బ్రతుకు బాగు చేసిన దైవ దర్శనం ;



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు గిరిధర్. మేము వనస్థలిపురంలో ఉంటాము. నేనొక చిరు ఉద్యోగిని.

నేను ఇంటర్ చదివే సమయానికి మా నాన్న గారి ”పట్వారి” ఉద్యోగం పోయింది.

మా బాబాయికి తను చేస్తున్న ఉద్యోగం కూడా పోయింది. నాది ఇంటర్ అయిపోయింది.

నేను ఇంజినీరింగ్ చదవటానికి సమయం ఉంది, పైగా డబ్బులు లేవు, అందుకని మా ఊరికి ప్రయాణం అయ్యాము. నేను, మా బాబాయి ఇద్దరమూ వ్యవసాయం చేయాలనుకున్నాము.

మా ఇంటి దగ్గర స్కూల్ ఉంది, ఆ స్కూల్ పిల్లలు ఆడుకుంటుంటే నేను వెళ్ళాను. ఆట మధ్యలో పక్కనే ఉన్న చెత్త బుట్టలో నాకు ఒక పుస్తకం కనపడింది.

అది ”శ్రీ హనుమాన్ చాలీసా”.  అది అందులోంచి తీసాను, మర్నాడు నుండి 40 రోజుల పాటు చదివాను.

మేము స్వతహాగా ”రాఘవేంద్ర స్వామి” భక్తులం. ”రాఘవేంద్ర స్వామి” బృందావనం ముందు ”ఆంజనేయ స్వామి” ఉంటారు.

అలాగే ఆ 40 రోజులు శ్రీ రాఘవేంద్ర స్వామి స్త్రోత్రం కూడా చదివాను. 40  రోజులు అయ్యాక రేపు గురువారం అనగా నాకు ఒక కల వచ్చింది.

ఆ కలలో నేను ”మంత్రాలయం” వెళ్ళాను (నేను ఇప్పటి వరకు ఎప్పుడు మంత్రాలయం వెళ్ళలేదు).

నేను వెళ్లిన సమయానికి అక్కడ భోజనాలు అయిపోయాయి. భోజనం అయిపోయింది అంటున్నారు,

ఇంతలో ఒక పూజారి ఎర్ర బట్టలు కట్టుకొని నా దగ్గరికి  వచ్చి లోపలి కి నన్ను తీసుకువెళ్లి ”నేను పెడతాను” రమ్మనమని నా కోసం విస్తరి వేసి అందులో నేను రోజు నైవేద్యం గా పెడుతున్న ”హైగ్రీవం ” (సెనగ పప్పు, బెల్లం కలిపి వండే స్వీట్) స్వీట్ ఆయన నాకు పెట్టారు. అదీ కల.

అప్పుడు నేను మంత్రాలయం వెళ్లాలనుకున్నాను కానీ, నా దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు గురువారం మళ్ళీ గురువారం నాటికి కనీసం ఛార్జ్ లకి డబ్బు 150 రూపాయలు కనుక నేను సంపాదించగలిగితే, నేను మంత్రాలయం వస్తానని మొక్కుకున్నాను.

ఆ పక్కనే పిల్లలు కొంతమంది పేకాట ఆడుతుంటే వాళ్ళతో కూర్చున్నాను. నాకు వారంలో 1500 రూపాయలు వచ్చాయి, అప్పుడు నేను మంత్రాలయం వెళ్ళాను.

నాకు కలలో మాదిరిగానే అక్కడికి  వెళ్లేసరికి నిజంగానే భోజనాలు అయిపోయాయి. ఒక పూజారి నాకు విస్తరి వేసి భోజనం పెట్టారు.

అప్పుడు అక్కడ నుండి వచ్చాక, మా నాన్న గారికి తీసేసిన పట్వారీలు అందరికి ఎవరికైతే అర్హత వుందో వారందరికీ VRO  ఉద్యోగాలు ఇచ్చారు.

అందులో మా నాన్నగారు ఒకరు. ఉద్యోగం వచ్చింది కాబట్టి మా నాన్న గారు నాకు కాలేజీలో చేరడానికి 900 రూపాయలు మాత్రమే ఇస్తానన్నారు, ఆ డబ్బు సరిపోదు.

మా స్నేహితులు ”నీకు మంచి ర్యాంకు వచ్చింది, నువ్వు చదువు మానేయకూడదు, కాలేజీకి వెళ్ళాలి” అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి, షాప్స్, ఇల్లు అన్నీ తిరిగి చందాల రూపంలో సేకరించి 300 ఇచ్చారు.

నేను ఆ డబ్బుతో కాలేజీ ఫీజు కట్టాను. నేను ఉండడానికి ఉపయోగించుకున్నాను.

నేను ఇంజినీరింగ్ పూర్తి చేశాను. చిన్నపాటి ఉద్యోగం ఒకటి దొరికింది.  నాకు వివాహం జరిగింది.

మా ఆర్ధిక పరిస్థితులు అంతగా బాగోలేదు. మా చెల్లి మామగారు జ్యోతిష్యం చెబుతారు. ఆయన మా ఇంటికి వస్తూ, తనతో కూడా తంగిరాల వారి పంచాంగ పుస్తకం పట్టుకు వచ్చారు.

ఆ పుస్తకం వెనుక అట్ట మీద ”దత్త సాయి యంత్రం” ఉంది, ఆయన ఆ యంత్రం మీ ఇంట్లో ఈశాన్యం లో ఎత్తు మీద ఉంచి 63 రోజులు పాటు నియమ నిష్టలతో పూజలు చేసి ఒక మంత్రం కూడా పఠించమన్నారు.

నేను రోజు ఆ యంత్రానికి తులసి నీళ్ళతో రెండు పూటలా అభిషేకం చేశాను. ఒంటి పూట భోజనం, నేల మీద పడుకోవటం ఇలా చాలా నిష్టగా పూజ చేశాను. రెండు మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాలు –

1) ఓం పరాత్పరాయ విద్మహే పరమం సాయి ధీమహీ తన్నో సాయి ప్రచోదయాత్ – 9 సార్లు .

2)  ఓం, ఐం, క్రీం, శ్రీమ్, క్లిమ్, సామ్ సాయి నాధాయ స్వాహా . – 27 సార్లు . 

ఈ మంత్రాలు చదువుతూ పూజ చేయమన్నారు. ఇలా 63 రోజులు పూజ అయ్యాక రేపు గురువారం అనగా నాకు ఒక కల వచ్చింది.

ఆ కలలో మేమంతా బస్సులో ప్రయాణం చేస్తూ ఎక్కడికో వెళ్తున్నాము.

కొంత దూరం బస్సు వెళ్ళాక బస్సు డ్రైవర్ సడన్ గా బస్సు ఆపేసాడు, నేను బస్సు ఎందుకు ఆపేసావు అని అడిగాను,

ఎదురుగా బస్సు అద్దంలోనుంచి ఇంకా ఆగి ఉన్న బస్సులను చూస్తూ అతను బస్సు దిగి ముందుకు వెళ్లి మళ్ళీ బస్సు దగ్గరకు వచ్చి ”ఈ పక్కన ఒక గుడి, ఒక మసీదు ఉన్నాయట. ఇక్కడందరూ దర్శనం చేసుకుంటే గాని ముందుకు వెళ్లకూడదట. అందుకోసమే మిగిలిన బస్సు లన్నీ ముందు ఆగాయట ” అని అన్నాడు.

నేను బస్సు దిగాను. గుడి లోపలి కి వెడుతుంటే ఒక పక్కన మండపం ఉంది. ఆ మండపంలో ఒకాయన కాషాయం కట్టుకున్నాడు, కమండలం ఉంది, ఆయనకు గడ్డం కూడా ఉంది.

ఆయన నన్ను చూస్తూనే ”రా, రా గిరిధర్ అంటూ నన్ను పేరు పెట్టి పిలిచారు. నేనే రాముడను, నేనే కృష్ణుడను, నేనే శివుడను, నేనే విష్ణువును, ఇక్కడ ఎటువంటి గుడి లేదు. మసీదు లేదు. అన్ని నేనే అన్న విషయం తెలియచేయడానికి మాత్రమే ఇదంతా ఏర్పాటు చేశాను ” అన్నారు.

నేను తిరిగి బస్సులోకి వచ్చాను. బస్సులో నేను అంతక ముందు కూర్చున్న సీట్ తెల్లని వస్త్రము తో కప్పి, అలంకరించబడి ఉంది. రండి కూర్చోండి అంటూ నన్ను పిలుస్తున్నారు. అంతే కల అయిపోయింది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainatuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles