ప్రకృతిని శాసించే సాయి …..సాయి@366 జూలై 12….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


”సత్పురుషులలో శ్రేష్టుడయిన సాయి పరమేశ్వరుని మరో అవతారం” అంటారు హేమాడ్‌పంత్‌  శ్రీ సాయి సచ్చరిత్ర పదునొకండవ అధ్యాయంలో. సాయికి ప్రకృతి శక్తులన్నీ ఆధీనమే.

ఏ ప్రకృతి శక్తి అయినా సాయినాథుని ఆజ్ఞను, ఆదేశాన్ని, సంకల్పాన్ని మీరజాల గలదా?

సాయి భక్తుడు శ్రీ జీ.వి రామ అయ్యర్‌. ఆయన కుమారుడే డాక్టర్ జి.ఆర్‌. విజయ కుమార్‌.

విజయ కుమార్‌కు బాల్యం నుండి సాయిబాబా తెలుసు, సాయి సచ్చరిత్రా తెలుసు. ఎందుకంటే తండ్రి సాయి భక్తుడు కనుక.

విజయ కుమార్‌లో సాయి భక్తి అంకురింప లేదు. భక్తి బీజం నాటుకునే సమయం ఇంకా రాలేదు. ఆయన తండ్రి రామ అయ్యర్‌ మరణించారు.

సాయిబాబా వెండి గొలుసు ఆయన మెడలో ఉండేది. ఆ గొలుసుతోనే ఆయనను దహనం చేశారు. మరునాడు విజయ కుమార్‌ తండ్రి అస్తికల కొరకు స్మశానానికి వెళ్ళి అస్తికలు ఏరుతున్నాడు.

ఆయన ఆశ్చర్యపోయాడు. తండ్రి ధరించే ఆ వెండి హారం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. తండ్రి హారాన్ని తెచ్చి తల్లికి చూపాడు. ఇక ఆ హారాన్ని విజయ కుమార్‌ని ధరింపమన్నది ఆ తల్లి.

అంతటి ఉష్ణోగ్రతకు ఆ హారం కరిగి పోవలసిందే. అది సాయి మహత్తు అని గ్రహించాడు. ఇక సాయిపై నమ్మకం ఏర్పడింది. సాయిని ఏ అగ్ని తాకగలదు?

అది పూనా నగరం. అక్కడ శివాజీనగర్‌లో సాయి మందిరం ఉన్నది. ఆ మందిరంలో గల సాయినాథుని వర్ణ చిత్రపటం నిత్యం భక్తులచే పూజ లందుకునేది.

ఆ మందిర నిర్మాణమే ఒక విశేషం. పూనాలో పాన్షెర్‌ డ్యాం ఉన్నది. 12.7.1961న అకస్మాత్తుగా అది కృంగిపోయింది. నీరు వెలుపలకు ప్రవహించి పూనా నగరాన్ని ముంచెత్తింది.

ఎంతో నష్టం వాటిల్లింది. ఆ ముంపు నీరు శివాజీనగర్‌ను కూడా ముంచి వేసింది. సాయి మందిరం పైన 20, 25 అడుగుల ఎత్తు వరకు వరద నీరు చేరింది.

ఆ మందిరం కొన్ని రోజులపాటు బురదలోని వరద నీటిలోను మునిగి ఉంది. వరద తగ్గు ముఖం పట్టిన తరువాత భక్తులందరూ సాయి మందిరం దగ్గర పేరుకు పోయిన బురదను తొలగించారు.

వారందరకూ ఒక అద్భుత దృశ్యం కనువిందు చేసింది.

ఆ మందిరంలో ఉన్న సాయినాథుని చిత్రపటాన్ని వరద నీరు ఏమి చేయలేక పోయింది.

ఇంకా ఔదంబర వృక్షం కూడా కళకళలాడుతూ ఉన్నది. వరదాయి సాయిని వరద నీరేం చేస్తుంది – ఎన్ని రోజులు నిల్వ ఉన్నా! సాయి పటం జీవకళ లొలుకుతూ అందరినీ ఆకర్షించింది. ఇది సాయి మహిమే కదా!

సాయి మనలను ప్రకృతి విపత్తుల నుండి కాపాడు గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles