Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా, పేద పకీరుగానే షిరిడీ వచ్చినప్పటినుండి మహాసమాధి చెందేవరకు (ఒకటి, అరా సంఘటనలు మినహా) షిరిడీ నుండి కదలలేదు.
ఇందులకు భిన్నంగా ఉంటారు నారాయణ మహారాజ్. ఈయన సాయితోపాటు పంచ మహాపురుషులుగా కీర్తింపబడిన వారిలో ఒకరు.
నారాయణ మహారాజ్ భోగ పరాయణునివలె జీవించేవాడు. జరీ అంచుగల పట్టు పీతాంబరములు, రాళ్ళు పొదిగిన బంగారు గుండీలు, వెండి సామానులు, వెండి సింహాసనము మొదలైనవి వాడేడివారు.
ఈ పద్దతి (జీవనమును)ని చూచి, మహారాజ్ జీవితము కొందరుకు సరిగా అర్ధము కాకుండెడిది.
నారాయణ మహారాజ్ బాల్యంనుండి దత్త అనుగ్రహముచే లీలలను చూపేవారు. ఒకసారి స్నేహితులు ఆటలు ఆడుచూ ఆకలి దప్పికలు అవుతున్నాయన్నారు.
క్రింద నున్న రాళ్ళను తీసుకుని, దత్తుని ధ్యానించగా అవి పంచదార బిళ్ళలయ్యాయి. వాటిని స్నేహితులకిచ్చాడాయన ఆకలి దప్పికలు తీర్చుకునేందుకు.
ఒకసారి అన్నదాన కార్యక్రమం జరుగుతొంది. చీకటి పడుతొంది. దీపాలలో నూనె అయిపోయింది.
వెంటనే మహారాజ్ ఒక బావి నుండి నీరు తోడి, ఆ దీపాలలో పోశారు. ఆ చీకటిని వెలుగులు తరిమాయి.
ఈ వార్తను బొంబాయి భక్తులు వినటం జరిగింది. వారిలో ఒక భక్త దంపతులతో భార్య, తన నాసికాభరణాన్ని కానుకగా సమర్పించింది. కానీ మహారాజ్ వద్దన్నాడు.
ఐనా ఆ భక్తురాలు అక్కడనే ఆ నాసికాభరణాన్ని ఉంచి వెళ్ళబొయింది. మహారాజ్ ఆ భక్తురాలికి ఒక బొబ్బరికాయను ప్రసాదించారు.
ఆ దంపతులు బొంబాయి వెళ్ళి, కొబ్బరికాయను పగులగొట్టారు. ఆ కొబ్బరికాయనుండి నాసికాభరణం బయటకు వచ్చింది. అక్కడున్న వారందరకూ, ఆశ్చర్యం కలిగింది.
ఆనందంతో నారాయణ మహారాజ్ ను మరోసారి స్మరించారు. ఇటువంటి సంఘటన సాయిబాబా సాహిత్యంలో కూడా ఉంది, నాసికాభరణం మహారాజ్ కు ఎందుకు?
గంగాధర్ అనే భక్తుని కుమారునకు చెడు వ్యసనాలు అలవడ్డాయి. ఆయన మహారాజ్ ను వేడుకున్నారు తన కుమారుని సన్మార్గంలో పెట్టమని.
మహారాజ్ గంగాధర్ ను “నీకు కొడుకు కావాలా, నేను కావాలా?” అని అడిగారు. “నాకు మీరే కావాలి. నాకు ముక్తిని ప్రసాదించే దాత మీరే” అన్నాడు ఆ భక్తుడు.
ఈ సంఘటన సాయిబాబా సాహిత్యంలో రేగే మహారాజ్ సంఘటనను పోలివుంటుంది.
అప్పటివరకు ఖేడ్ గాం భేట్ ను రంగస్థలంగా చేసుకున్నారు నారాయణ మహారాజ్.
తాను నిర్మించిన దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తుని వద్ద అనుమతి తీసుకుని భేట్ నుండి కదిలేవారు.
ఈసారి అలా చేయక ఆ గ్రామాన్ని వదలి వెళ్ళిపోయారు.
మే 20, 1885న నారాయణ మహారాజ్ జన్మించారు.
నేడు మే 20 . ఆయన జన్మదినం రోజున నారాయణ మహారాజ్ ను, దత్త ప్రభువును స్మరించెదము గాక.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- త్యాగధనుడు …. మహనీయులు – 2020… జూన్ 3
- అడుసు తొక్కనేల…కాలు కడగనేల… …. మహనీయులు – 2020… డిసెంబరు 1
- స్వామి నారాయణ …. మహనీయులు – 2020… జూన్ 1
- సాయి తారక మంత్రము…. మహనీయులు – 2020… మే 15
- అంతా మన మంచికే! …. మహనీయులు – 2020 – జనవరి 31
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments