సస్పెన్షన్ లో ఉన్న 10 రోజులు బాబా సేవ లో గడిపిన భక్తునికి, తిరిగి ఉధ్యోగాన్ని ప్రసాదించిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను మా తమ్ముడితో కలిసి ఇల్లు కట్టాలనుకున్నాను. ఇద్దరం చెరి సగం డబ్బులు పెట్టుబడి పెట్టి కట్టుకోవాలనుకున్నాము, కానీ నా దగ్గర డబ్బులు అంత లేవు. మా తమ్ముడు దగ్గర ఉన్నాయి.

నేనేమి చేయాలా అని ఆలోచిస్తూ ఒక రోజు మధ్యాహ్నం పడుకున్నాను.

”ఇల్లు కట్టాలనుకుంటున్నావు! కడతావు, అప్పుడైనా నువ్వు నన్ను నమ్ముతావా? నన్ను విశ్వసిస్తావా?” అని స్పష్టంగా వినిపించింది ఉలిక్కిపడి లేచాను. చూస్తే ఎవరూ లేరు.

మా అమ్మ గారిని ఎవరైనా వచ్చారా? అని అడిగాను. ”ఎవరూ రాలేదు” అంది అమ్మ.

ఎదురుగ్గా గోడ మీద బాబా ఫోటో తప్ప ఎవరూ లేరు. అప్పుడు నేను పూజ గదిలోకి వెళ్లి బాబా ముందు నిలబడి

”నువ్వు ఇంటికోసం పర్మిషన్ ఇస్తున్నట్లుగా నాకనిపిస్తోంది. అదే గనుక నిజమైతే నేను నీ ముందు ఎప్పుడూ కూడా మోకాళ్ళతోటే ప్రార్ధన చేస్తాను” అని అనుకున్నాను.

నా దగ్గర డబ్బేమీ లేదు. అయినా కూడా ఒక నెల అయినా అవ్వక ముందే ఇంటి కోసం ఏర్పాట్లు జరిగిపోయాయి.

నా దగ్గర లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతా బాబా చూసుకుంటారనే నమ్మకం మాత్రం ఉంది.

బాబా సమాధి చెందక ముందు పురంధరే అని భక్తుడిని, బాబా మాటి మాటికి ”నువ్వు ఇల్లు కట్టుకో”, అనే వాడు.

బాబా నీకు అన్నీ తెలుసు. నా దగ్గర డబ్బులు లేవుగా అని పురంధరే అంటే డబ్బులు సంగతి నీకెందుకు, నువ్వు ఇల్లు కట్టు. నేనున్నానుగా అనే వాడు బాబా.

ఆయనకి బొంబాయి బాంద్రా లో ఒక స్థలం ఉంది . అది ఆనాడు ఊరి చివరన ఉంది. ఇప్పడది ఊరికి మధ్యలో అయింది.

బాబా దయతో ఆయనకీ ఎవరో అప్పు ఇచ్చారు దానితో ఆయన ఇల్లు పని పూర్తి చేసుకున్నాడు. పురంధరే ఈ కథనే ఎక్కడో చదివాను. అది గుర్తు కొచ్చిందా సమయంలో.

బాబా ప్రేరణతో మా బంధువు ఒకాయన నాకు డబ్బులు సమకూర్చగా నేనో ఇంటివాడిని అయ్యాను.

నేను రైల్వేస్ లో ప్రమోషన్ కోసం పరీక్షలు రాయాలనుకున్నాను. ఆ సమయంలోనే మేమంతా షిరిడి వెళ్ళాము.

వెడుతూ కూడా నేను రాయవలసిన పరీక్ష తాలూకూ సిలబస్ బుక్ కూడా షిరిడికి తీసుకువెళ్ళి, అక్కడ బాబా ముందు ఆయనతో నేను విషయం చెప్పి నేను రాయాల్సిన ప్రశ్నకి జవాబులు నువ్వే చూడాలి అని, అక్కడ బుక్ ఓపెన్ చేశాను.

ఆ బుక్ ఒక దగ్గర తెరుచుకుంది. అది చూడంగానే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అందులో వచ్చిన టాపిక్ ”accident”

నేను బాబాతో ఏమిటి? బాబా ఇలా చూపిస్తున్నావు? పరీక్ష రాసి పాసై నేను ప్రమోషన్ పొందాలని ఆలోచిస్తుంటే నాకు ఇలాంటిది ఎదురవుతుందా? ఏంటి? అని చాలా బాధపడ్డాను.

మా ఆవిడకి ఈ విషయం చెప్పాను. ఆ తర్వాత మేము తిరిగి వచ్చి పరీక్ష రాయడం, నేనది పాస్ అవ్వటం నాకు ప్రమోషన్ రావటం వరసగా జరిగిపోయాయి.

నన్ను ట్రైనింగ్ కి పంపించారు. అదీ అయిపోయింది. పోస్టింగ్ ఇచ్చారు, నేను జాయిన్ అయిపోయాను.

ఒక రోజు ఒక గూడ్స్ మరో గూడ్స్ ను ఢీ కొట్టింది. అదీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగింది. ఒకతనికి నేను ఇచ్చిన సూచనలను అతను తప్పుగా అర్ధం చేసుకొని వేరే లాగా సిగ్నల్ ఇవ్వటం మూలంగా అదలా జరిగింది.

నా దురదృష్టం కొద్దీ గూడ్స్ లో డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరూ చనిపోయారు  అదీ చాలా పెద్ద accident  ఇలాంటి ఆక్సిడెంట్ కి రైల్వేలో చాలా పెద్ద శిక్ష ఉంటుంది.

నన్ను సస్పెండ్ చేసారు. ఎంక్వైరీ చేస్తున్నారు. నేను బాబా ని రోజూ ప్రార్ధిస్తున్నాను, ”ఏంటి బాబా ఇప్పుడు నా దారి? నన్ను ఏం చేయాలనుకుంటున్నావు,

పది రోజుల పాటు నేను సస్పెన్షన్ లో గడిపాను, తర్వాత వచ్చే result  ఎలా ఉంటుందో తెలియదు. ”బాబా ఎటు పోతోంది నా జీవితం? ఏం చేయబోతున్నావు?” అని అనుకుంటూనే ఉన్నాను,

ఆ సమయంలో Dilshuknagar  ”సాయిబాబా గుడి నుండి భిక్షాటన కార్యక్రమంలో పాల్గొంటావా?” అంటూ మా మామగారు వచ్చి అడిగారు.

ఆయనకి తెలియదు నేనే కండిషన్ లో ఉన్నానో, స్వయంగా బాబా భిక్షాటన తోనే కాలం గడిపారు.

ఆయన వారసుడుగా నేను భిక్షాటన చేయాలని అనుకున్నాను. నా అహంను ఆయనే ఇలా తీసేసాడు అని అనుకున్నాను.

ఈ పదిరోజుల పాటు నాకు మొత్తం జీవితం అంతకు ముందు జీవితంతో సంభందం లేకుండా తయారైంది.

ఎంక్వైరీ లో నా తప్పు అంటూ ఏమీ లేదని, తేలిపోయింది. ఇంటిల్లి పాదీ కూడా ఊపిరి పీల్చుకున్నాము.

అలా నన్ను ఒక తాత మనుమడి చెయ్యి పట్టుకుని నడిపించుకు పోతున్నట్లుగా, నన్ను ఆయన తీసుకెడుతున్నాడు.

నేనదే స్టేషన్లో, అదే ఉద్యోగంలో, అలాగే కంట్రోలర్ గా 11 సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాను.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles