Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబాను తల క్రిందుగా, కాళ్ళు పైకి కట్టబడి ఉండే యోగసాధనకు గురిచేశాడు ఆయన గురువు.
అటువంటి క్రియను సయ్యద్ షా బియాబానీ చేశారు. ప్రార్థన, స్తోత్రం, ధ్యానం, ఉపవాసాలతో భగదనుగ్రహం కోసం ప్రయత్నించేవాడు.
చినిగిన లుంగి, భుజంపై గొంగడి, చేతిలో కర్రతో తిరుగుతుండే బియాబానీచేత అరబ్బులు వెట్టిచాకిరి చేయించు కుందామనుకున్నారు.
అరబ్బులు ఆయన నెత్తిన మూట పెట్టి, మోసుకు రమ్మన్నారు. బియాబానీ నెత్తిపైనున్న మూట ఒక అడుగు ఎత్తులో ఉండి, ఆయనతో పాటే కదులుతోంది.
ఈయన మహాత్ముడని గ్రహించి క్షమింపమని కోరారు. ఇటువంటి వెట్టిచాకిరి ఎవరిచేతా చేయించమని వారి దగ్గర మాట తీసుకున్నారు బియాబానీ.
ఆయన అందరకూ సేవలందించేవారు. ఆయన ఖాజీ అయ్యారు.
హవేలీలో ఉండకుండా, సామాన్య దుస్తులు ధరించి, సామాన్యులు తినే తిండి తింటూ పూరింటిలో ఉండేవాడు. సాయి పాడుబడిన మసీదులో ఉండేవాడు.
ఒకసారి ఖవ్వాలీ జరుగుతుంటే బియాబానీ వెళ్ళారు. ఆయన ఉన్నట్లుండి కాస్త ప్రక్కకు జరిగి కూర్చున్నారు. చూచే వారికెవరికి బోధపడలేదు ఆయన చర్య, ఖవ్వాలీ అయిన తరువాత అడిగారు ఆయనను.
హజ్రత్ హఫీజ్, హజ్రత్ షేకసాది వచ్చారని చెప్పాడు. వారు సూక్ష్మ శరీరంతో వచ్చారు కనుక అందరకూ కనబడరు.
ఒకసారి ఆయన శిష్యుడు జుల్ఫాన్ ఉత్తర భారత దేశం వెళ్ళాడు. దురదృష్టవశాత్తు పక్షవాతం వచ్చింది. ఎంతకూ తగ్గడంలేదు.
గురువును (బియాబానీని) ప్రార్ధించాడు. “జుల్ఫాన్, నీ రోగం పోయింది. లే! వచ్చి నన్ను కలుసుకో” అన్నారు బియాబాని, జుల్ఫాన్ నిద్రపోతుంటే.
నిద్ర నుండి వెంటనే లేచాడు. పక్షవాతం పోయింది. మరల ప్రయాణం చేసి గురువు వద్దకు వచ్చి కృతఙ్ఞతలు తెలియచేశాడు గురుదేవులకు.
ఒకసారి బియాబాని, ఆయన కుమారునితో రాత్రిపూట పల్లకిలో బయలుదేరాడు. దివిటీలు ఆరిపోజొచ్చాయి. తగినంత నూనె లేదు.
దివిటీలు లేకుండా పల్లకీ నడవటం నిషిద్ధం ఆ కాలంలో. పల్లకి బోయీలు బిలబడిపోయారు.
తాను త్రాగే మట్టి కూజాలోని నీటిని పొయించినారు. ఆ దివిటీలు ఆ నీటితో దేదీప్యమానంగా, ప్రకాశవంతంగా వెలగసాగాయి.
ఊరి బయట తాటితోపు వద్ద నమాజు చేస్తానని, ఎవ్వరునూ ఈ గీత దాటి రావద్దని గీత గీశారు. బియాబానీతో పాటుగా తాటి చెట్లు కూడా వంగేవి.
ఇస్లాం సంప్రదాయంలో మహా మహిమాన్వితులైన వారి దర్గాలు మాత్రమే పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
బియాబానీ గారి దర్గా అటువంటి వాటిలో మూడవది. అది ఖాజీపేటలో ఉంది. తేదీ వివరాలు అలభ్యములు.
బియాబానీగారిని స్మరిద్దాం! తరిద్దాం!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కోరుకున్న బీదరికం…. మహనీయులు – 2020… జూలై 16
- దైవలిఖితం…. మహనీయులు – 2020… జూలై 18
- ప్రార్దించు! …. మహనీయులు – 2020… జూలై 14
- బింబము – ప్రతిబింబము…. మహనీయులు – 2020… జూలై 11
- రామా, నీ దయ రాదా? …. మహనీయులు – 2020… జూలై 9
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments