కోరుకున్న బీదరికం…. మహనీయులు – 2020… జూలై 16



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అస్సీసి పట్టణంలో ధనవంతుని కుమారునిగా జన్మించాడు ఫాన్సిస్. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

ఒక బిచ్చగాడు దీనంగా ధర్మం అడిగాడు. ఫ్రాన్సిస్ చుట్టూ ఉన్న స్నేహితులు బిచ్చగాడిని గేలి చేశారు. కాని ఫాన్సిస్ తన వద్ద ఉన్న బంగారు నాణేలన్నీ ఏమీ ఆలోచించకుండా దానం చేశాడు.

అది ఆయన ఆధ్యాత్మిక పథంలోని తోలి అడుగు. విచ్చలవిడిగా దాన ధర్మాలను చేస్తుంటే ధనికుడైన తండ్రి అడ్డగించాడు కుమారున్ని.

ఫ్రాన్సిస్ తన ధనాన్ని, ఆభరణాలను, కట్టుబట్టలను తండ్రికి ఇచ్చివేస్తూ, “నా తండ్రి నా క్రీస్తే” అని వెడలిపోయాడు.

అతి కఠినమైన బీదరికంలో ఉండి దైవంపై ప్రేమను అందరికీ తెలుపసాగాడు. ఒక కోటీశ్వరుడు ఆయన బోధనలకు ముద్గుడై, తన సర్వస్వాన్ని ఫ్రాన్సిస్ కు ఇచ్చివేశాడు.

ఒకసారి ఫ్రాన్సిస్ సోదర బృందంతో అడవిలో పోతున్నాడు. అనేక చెట్లపై ఉన్న పక్షులు తనను చూడటం గమనించి, అక్కడే ఆయన ఆగిపోయాడు.

“మీరంతా భగవంతునికి కృతజ్ఞతతో ఉండాలి. మీరంతా ఎగరగలరు, పాడగలరు. సూర్య కాంతిని, వాయువుని ఆస్వాదించగలరు.

భగవంతుడు మీ కోసం నీరు, ఆహారం, ఏర్పరచి యున్నాడు. ఆయనకు కృతజ్ఞత తెలపండి” అన్నాడు పక్షులతో.

ఆయన బోధ అనంతరం పక్షులన్నీ తలో దోవ పట్టాయి ఆకాశంలో.

ఫ్రాన్సిస్ పశువులను, విశేషించి కౄర జంతువులను కూడా దైవనామంతో సాధు జంతువులుగా చేశాడు.

మానవ మాంసాన్ని మరిగిన ఒక తోడేలును గుబ్బియో అనే ప్రదేశంలో, దాని కౄరత్వాన్ని తొలగించాడు.

గతంలో ఫ్రాన్సిస్ కు కుష్టురోగులంటే అసహ్యం, రోత. ఒకసారి ఫ్రాన్సిస్ పోతుంటే కుష్టురోగి ఎదురయ్యాడు. అప్పుడు ఫ్రాన్సిస్ కుష్టురోగిని కౌగలించుకుని, ముద్దు పెట్టుకున్నాడు.

సాయిబాబా కూడా ఒకసారి తన వద్దకు వచ్చిన కుష్ఠురోగిని చూసి శ్రీమతి తారాబాయి తర్కడ్ అసహ్యించుకుంది. ఆ రోగి ఎప్పుడు పోతాడా అని కూడా అనుకుంది.

ఆ కుష్టురోగిని సాయి ఆత్మీయంగా చూచి, ఆ రోగి వద్దనున్న తీపి పదార్దాన్ని తీసుకున్నాడు. అంతేకాదు, ఆ తీపి పదార్దాన్ని శ్రీమతి తారాబాయి తర్కడ్ కు కూడా ఇచ్చాడు. ఆమె తింది. ఆమె శరీరానికి కుష్టురోగం రాలేదు.

ఇక ఫ్రాన్సిస్ తన దారిన తాను పోతున్నాడు. రెండు, మూడు అడుగులు ముందుకు వేసి, ఒకసారి వెనుకకు తిరిగాడు. ఆ కుష్టురోగి జాడేలేడు. అదృశ్యుడయ్యాడు ఆ కుష్టురోగి.

ఆ కుష్టురోగి ఎవరో కాదు, జీసస్ అనుకున్నాడాయన.

ఫ్రాన్సిస్ దేహాన్ని విడిచిన అనంతరం జూలై 16, 1228లో సెయింట్ గా కీర్తింపబడ్డాడు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles