జయ జగదీశ హరే! … మహనీయులు – 2020… జూలై 27



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒకనాడు జయదేవుడు, అతని మిత్రుడు పూరి జగన్నాథుని దర్శనానికి పోతున్నారు. అడవిగుండా పోతున్నారు. జయదేవునకు దప్పికైంది.

నీటి జాడేలేదు. చివరకు జగన్నాథుని ప్రార్థిస్తాడు జయదేవుడు. ఆ దైవము ప్రతక్షమై దప్పిక తీరుస్తాడు.

సాయిబాబా కూడా తన భక్తుడైన నానా సాహెబ్ చందోర్కరు దాహాన్ని తీరుస్తాడు హరిశ్చంద్ర గుట్టపై.

జయదేవునకు బృందావనం, కదంబ వృక్షాలు, యమున, కృష్ణ, రాధ, గోపికలు మనసులో కదలాడారు.

ఇక అయన నోటివెంట గీతగోవిందం మొదలైంది. పూరి పోయేలోగా జయదేవునకు దశావతార దర్శనం జరిగింది. అది గీతగోవిందంలో చోటు చేసుకుంది (జయ జగదీశ హరే).

అయన గీతగోవింద రచన చేస్తున్నప్పుడు ఒక చరణం ఆగిపోయింది. ఎంతో ప్రయత్నించి, విఫలుడై, బయటకుపోయాడు.

ఆయన బయటకు వెళ్ళినప్పుడు కృష్ణుడే ఆ చరణాన్ని పూరించాడు. ఆ చరణం “దేహి పాదపల్లవ ముదరం…”

ఇటువంటి సంఘటన పోతన జీవిత చరిత్రలో “అల వైకుంఠపురంబులో ….” అనే పద్యం విషయంలో జరిగింది.

ఒకసారి జయదేవుడు అడవిలో పోతుంటే తన చేతులను ఖండించిన దొంగలపై, కక్ష పెట్టుకోలేదు. అనంతరం ఆ దొంగలను గుర్తించినా, వారికి కానుకలను సమర్పించి, ఆ దొంగల ముక్తి కొరకు ప్రార్థనలు చేశాడు.

“ఓ భగవంతుడా నీవు నీ శత్రువులైన కంసునికి, రావణాసురినికి ముక్తి ప్రసాదించావు. ఇప్పుడు నా శత్రువుల కెందుకు ముక్తిని ప్రసాదించవు” అని భగవంతుని వేడుకున్నాడు జయదేవుడు. ఇది అయన విశాల హృదయానికి నిదర్శనం.

ఒకసారి పూరిలోని జగన్నాధుని వస్త్రాలు చిరిగి ఉన్నాయి. రాజుకు, అర్చకులకు కారణం తెలియలేదు. వారు దైవాన్ని ప్రార్ధించారు.

ఒక తోటలో ఎవరో గీతగోవిందమును పాడుతుండగా, జగన్నాథుడు అక్కడకు వెళ్ళాడు. ఆ సమయంలో దేవుని పట్టు వస్త్రాలు ముళ్ళకు తగిలి చిరిగిపోయాయని జగన్నాథుడు తెలిపాడు. అప్పుడు అందరకూ గీతగోవింద మాధుర్యం తెలిసింది.

రాజు ప్రతి దినం గీతగోవిందమును జగన్నాథ సన్నిధిలో పాడేటట్లు ఏర్పాటు చేశాడు.

భారత ప్రభుత్వం వారు జూలై 27, 2009లో పోస్టల్ స్టాంపును జ్ఞాపకార్థం విడుదల చేసింది.

జయదేవునకు గోవిందుడు చిక్కాడు.

మనకు గీతగోవిందం చిక్కింది.

“జయ జగదీశ హరే….”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles