Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నాగపూర్ లో ఉపాసనీ మహారాజ్ దిగంబరియై తిరుగుచుండగా, పోలీసు వారికి ఈ విషయమును కొందరు తెలిపిరి. పోలీసు అధికారి ఉపాసనీని బట్టలు వేసుకొని తిరగమని చెప్పాడు.
“ఏమీ! నేను నగ్నంగా కనిపించుచుంటినా?” అని ఆ పోలీసు అధికారినే అడుగగా ఆ పోలీసు అధికారికి అక్కడున్న వారికి ఆ క్షణముననే బంగారు అంచులతో బంగారు పీతాంబరమును ధరించినట్లు కనపడ్డారు ఉపాసనీ. వెంటనే ఆ అధికారి ఉపాసనీకి ప్రణమిల్లి వెళ్ళిపోయాడు.
స్వాతంత్య్ర సమరంలో ఉపాసనీ పాల్గొనకపోయినా, ఆయనకోసం మహాత్మా గాంధీ వెళ్ళటం జరిగింది. ఈ విషయంలో సాయిబాబాను బాల గంగాధర తిలక్ కలవటం జ్ఞప్తికి తెస్తుంది.
సాయిబాబా మట్టిని మణిగా చేసిన ప్రజ్ఞ ఉపాసనీ విషయంలో చూపించారు.
సాయిబాబా ఉపాసనీ తనవద్దకు రాకపోయినా, వచ్చినా మరల సాయిని దర్శించటం ఇష్టంలేకపోయినా, సాయి ఊరుకోలేదు.
సాయి ఉపాసనీతో “నీ భవిష్యత్తు మిక్కిలి శుభాస్పదం” అని దీవించారు.
ఒక భక్తుడు సాయిబాబాతో “ఏమి? బాబా నీ పరిపూర్ణానుగ్రహమును అతనికి రాగి రేకు మీద శాసనము వలె లిఖించి ఈయనుంటివా?” అని ప్రశ్నించాడు ఉపాసనీనీ గురించి.
సాయి సమాధానముగా “నాకు గల సర్వస్వము ఈతని కనుగ్రహింపబడినది” అన్నారు.
మరల “ఏమి బాబా ఈ వ్యక్తికి(ఉపాసనీకి) నీ సర్వస్వము ప్రసాదించితివా?” అని అడిగాడు “అవును, అవును, సకలము ప్రసాదింపబడినది. మంచివాడు గాని, చెడ్డవాడు గాని అతడు నా వాడు” అని మరింత స్పష్టంగా సాయి చెప్పారు ఉపాసనీని గురించి.
ఇంకను “నాకును, అతనికిని భేదమేమియు లేదు” అని కూడా పలికారు సాయిబాబా.
సాయిబాబా ఉపాసనీని అనేక విధముల ఆధ్యాత్మిక అభివృద్ధికై పాటుపడినారు.
సాయి ఇంత బహిరంగంగా, ఏ ఒక్కరిని గూర్చి పలుకలేదు. త్రికాల జ్ఞానైన సాయినాథునకు తెలియనిదేమి?
ఏడు దినములలో తిరిగి షిరిడీకిరాను అనిన ఉపాసనీని షిరిడీకి తెప్పించుకొనిన సాయిబాబాకు ఉపాసనీ మహారాజ్ యొక్క భవిష్యత్తు తెలియదా?
ఏ ఒక్కరికి సాయిబాబా చేయించని విధంగా గురుపూజను గురుపూర్ణిమనాడు ఉపాసనీకి చేయించారు సాయిబాబా.
రామ తారక మంత్రమువలె సాయి తారక మంత్రమా అనునట్లు “నమామీశ్వరం సద్గురుం సాయినాథం” అనే చరణాన్ని సాయి భక్తులకు ప్రసాదించారు ఉపాసనీ మహారాజ్.
ఉపాసనీ మహారాజ్ జన్మదినం మే 15 (1870).
నేడు, మే 15 ఉపాసనీ జన్మదినం. ఉపాసనీని సాయిని స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గురుత్వాన్నిచ్చిన సాయి…..సాయి@366 జూలై 27….Audio
- నడిపించే అదృశ్య శక్తి…..సాయి@366 జూలై 6….Audio
- గంగం గణాంబొతే – గం గం గోదావరి …..సాయి@366 డిసెంబర్ 24….Audio
- ఉపాసనీ మహారాజ్ విగ్రహం …..సాయి@366 జనవరి 13….Audio
- ప్రసాద ప్రాప్తి!…..సాయి@366 ఏప్రిల్ 3…..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments