శ్రీరామ విజయం…..సాయి@366 అక్టోబర్ 1….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిబాబా భావార్ధ రామాయణమును, ఆధ్యాత్మ రామాయణమును పారాయణ చేయవలసినదిగా ఇతరులకు చెప్పేవారు.

సాయిబాబా 1918 అక్టోబరు 1న వజే అను భక్తుని పిలిచి ”శ్రీరామ విజయం చదువు, దానివల్ల మృత్యుంజయుడు సంప్రీతుడవుతాడు” అని వజే చేత మూడుసార్లు పారాయణ చేయించుకొని విన్నారు.

పారాయణ చేయించుకొని వినవలసిన అవసరము తనకు లేనప్పటికి సద్గ్రంథముల పారాయణ ఆవశ్యకతను మనకు చెప్పినట్లు భావించాలి.

ఇది మరాఠా భాషలో ఉన్న పారాయణ గ్రంథము. రచయిత శ్రీధర కవి. జ్ఞానేశ్వరునకు, ఆయన సోదరుడే గురువు అయినట్లు,

శ్రీధర కవికి ఆయన నాన్నగారే గురువు. శ్రీధరుని తండ్రి బ్రహ్మానందులు. పూర్వాశ్రమంలో కరణంగా పనిచేసి, పండరికి వచ్చి విధియుక్తంగా సన్యాసం స్వీకరించి భీమా నదీ తీరంలో సమాధి పొందారు.

శ్రీధరుడు కూడా చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నాడు. శ్రీధరునకు గురువర్యులు రామ విజయ గ్రంథమును సరళముగాను, సుందరముగాను రచింపగలవని అభయం ఇచ్చారు.

వ్యాసుని రామకథను ప్రమాణంగా తీసుకుని, పండరీనాథులు తన చెవిలో ఏది చెపితే అది రాశాను అంటారు శ్రీధరులు. దీని కర్త పండరీనాథుడు; శ్రీధర నామం నిమిత్తమాత్రం అంటారాయన.

రామ విజయం నలుబది అంతస్తులు కలిగిన సుందరమైన దివ్య మందిరం. సీతా సహితంగా రఘువీరుడు అందులో విహరిస్తుంటాడు.

రామ విజయం నలుబది భాగాలతో అలరారే బృందావనం. అందులో రఘువీరుని కథ తులసికోట లాంటిది.

రామ విజయం 40 కోశాగారాలతో నిర్మితమైన అతి అందమైన భవంతి. ఆ కోశాగారాలు అపారంగా సాహిత్య ద్రవ్యంతో నిండి ఉన్నాయి.

రామ విజయ గ్రంథ పేటికలో 40 అరలున్నాయి. నవ రత్నాలతో నింపి నాకు బ్రహ్మానందుల వారిచ్చారు అంటారు ఆయన అతి వినయంగా.

ఒకసారి పారాయణ చేస్తే సంకటాలు సుడిగాలికి మేఘముల వలె చెల్లచెదరవుతాయి.

శ్రవణం, పఠనం లేకున్నా నిత్యం పూజిస్తే, ఇంట్లో వారి బాధలన్నిటిని హనుమంతుడే వచ్చి తొలగిస్తాడు.

రామకథా శ్రవణం చేస్తే వాయునందనుడు ప్రేమతో సదా చేతులు జోడించి నిలబడి ఉంటాడు. శుచిగా రామ విజయాన్ని దిండుగా చేసుకొని నిద్రపోతే స్వప్నంలో మారుతి దర్శనమిస్తాడు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles