దొంగ కూడా మనవాడే …. మహనీయులు – 2020… మే 16



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబాకు అన్నదానము ఇష్టమే, సంగీతము కూడా ఇష్టమే.

భట్ జీభావ్ మహారాజ్ పూర్వికులు హైదరాబాదుని నివాస స్థలంగా చేసుకున్నారు. భట్ జీ ప్రతి ద్వాదశినాడు పారణ చేసేవాడు.

అంటే ఏకాదశి వ్రతం గాని, ఉపవాసముగాని, ఇతరులు వచ్చినచో భోజనము సమకూర్చెడివాడు.

ఈయనకు అన్నదానమే గాక –  హిందుస్తానీ సంగీతంపై అభిరుచి మెండు. భగవంతునిపై భక్తి మెండు.

“నీకు (భగవంతునికి) ఏదీ ఆమోదమో, నాకు అదే సమ్మతం. మంచి జరిగినా సంతోషమే, చేడు జరిగినా సంతోషమే” అనేది అయన జీవన శైలిగా మారింది.

ఒకసారి అయన ధర్మపత్ని నీళ్ళు తోడుతూ బావిలో పడింది. చుట్టుపక్కలవారు అంతా బావి చుట్టూ మూగారు, ఆమెను బయటకు తీయటానికి ప్రయత్నిస్తున్నారు.

ఒకడు “మహారాజా! మీరు కించెత్తైన కదలలేదేమి? నీ భార్య గురుంచి చింత మీకు లేదా?” అని ప్రశ్నించాడు.

“ఆ సమయంలో నేను పూజ చేస్తున్నాను. నా పత్నిని దక్కించుకున్నాను. నేను పూజానుండి లేచివస్తే, బహుశః  ఆమె మునిగి పోయివుండేది, చనిపోయేది. నా పూజ కూడా పూర్తి  కాకుండా పోయేది” ఇది పూజా ప్రభావం.

మహారాజ్ ఇంట్లో ఎప్పుడు జనం ఉండేవారు. ఒకసారి వారి అబ్బాయికి జీతం వస్తే, జేబులోనే ఉంచాడు.

బట్టలు విడిచి స్నానానికి పోయాడు. స్నానం చేసి వచ్చి చూచేసరికి డబ్బు పోయింది. తండ్రికి, ఇతరులకు ఈ సంగతి తెలిసింది. ఒక వ్యక్తిపై అందరకూ అనుమానం వచ్చింది, ఆగ్రహం కూడా వచ్చింది.

మహారాజ్ “నీ అజాగ్రత్తవలన ఇంటికి వచ్చిన ఒక అతిధిని నేను సేవించే భాగ్యం కోల్పోయాను. దొంగ మనవాడే. పోయిన డబ్బు మనదే. కనుక దోంగతనమనే ప్రశ్నేలేదు” ఇది మహారాజు చిత్తవృత్తి.

ఒకసారి చంచల్ గూడా జైలు నుండి ఏడు లేక ఎనిమిది మంది ఖైదీలు విడుదలయ్యారు.

భట్ జీ మహారాజ్ దగ్గరకు వచ్చి, ఆకలిగా ఉంది అన్నం పెట్టించండి అని అడిగారు. కోడలును అయన తొందరగా వంటచేయమన్నారు మహారాజ్.

“ఇంట్లో బియ్యం నిండుకున్నాయి” అని ఆమె మహారాజ్ కు చెప్పింది. మహారాజ్ “భగవాన్ మా ప్రతిష్ట మీ చేతిలో ఉంది” అని హృదయపూర్వకముగా వేడుకున్నారు భగవంతుని.

ఇంతలో ఒక టాంగా వచ్చి ఇంటిముందు ఆగింది. “మా ధర్మ గురువులు మీకీయమన్నారు” అని చెప్పి రెండు బస్తాల బియ్యపు మూటలను ఇంట్లో ఇచ్చి వెళ్ళాడు టాంగావాడు.

ఇంతకీ ఆ ధర్మ గురువు ఎవరు? అన్నిటిని జైలు నుంచి విడుదలైన దొంగలు గమనిస్తున్నారు.

ఎవరైతేనేమి దొంగలంతా భోజనము చేశారు. ఇక ఎప్పుడు దొంగతనాలు చేయమని వారిచే బాసచేయించారు మహారాజ్.

మే 16, 1932 మహారాజ్ అనంతునిలో లీనమైపోయారు.

నేడు మే 16, ఆయనను స్మరించి అందరిని ఆదరించెదము గాక.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles