దైవమె సుమా! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 29



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రవీంద్రనాథ్ ఠాగూర్ జమీందారు వంశస్థుడు. కుష్టియా అనే ఊరు ఆ ఇలాకాలోనే ఉంది.

ఆయన పూర్వీకులలో ఒకరైన జ్యోతీంద్రనాథ ఠాగూర్ కుష్టియాలో నివసించే లలన్ ఫకీరు చిత్ర పటాన్ని గీచాడు.

లలన్ ఒక ఫకీర్. బౌల్ (baul) తెగకు చెందిన ఫకీరు. ఈ ఫకీరు గానం చేయబడిన 200 గీతాల వ్రాతప్రతి రవీంద్రనాథ్ ఠాగూరుకు దొరికింది. వెంటనే ఆయన 20 గీతాలను ప్రచురించాడు. ఆ గీతాలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి.

లలన్ ఫకీర్ రచించిన ఆ గీతాలే కాదు. ఆ గీతాలు పలికే (పలికించే) సంగీత మాధురికి, రవీంద్రుడు పరవశించిపోయాడు.

లలన్ రచనలోని మార్మికత్వం ఆకట్టుకుంది. రవీంద్రుడు దేశ విదేశాల్లో లలన్ గూర్చి విశదపరచాడు.

బౌల్ సాంప్రదాయంలో లలన్ మకుటంలేని మహారాజయ్యాడు. జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు.

లలన్ 1774లో కార్తీక మాసంలో జన్మించాడు. ఆయనను గూర్చి ఇతర వివరాలు లభించలేదు.

ఒకసారి ఆయన స్నేహితులతో పూరి జగన్నాథుని దర్శించి, సేవించి బయలుదేరాడు.

దారిలో ఆయనకు మశూచి సోకింది. స్నేహితులు ఆయనను దారిలోనే వదిలి వెళ్లిపోయారు.

మహమ్మదీయులైన సిరజ్ సన్వీ, ఆయన భార్య ఈయన దగ్గరకు వచ్చి, తమతోపాటు తీసుకుని వెళ్లి, మరల ఆరోగ్యవంతుని చేశారు.

లలన్ తిరిగి తన గ్రామానికి పోయాడు. ఎవరూ – చివరకు ఇంటిలోని వారు కూడా ఆయనను దగ్గరకు రానీయలేదు – కారణం ఒక్కటే, మహమ్మదీయలతో అతను కలసి జీవించాడు కొన్ని రోజులు.

లలన్ తిరిగి సీరజ్ వద్దకు వచ్చాడు. సీరజ్ బౌల్ సాంప్రదాయానికి చెందిన వాడు. లలన్ సీరజ్ ను గురువుగా స్వీకరించాడు. బౌల్ లలో రారాజుగా వెలుగొందాడు.

బౌల్ లు ఏకతార, దో తార, మద్దెల, తబలా వంటి సంగీత సాధనాలు ఉపయోగించి, మానవునిలోని దైవత్వాన్ని పొందటానికి సాధన చేస్తారు.

దైవము అనేది లలన్ దృష్టిలో మతాతీతమైనది. అది ఏ దేశానికి, మతానికి, ఆచారానికి కట్టుబడి ఉండదు.

బౌల్ సాంప్రదాయంలో వివాహితులు, అవివాహితులు కూడా ఉంటారు.

బౌల్ సిద్దుడైతే అతనిని ‘సాయి’ అని అంటారు. లలన్ ‘సాయి’యే.

లలన్ రచనలలో ఎలాంటి బౌద్ధ భావమూ ఉండదు. అతడు ధరించే మాలలో సగం తులసి పూసలు, సగం ఆవు ఎముకల పూసలు ఉంటాయి.

తంతి తపాలా శాఖ అక్టోబర్ 17, 1890లో చౌరియా (కుష్టియా జిల్లా)లో సమాధి చెందిన లలన్ గుర్తింపుగా డిసెంబర్ 29, 2003  న పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.

“నిరర్ధకంగా…

నాకు తెలియని మనిషి నేను కలసి నివసిస్తున్నాము

మా మధ్య లక్షల మైళ్ళ దూరం

నా కళ్ళకు ప్రాపంచిక కలల గంతలున్నాయి

అతనిని గుర్తించలేను, అర్ధం చేసుకోలేను…”అంటారు లలన్

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles