Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి మా తమ్ముడి ఇంట్లో ఏకాహం జరుగుతున్నప్పుడు, బాబాకి నేను పాదుకలు చేయించాలి అని అనుకున్నాను.
నాకు సహాయం ఎవరు చేస్తారు. అంటే నేను డబ్బు పెట్టగలను కానీ వెండి, కంసాలికివ్వాలి.
ఇవ్వన్నీ చెయ్యాలంటే నాకు ఒక తోడు కావాలి, నేనుగా ఇవన్నీ చెయ్యలేను. ఏం చెయ్యాలో తెలియడం లేదు. అలాగే బాబా ముందు కూర్చొని ఇదే విషయాన్ని బాబాతో చెప్పుకుంటున్నాను.
ఆ సమయంలో నా పక్కనే కూర్చుని ఉన్న శ్రీమతి సుమ గారు ధ్యానం చేస్తోంది.
నేను నా మనసులో బాబాకి పాదుకలు విషయం చెప్పుకుంటూ, నా పక్కనే కూర్చున్న సుమని అడుగుదాము, ఏదైనా ఈ విషయంలో సలహా కానీ, సహాయం కానీ దొరుకుతుందేమో అనుకుంటూ ఆవిడ ధ్యానం నుంచి బయటికి వచ్చేదాకా ఆగి,
ఆవిడతో నేను పాదుకలు ప్రస్తావన చేసేలోపే ఆవిడే నాతో ”ఎవరో బాబాకి పాదుకలు చేయిద్దాము అని అనుకుంటున్నారట, నన్ను వాళ్ళకి సహాయం చేయమని బాబా నాకు ధ్యానంలో ఆదేశించారు. వారు ఎవరై ఉంటారో అని అంది”.
నేను ఆశ్చర్యం తో ”నేనేనమ్మా! ఆ విషయంలోనే నేను నీ సలహా అడుగుదామని అనుకుంటున్నాను” అన్నాను.
చాలా సేపు బాబా లీలల గురించి మాట్లాడుకొని, ఆ తర్వాత ఎంత వెండి అవసరం అవుతుంది. ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి అనే వాటి గురించి ఓ నిర్ణయానికి వచ్చాం.
నా దగ్గర డబ్బు లేదు. ఇంటికి వెళ్లి తేవాలి కాబట్టి నా దగ్గర ఉన్న విలువైన వస్తువేదైనా నీ దగ్గర ఉంచుకో పని పూర్తయిన తర్వాత నేను పైకం ఇచ్చి ఆ వస్తువు విడిపించుకొని తీసుకుంటాను.
బాబాకి తొందరగా పాదుకలు తయారు కావాలి అన్న కాంక్షతో నేనా మాట అన్నాను.
అప్పుడావిడ నా కళ్ళల్లో కి సూటిగా చూసి ”అమ్మా ఇది బాబా కార్యం మీకు పాదుకలు చేయించమని సంకల్పం ఇచ్చాడు. నన్ను మీకు సహాయపడమని ఆదేశం ఇచ్చాడు. ఇందులో మదుపు, నమ్మకాల సంగతి ఏంటమ్మా ఇది ఆయన కార్యం, బాబా ఈ కార్యంలో నాకు కూడా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందమ్మా.
మీరు ఇవన్నీ ఆలోచించకుండా ఈ పని ఎంత తొందరగా అవుతుందో యోచిద్దాం అంది.
అతి తొందరలోనే పాదుకలు, పెట్టడానికి ఒక పళ్లెం తయారవటం, అది మా తమ్ముడు ఇంట్లో ఉన్న బాబా పాదాల దగ్గర ఉంచడం జరిగింది.
శ్రీమతి సుమగారు కూడా ఇందులో ఆవిడ వంతుగా కొంత ధనాన్ని పాదుకల కోసం వెచ్చించి పాదుకల తయారీలో సహాయ, సహకారాలు అందించారు .
మొన్న ఏప్రిల్ 28, 2015 న వనస్థలిపురంలో మా తమ్ముడి ఇంట్లో సాయి నామ సప్తాహం మొదలైంది.
మా తమ్ముడు లేకపోయినా, మా మరదలు బాబా కార్యక్రమం ఏ లోటు రాకుండా చూసుకుంటోంది.
నాకు చెప్పమని మా అబ్బాయికి ఫోన్ చేసి సప్తాహం మొదలవుతోంది, అమ్మని పంపమని చెప్పిందట.
మా వాడు మూడు రోజులైనా చెప్పలేదు. నాకు బాబా, ”నామం మొదలైపోయింది, ఇంకా నువ్వు రావేంటి? అని తొందర పెడుతున్నట్లుగా తోస్తోంది.
ఇంకా నేను మావయ్య ఇంటికి వెళతాను నన్ను తీసుకువెళ్ళు, అక్కడ నామం జరుగుతోందని నాకు బాబా చెప్తున్నాడు అన్నాను.
అవునమ్మా! మరిచిపోయాను అత్తయ్య మూడు రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి, నీకు చెప్పమంది, నామం మొదలైందట, అన్నాడు.
మా వాడికి తీసుకెళ్ళటానికి కుదరకపోతే మా మనవడిని తీసుకెళ్ళమన్నాను, వాడికి డ్రైవింగ్ తెలుసు, కానీ లైసెన్సు లేదు.
అయినా పోలీసులు పట్టుకోకూడదని బాబా దండం పెట్టుకుని బయలు దేరిపోయాను. అనుకున్నట్లుగానే బాబా దయ వలన మా తమ్ముడింటికి వచ్చాను.
నేను ఈ మధ్యన dilsukhnagar బాబా మందిరానికి వెళ్ళాను. నేను ఏ గుడికి వెళ్ళినా ఏదోక పూలు తీసుకెళ్లడం నాకు అలవాటు. ఈ సారి నేను బంతిపూలు తీసుకువెళ్ళాను.
అవి బాబాకి సమర్పించమని గుడి పూజారికి ఇచ్చాను. ఆ పూజారి తీవ్రంగా చూసి, ఆ పూలను బయటకి విసిరిగొట్టాడు.
నేను మనసులో తీవ్రంగా బాధపడ్డాను బాబాకి ఆ పూలను మాలగా వేయకపోయినా ఆ మాట చెప్పవచ్చు. లేకపోతే బాబా పాదాల మీద అయినా ఆ పూలని వెయ్యవచ్చు అంతే కానీ అంత కర్కశంగా ఆ పూలని విసిరివెయ్యాల్సిన పనిలేదు, అని అనుకున్నాను.
నేను ఆ రోజు అలా జరిగినందుకు బాధపడుతున్నాని కాబోలు. మా తమ్ముడు ఇంటికి బాబా బంతి పూలు తెమ్మనమని ధ్యానంలో ఉండగా చెప్పి తెప్పించుకున్నాడు.
ఆ పూల మాలని వాళ్ళింట్లో పెద్ద ఫోటో వేయించుకున్నాడు. ఎంత విచిత్రం.
మా తమ్ముడు ఇంట్లో బాబా పల్లకీ ఊరేగింపుకి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. నేను గోడ దగ్గర నిలబడి చూస్తున్నాను.
బయట పల్లకిలో బాబా, ఆడవాళ్లు కోలాటం వేస్తున్నారు. డప్పుల వాళ్ళు డప్పులు కొడుతున్నారు.
కోలాటం వాళ్ళు అందంగా ఆడుతున్నారు. అందరూ ఒకే లాంటి దుస్తులు ధరించి ఉన్నారు.
అలాగే కళ్ళు ఆర్పకుండా చూస్తుంటే అందులో ఒక అమ్మాయి నా కంటికి కృష్ణుడిగా కనిపించ సాగింది.
అది బృందావనం లాగా, మిగిలిన స్త్రీ లంతా గోపికల్లాగా కనిపించింది బాబాయే పల్లకీ దిగివచ్చి శ్రీ కృష్ణుడిలాగా ఆడుతున్నాడా! అనిపించింది. నాకు చాలా చాలా సంతోషం కలిగింది.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా నిజ పాదుకలు ఇంటికి వచ్చిన వైనం
- గురువుగారి పాదుకలు చూస్తే గురువుగారిని చూసినంత ఆనందం కలిగింది.
- చెక్కు కనపడలేదు అన్న బాధలో ఉన్న నాకు…. బీరువాలో గులాబీ రంగు ఫైలులో 6 వ పేజీలో చూడు అని చెవిలో చెప్పిన బాబా వారు…. G. A రాజ్యలక్ష్మి
- నా ప్రశ్నకి గురువుగారు ఫోన్ లో సమాధానమిచ్చారు.
- బాబా కృప వలన మా అమ్మగారి కాళ్ళలో పుండ్లు మాయమైనాయి–15
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments