కంప్యూటర్ అవగాహన ఏమాత్రం లేని నాకు GE కంపెనీ లో జాబ్ ఇప్పించిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


వినయ్ కుమార్ గారి అనుభవములు రెండవ భాగం

నాకు ఒక్కసారిగా ఏడుపు ఆగలేదు. బాబా పాదాలపైన తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాను. పూజారి గారు నన్ను లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు.

అరగంట సేపయినా నా ఏడుపు ఆగటం లేదు. అసలు గురువారం నాడు ఎవరినీ లోపలికి రానీయరు. గుడివాళ్ళు పాద దర్శనం కూడా చేసుకోనీయరు.

అంత విపరీతమైన జనం ఉంటారు. అటువంటిది నన్ను అంత సేపు లోపల బాబా మొహం కేసి చూసుకుంటూ కూర్చోవటానికి సమయం అనుకూలించిందంటే మరి అది బాబా కృప.

నేను ఎగ్జామ్స్ బాగానే రాసాను. పార్ట్ 1 అయ్యింది. పార్ట్ 2 కి వచ్చేటప్పటికీ పార్ట్ 1 అలా పాసయిపోయాను.

ఇది నేను కష్టపడితే పాసయ్యానా లేక నాకు ‘బాబా’ చేసిన సాయం వాళ్ళ పాసయ్యానా అన్న సందేహం కలిగింది.

(ICW లో ) నాకు taxation  అనేది పూర్తిగా తెలియదు. నేను సరిగా చదవటం లేదు. అందరూ నన్ను తప్పుతావనే అన్నారు.

మా తమ్ముడు CA చదువుతున్నాడు. ఒరేయ్ అన్నయ్యా నువ్వు ఎలాగైనా తప్పుతావు అయినా సరే ఒకసారి చూసుకో అంటూ తన దగ్గర ఉన్న taxation book ఇచ్చాడు.

నేను అది తీసుకువెళ్ళి నేను బాబా పారాయణ చేసే బల్లపైన పెట్టి చదువుకున్నాను. ఎగ్జామ్స్ అయ్యాయి. నేనేం రాసానో నాకు తెలియదు. కానీ అందులో 60 మార్కులు వచ్చాయి.

Results వచ్చాక నేను చూసుకోకుండా నాన్నని వెళ్లి చూసిరమ్మన్నారు. ఎందుకంటే నేను తప్పుతాననే నాకు బాగా నమ్మకం. taxation పాసయ్యాను.

మిగతావి మొత్తం గ్రేస్ మార్కులు వేశారు. 65 % వచ్చింది. taxation అంటే 70, 80 మార్కులు వస్తే టాప్ ఏ సబ్జెక్టు పోయినా అన్నీ మళ్ళీ రాయాలి.

కానీ ఇది పోతుంది అనుకుంటే 50% వచ్చింది. పార్ట్ 2 ని కూడా బాబానే బయట పడేసాడు.

నాన్న ని result చూడమని పంపించాను కదా ఆయన ముందు ఫోన్ చేసి ఒరేయ్ వినయ్ నీకు క్లియర్ కాలేదు అన్నాడు. అంతే నేనూహించిందే అయినా ఏడ్చుకుంటూ కూర్చున్నాను.

ICW అంటే పార్ట్ 1 పార్ట్ 2 అల్ క్లియర్ అని ఉంటుంది. మా నాన్న నాకు 2 లో చూసాడు. ఆల్ క్లియర్ లో చూడాలి 2 లో నా నెంబర్ లేదు.

ఎవరో అన్నారుట. వినయ్ ది all క్లియర్ లో చూడాలి అని నాకు ఫోన్ చేసి చెప్పాక మళ్ళీ చూసాడు.

all క్లియర్ లో ఉన్నాక మళ్ళీ ఫోన్ చేసి నీవన్నీ క్లియర్ అయ్యాయి. నువ్వుపాస్ అయ్యావు అన్నాడు.

ఇందాక అలా అన్నావు అన్నాను. అప్పుడు ఆయనేం చేశారో చెప్పాడు.

అప్పుడనుకున్నాను నేను పాస్ అయ్యాను అంటే బాబా గొప్పతనమే కానీ నాది ఏమి లేదు అని అర్ధం అయింది.

మా ఆర్ధిక పరిస్థితి కొంచెం బావుండక మేము వనస్థలిపురం లో ఇల్లు కూడా కొనుక్కోవడం మూలాన అప్పులు బ్యాంకు లోన్స్ మూలంగా నేను ట్యూషన్స్ కూడా చెప్పవలసి వచ్చింది.

M com చేసాను. ఒకచోట అప్లై చేసాను. నందకిషోర్ అన్న అతను నన్ను అక్కడ ప్రయత్నించమన్నాడు, టెక్నికల్ గా నాకు తెలుసు. నాకు సిస్టం మీద పని చేయడం అసలు తెలియదు.

సిస్టం గురించి అసలు తెలియదు. నాకు రాదు అన్న విషయం నేను బయటకి చెప్పలేదు. ఏం జరుగుతుందా అని చూస్తున్నాను.

లోపల మాత్రం బాబా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే ఈ ఉద్యోగం నాకు రాదు.

ఏ పని అయినా నేను చేత్తో అయితే చేసేస్తాను. వీళ్ళు నన్ను కంప్యూటర్ లో చేయండి అని అంటున్నారు. నాకేమో ఇది ఎలా ఉపయోగించాలో తెలియదు.

బాబా నువ్వే చూడాలి అనుకుంటున్నాను. సిస్టం ముందు కూర్చోబెట్టారు. ఊ చేయండి అన్నారు.

నేను స్విచ్ ఆన్ చేశా సిస్టం ఆన్ అవలేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు నాకు చెమటలు పడుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది.

ఏం జరిగింది అంటే నేను స్విచ్ ఆన్ చేసాను. కరెంటు పోయింది. ఆ పోయిన కరెంటు 2 గంటలు అయినా రాలేదు. మీరు రేపు రండి అన్నారు. నేను అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.

ఇంటికి వెళ్లి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రెండు గంటలు కూర్చొని కంప్యూటర్స్ లో బేసిక్స్ నేర్చుకున్నాను.

మర్నాడు మామూలుగా వెళ్లాను. సిస్టం ఆన్ చేయమన్నారు. నేను నిన్ననే నేర్చుకున్నానుగా నా ప్రతిభనంతా అక్కడ ప్రదర్శించాను.

అంతా అయ్యాక చుట్టూ బోర్డర్ వేయమన్నారు. నేను ఎలాగో వేసేసాను. ఒకతను వచ్చి బోర్డర్ అంతా తీసెయ్యమన్నాడు.

నేను ఒకసారి వేసాక బోర్డర్ తీయడం కుదరదు అన్నాను. ఎందుకంటే నాకు తీయడం రాదు. లక్కీగా నాకు బోర్డర్ తీయమని చెప్పిన అతనికి ఆ వేసిన బోర్డర్ ఎలా తీయాలో తెలియదట.

ఆయన వెంటనే తన విషయం ఎక్కడ బయటపడుతుందో అని అవునవును అంతే అంతే అన్నాడు. మర్నాడు రమ్మన్నారు.

నన్ను ఏవేవో ప్రశ్నలు అడిగారు. ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు ఒకతను. వనస్థలిపురం అన్నాను.

నా పేరు, మరియు వనస్థలిపురం అని రాసి ఉంది. ఒక కాగితం లో అది వాళ్ళ ఎదురుగ్గా టేబుల్ మీద ఉంది. వనస్థలిపురం అన్న దానికి రౌండప్ చేసాడు.

ఎందుకు సార్ అలా చేశారు అని అడిగితే నేను ఇక్కడ HR  ను నా పేరు జయదేవ్. నేను నీ పక్క కాలనీ లో నే ఉంటాను అని నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు.

నాకు ఉద్యోగం వచ్చింది. అది GE కంపెనీ 2000 సంవత్సరం నా జీతం 6000 అలవెన్సులు 4000.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

వినయ్ కుమార్ గారి అనుభవములు మూడవ భాగం తరువాయి…….

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “కంప్యూటర్ అవగాహన ఏమాత్రం లేని నాకు GE కంపెనీ లో జాబ్ ఇప్పించిన బాబా వారు.

Kishore

Sai Baba…Sai Baba🙏🙏

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles