Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
అందరూ సాయి భక్తులు కావాలనుకోరు. ఎవరిపై భక్తి ఉంటుందో వారి భక్తులవుతారు. అందులో ఏ మాత్రము తప్పులేదు.
అయితే సాయి బాబాను అదే పనిగా విమర్శించటం తగదు. ఇలా సాయిబాబా సశరీరంగా ఉన్నప్పుడే కొన్ని సంఘటనలు జరిగాయి.
సాఠే పంపగా మేఘుడు సాయి వద్దకు బయలు దేరాడు. దారిలో సాయిని గూర్చి చెడుగా విన్నాడు. వెనుతిరిగి పోయాడు.
మాలేగాం డాక్టరు తన మేనల్లుని ఆరోగ్యవంతుడు అవటానికి కారణం సాయి అని గ్రహించి, సాయిని దర్శించటానికి షిరిడీకి బయలు దేరాడు.
మాలేగాంలోను, మన్మాడ్లోను ఎవరో ఆ డాక్టరుకు సాయిబాబాను గూర్చి వ్యతిరేకముగా మాట్లాడి, డాక్టరు మనసును మార్చి వేసారు. వెను తిరిగి వెళ్ళిపోయాడా డాక్టరు.
ఇంకో రకమైన వ్యక్తులు ఉంటారు. ఆ కోవలో చేరిన వాడే జహంగీర్ పటేల్ అనే పార్సీ. ఈయన సాయిబాబా భక్తుడు కాడు.
జహంగీర్ ఆఫీసులోనే లిమాయే అనే పేరు గల సాయి భక్తుడుండే వాడు. లిమాయే అంటే జహంగీరుకు గిట్టదు. లిమాయేను ఎలా వేధించాలా అని జహంగీరు ఆలోచించాడు.
జహంగీరుకు వసంత రావు నారాయణ్ అనే మరో స్నేహితుడుండే వాడు. వసంతరావును అడిగి జహంగీర్ సాయిబాబా పటాన్ని తీసుకున్నాడు.
వసంతరావు, జహంగీరు కూడా సాయి భక్తుడయ్యాడేమో అని సాయి చిత్రాన్ని ఇచ్చాడు.
కాని జరిగినది వేరొకటి. జహంగీరు సాయిబాబా పటాన్ని లిమాయే వద్దకు తెచ్చి, సాయిని గూర్చి అపవిత్రంగా మాట్లాడే వాడు. దానితో లిమాయే మనసు బాధపడేది.
ఇక తట్టుకోలేక వసంతరావును అడిగాడు జహంగీరుకు సాయిబాబా పటం ఎందుకిచ్చావని? జహంగీర్ కూడా బాబా భక్తుయ్యాడేమో అనుకొని ఇచ్చానని చెప్పాడు.
వసంతరావు, లిమాయేలు జహంగీరు మనసు సాయిబాబా వైపు మళ్ళితే బాగుంటుందను కున్నారు. సాయి ఆ ఇద్దరి అభ్యర్ధనను కాదంటాడా?
పదిహేను రోజులు గడిచాయి. జహంగీరు ఏడుస్తూ ”నేను సాయి పట్ల అపచారం చేశాను. పశ్చాత్తాపపడుతున్నాను. ఈ పైకాన్ని బాబాకు దక్షిణగా పంపు” అని డబ్బు ఇచ్చాడు వసంతరావుకు.
ఇక వసంతరావు, లిమాయేలు సంతసించారు. ఒక సత్పురుషుని దూషించరాదు అని హితవు చెప్పారు.
వారందరు 1918 గురుపూర్ణిమ నాడు అంటే జూలై 23న షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించుకున్నారు.
మనము అందరినీ గౌరవించనక్కర లేదు, ద్వేషించకుండా ఉంటే చాలు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- స్మరణమాత్ర ప్రసన్నాయ…..సాయి@366 జూలై 1…..Audio
- ప్రకృతిని శాసించే సాయి …..సాయి@366 జూలై 12….Audio
- పడనీయను …..సాయి@366 జూలై 14….Audio
- ప్రేమ బీజాన్ని నాటిన సాయి ….. సాయి@366 మార్చి 7….Audio
- ఓం సత్యనారాయణ స్వామినే నమః…..సాయి@366 జూలై 10….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments