఏదైనా జాబ్ లో జాయిన్ అవ్వాలి అని కోరుకున్నా.అలాగే ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయ్యాను.)

ఇప్పుడు నేను గురుచరిత్ర పారాయణ చేయాలా? బాబా ని తప్ప ఎవరిని అడగను.అలాంటిది బుద్ది తక్కువగా  దత్తుడిని అడిగాను.ఆలా అడగగానే ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయ్యేలా చేసారు.

ఇది తొమ్మిది వారాలుగా సచ్చరిత్ర చదివితే బాబా ఇచ్చినట్టా? లేదా ఒకసారి కోరుకొగానే దత్తుడు ఇచ్చినట్టా,వామ్మో ఇంకెప్పుడు ఇలా కోరుకోవద్దు,ఆలా కోరుకుంటే ఇలాంటి వెదవ అనుమానాలు స్టార్ట్ అయి బాబాను  తక్కువ చేసినట్టు అవుతుంది.

బాబా నాకు జాబ్ ఇచ్చినా ,ఇవ్వకున్నా నేను బాబాని మాత్రమే అడగాలి ఇంకెవరిని అడగొద్దు అని స్ట్రాంగ్ గ అనుకున్నాను.( అందరు ఒకటే కానీ, నేను ఒకరిని నమ్మితే ఆ ఒక్కరిపైనే ఉంటుంది నా మనసు అంతే.ఆలా బాబా విషయం లో కూడా  ).

సరే కానీ ఇప్పుడు గురుచరిత్ర చదవాలా వద్దా?నేను అంత నిష్టగా చదవగలనా ?అంత నిష్టగా చదవకుంటేమళ్లీ  దత్తునికి  కోపం వస్తుందా ?ఆలా అని చదవకుండా ఉంటే కోపం వస్తుందా ?ఇప్పుడేం చేయాలి ?అని సందేహాలు భయం.

(ఈ భయమంత ఎందుకంటె అప్పటి వరకు నాకు దత్తుని   పరంగా ఎలాంటి అనుభవాలు లేవు.కేవలం చదివింది, అందరు చెప్పేది విని ఆలా భయపడ్డాను.)

లాస్ట్  కి ఆమ్మో దత్తుడు అంటే నావల్ల కాదు.బాబా ఐన దత్తుడు ఐన ఒకటే అనుకుని బాబా చరిత్ర పారాయణం చేస్తాను.గురుచరిత్ర చదువుతాను అని చదవలేకపోయినందుకు వచ్చే ఫలితాన్ని బాబా నే చూసుకుంటారు.అనుకున్నాను.

కానీ,ఒకరోజు కలలో అందరు పూజారులు యేవో   హోమం లేదా యజ్ఞం లాంటిది చేస్తున్నారు,మధ్యలో గురుచరిత్ర పుస్తకం కనిపించింది.పై నుండి వ్యక్తి కనిపించలేదు కానీ ఎవరిదో వాయిస్ ” గురుచరిత్ర చాల పవర్ ఫుల్ ,గురుచరిత్ర పారాయణ చేస్తాను అని చెప్పి,పారాయణ చేయకుండా ఉండడం మంచిది కాదు”  అని వినిపించింది.

దెబ్బకి బయమేసింది ఏంటి ఇలా వచ్చింది అని.మళ్లీ నేను ఈ మధ్య ఎక్కువగా గురుచరిత్ర గురించి బయపడుతున్నాను కదా,ఆ భయం నా ఇన్నర్ మైండ్ లో ఆలా స్టోర్ అయిపోయి కళల రూపంలో వచ్చిందేమో లే అని ఒక వెదవ లాజిక్కు కూడా వచ్చింది.(ఇవన్నీ గురుచరిత్ర పారాయణ తప్పించుకోవడానికి).

కానీ నేను మాట తప్పవద్దని బాబానే కలలో ఆలా చెప్పి ఉంటారు కాబట్టి ఒకసారి పారాయణ చేద్దాము అని గురుచరిత్రని చదవడం స్టార్ట్ చేశాను.చదవటం అయిపోయిన తరువాత .(దత్తుడు శివ స్వరూపుడు,దత్తుడు,బాబా ఒక్కరే అని )నాకు దత్తుడు అంటెకూడా ఇష్టం ఏర్పడింది.

మా టెంపుల్ వాళ్ళు అందరు గానుగాపూర్ కీ వెళ్ళడానికి బస్సు ప్లాన్ వేశారు. టెంపుల్ నుండి బస్సు వేశారు.నన్ను రమ్మన్నారు కానీ నేను రాను అని చెప్పాను.

ఎందుకంటె మా నాన్న దేవుడిని నమ్మడు,టెంపుల్ కీ వెళితేనే తిడతాడు అలాంటిది గానుగాపూర్ కీ  అంటే ఒక్కదానివే వద్దు  అంటాడు అని నాకు తెలుసు.

మళ్లీ మా నాన్నకి ఆరోగ్యం కూడా బాలేదు.బ్యాక్ బోన్ పై మాంసం చిన్న  ముద్దగా ఏర్పడి ,అక్కడి నుండి కాళ్ళ వరకు వచ్చే నరాలను నొక్కినట్టు చేయడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల సరిగా నడవలేకపోతున్నారు.

అప్పటికే రెండు సార్లు ఆపరేషన్ జరిగింది.మళ్లీ ఇప్పుడు వేరే దగ్గర వచ్చింది మళ్లీ ఆపరేషన్ చేయాలి.లేకుంటే నడవడం కష్టం.కానీ,ఆపరేషన్ చేస్తే తాను తట్టుకోవడం కూడా కష్టం అని చెప్పారు.మళ్లీ ఆపరేషన్ అంటే ఎలా తట్టుకుంటారు.ఇప్పుడు చేసిన మళ్లీ రాదు అని గ్యారంటీ ఏమి లేదు చాల బాధ అనిపించింది.

ఇలాంటి టైం లో నేను గానుగాపుర్  అని చెప్పి తనకి కోపం తెప్పించడం ఇష్టం లేదు. సో నేను రాను అని చెప్పాను.

ఆరోజు మార్నింగ్ బస్సు  ఉదయం 5 కీ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఉదయం 4 .30 మా టెంపుల్ లో గోపి అనే అబ్బాయి కాల్ చేసి అక్క గనుఁగాపూర్ రాను అన్నావట ఎందుకు రాను అన్నావు. రా ఇప్పుడు .అని చాల అడిగాడు.

నేను ఇక గోపి పోరు పడలేక మా నాన్నకి కాల్ చేసి నేను ఒకటి అడుగుతాను నువ్వు నో అనొద్దు అని అడిగి, గానుగా పూర్ కీ వెళ్తున్నాము.గోపి చాల సార్లు అడిగాడు.తన కోసం కాదు మనకోసం,నీ ఆరోగ్యం కోసం నాకు వెళ్లాలనిపిస్తుంది నీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నాకు ఉంది.ఇప్పుడు నువ్వు వెళ్లొద్దు అని చెప్పినా,నేను వెళతాను అని చెప్పా. మా నాన్న సరే జాగ్రత్తగా వెళ్లి రా అని చెప్పారు.

నేను వెంటనే రెడీ అయి టెంపుల్ కీ వెళ్లేసరికి ఇంకా బస్సు రాలేదు.5 కె వెళ్లాల్సిన బస్సు ఎందుకో లేట్ అయ్యిందట.అక్కడ ఆంటీ  బహుశా నీ కోసమే బాబా ఆలా లేట్ చేయించారేమో అంది.నేను హ్యాపీగా అవును ఆంటీ నాకోసమే చేసారు.అసలు నేను వస్తాను అనుకోలేదు కానీ వస్తున్నా అని హ్యాపీ గా ఫీల్ అయ్యాను.

డ్రైవర్ కీ రూట్ సరిగా తెలియకపోవడం వల్ల వెళ్లేసరికి  సాయంత్రం అయింది.అక్కడ బీమా,అమరజా సంగమం లో స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా పోతాయి అని చదివాను.

స్నానం చేసేటప్పుడు అనుకున్నాను ఇక్కడ స్నానం చేస్తే ఆరోగ్యసమస్యలు పోతాయి అట కదా.మా నాన్నకి బాలేదు.తాను రాలేడు.తన కోసం నేను స్నానం చేస్తాను.తన ఆరోగ్యం బాగవ్వాలి.అసలు నేను వచ్చిందే తనకోసం,మా నాన్న కీ ఆపరేషన్ అంటే తాను,మెంటల్ గా ఫిసికల్ గా కూడా తట్టుకోవడం కష్టం.ఆపరేషన్ లేకుండా తనకి బాగయ్యేలా చూడు అని దత్తునికి మొక్కుకున్నాను.

కోరుకున్నట్టే ,  మళ్లీ చెకప్ కీ వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ,మళ్లీఆపరేషన్ అంటే పేషెంట్ తట్టుకోవడం కష్టం అనుకుంటాను. కొన్ని రోజులు మందులు  వాడాక అప్పుడు చూద్దాం అని చెప్పి మెడిసిన్  రాసిచ్చారు.వాటితోనే నాన్నకి బాగైంది.

తరువాతి భాగం ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా నాకు జాబ్ ఇచ్చినా ,ఇవ్వకున్నా నేను బాబాని మాత్రమే అడగాలి

Sai Suresh

మంచి అనుభవం సాయి . నాకు కూడా అక్కడ వెంగళరావు నగర్ బాబా టెంపుల్ కి వెళ్తున్నప్పుడు 2007 లో గానగాపూర్ వెళ్ళే అవకాశం వచ్చింది. నేను కూడా మీలాగే ముందు రాను అని చెప్పను. కానీ బాబా నన్ను కూడా వెళ్ళేలా చేసి ఆ క్షేత్ర దర్శనం చేయించారు సాయి. బాబా లీలలు బాబాకే తెలియాలి సాయి. మనలాంటి వారికీ త్వరగా అర్థం కావు సాయి

prathibha sainathuni

saibaba saibaba saibaaabaa

prathibha sainathuni

avunu suresh garu..baba manaki manchi cheyalani anukunnappudu ,manaku dani value teliyaka manam yenta vaddu anukunna,baba mantoo adi cheyinchakunda vadilipettaru. …saibaba saibaba saibaba

kishore Babu

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba.
http://saileelas.com/m/sounds/view/Sai-Devotee-4

Sreenivas

Nice Experience Pratibha Garu…Sai Baba…Sai Baba

prathibha sainathuni

tnq srinivas garu..saibaba saibaba..

సాయినాథుని ప్రణతి

So nice experiences .మి అనుభవాలు చదువుతు ఆనందిస్తునాను .ఈ సాయిలీలస్ లో ఒక గురుబందువు share చేసుకోవడం ఇంకా హ్యపినేస్ ను ఇస్తుంది.ఇంకా కుతుహలంగా చదువుతునాను.

prathibha sainathuni

tnq pranati garu..naku kuda chala happy ga undi..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles