Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support by: Mrs. Jeevani
ఏ తండ్రి అయినా తన తనయుడు తనను మించిపోవాలనే కోరుకుంటాడు. ఇక ఆధ్యాత్మికపథంలో సద్గురువు తన శిష్యులు తనంతి వారు కావాలని కోరుకుంటాడు.
సాయి బాబా కాశీనాథ గోవింద ఉపాసనీని తనంతటివాడు కావాలని కోరుకున్నారు.
ఉపాసనీ 14 అశ్వత్ధ వృక్షాలను నాటు అని అంతరార్ధ యుక్తంగా పలికారు. అంతే కాదు సాయిబాబా 1913 జూలై గురుపూర్ణిమ రోజున గురుత్వాన్ని కూడా ఇచ్చారు.
సాయిబాబా అదేశానుసారం ఉపాసనీ ఖండోబా ఆలయంలో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాడు.
సాయిబాబా తన భక్తురాలైన చంద్రాబాయి బోర్కరును పిలచి, ఖండోబా ఆలయంలో ఉంటున్న ఉపాసనీకి గురుసేవ చేసిరమ్మని పంపారు. సేవ అంటే గురువుగా సేవించటం.
ఆమె మంచి మానసిక ధారుఢ్యముకల వ్యక్తి కనుకనే బాబా ఆమెను ఆ పనికి పురమాయించాడు.
ఆమె పూజా సామాగ్రితో ఖండోబా ఆలయానికి వెళ్ళి ఉపాసనీ పాదాల చెంత కూర్చున్నది.
ఉపాసనీ ఆశ్చర్యపోయి ”నా పాదాలను తాకవద్దు. వెళ్ళి పో” అన్నారు. సాయి తనకు ఇచ్చిన ఆజ్ఞను నిర్వర్తించాలని వచ్చానన్నది.
”సాయి ఆజ్ఞ ఏమి?” అడిగాడు ఉపాసనీ. ఆమె చెప్పింది. ”నాకు అవేమీ వద్దు. నా పాదాలను తాకవద్దు, వెళ్ళు” అంటూ కసురుకుంటూ పాదాలను వెనుకకు తీసుకున్నాడు ఉపాసనీ.
”కసిరినా సరే, కొట్టినా సరే. నేను సాయి ఆజ్ఞను పాటించవలసినదే” అంటూ ఆమె, ఆయన పాదాలను తన వైపుకు త్రిప్పుకున్నది.
ఉపాసనీకి కోపం హెచ్చి పిడికిలి బిగించారు. ఆమె స్వరం పెంచి ”ఈ పాదాలు, ఈ శరీరం మీవేనా?
మీ పాదాలు, శరీరం మాకు చెందుతాయి. ఈ ప్రపంచానికి చెందుతాయి. మీరేమి చెప్పినా వినను” అని ఆయన పాదాలపై పుష్పాలు ఉంచి, నైవేద్యంగా పాలను సమర్పించింది.
ఉపాసనీ శాంతించలేదు. ఆమె ఊరుకోలేదు. ”మీరేమి మాట్లాడవద్దు. నన్ను చేసేది చేయనివ్వండి.
ఈ గురుపూర్ణిమ నాడు నా చేత మీకు గురుపూజ ప్రారంభింప చేశారు సాయి. మీరు వద్దంటే ఆగుతానా?” అన్నది ఆమె.
ఉపాసనీ శ్రీ సాయినాథుని ఉన్నత సృజన వ్యక్తిగానే గాక, దేశ, విదేశాలను కూడా రక్షించి సరియగు మార్గాన్ని నిర్దేశింపగల మహా మహోన్నతుడని పేరు గడించాడు.
షిరిడీకి కూతవేటు దూరంలో గల సాకూరీలో సాయిచే నిర్దేశింపబడిన ఉపాసనీ గురువయ్యాడు. ఆయన ఆశ్రమం సాకూరీలో ఉంది.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నడిపించే అదృశ్య శక్తి…..సాయి@366 జూలై 6….Audio
- భగవానుని పాదుకలు …..సాయి@366 ఆగస్టు 27….Audio
- ఉపాసనీ మహారాజ్ విగ్రహం …..సాయి@366 జనవరి 13….Audio
- ప్రసాద ప్రాప్తి!…..సాయి@366 ఏప్రిల్ 3…..Audio
- సాయి తారక మంత్రము…. మహనీయులు – 2020… మే 15
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments