Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
అది గొలగమూడి. వెంకయ్యస్వామి భక్తుడు రోశిరెడ్డి బిక్షతేవటానికి బయలుదేరాడు. బిక్ష తెచ్చాడు. ప్రసాదాన్ని స్వామికి అర్పించాడు. అందరు ఆశ్చర్యంగా చూస్తారు ప్రతి దినం ఆ సంఘటనను.
ఎందుకంటే, రోసిరెడ్డి గారు అంధుడు. ప్రతి పనికి ఆయనకు ఒకరు తోడుండాలి. కానీ భిక్ష తేవటానికి మాత్రం ఎవ్వరూ అక్కరలేదు. కారణం ఆయనే చెపుతారు.
భిక్షా మార్గమంతా సన్నని దారమంతా కాంతి చూపిస్తూనే ఉంటుంది ఆయనకు.
ఒకరోజు తారాబాయి తర్కాడ్ షిరిడీలో ఒక వీధిలో నడుస్తోంది. దీపాలు లేని కారణంగా చీకటిగా ఉంది.
నడుస్తున్న తారాబాయి ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకు? ఆమెకే తెలియదు. ఎందుకు ఆగిపోయిందో.
ఇంతలో ఎవరో దీపం తెచ్చారు. క్రిందకు చూసింది. ఒక పాము నిశ్చలంగా పడుకున్నది. తారాబాయి అడుగు పడుకున్న పాముపై పడకుండ జాగ్రత్తగా ప్రక్కనుండి నడిచింది.
తనను అడుగు పడకుండా చేసి,. సమయానికి వెలుతురు చూపిన ఆ అదృశ్య హస్తం ఎవరిదో అని ఆమె ఊహించలేదు.
ఎందుకంటే తనకంటే ముందుగా తనకేది శ్రేయస్కరమో అది చేయించే సాయి కనురెప్పలాగా తనను రక్షిస్తున్నాడని, రక్షిస్తాడని ఆమెకు సంపూర్ణ విశ్వాసం.
ఇక సాయిబాబా అక్టోబరు 15 , 1918 న మహా సమాధి చెందారు. మహాసమాధి అనంతరం సాయి సంరక్షణగా భారాన్ని, క్రీడగా తీసుకుంటున్నాడు, భారంగా భావించలేదు.
అది కుంభకోణం. మని అయ్యర్ ఆ పట్టణ నివాసి. సాయి కృపచే మూగ బిడ్డ అయిన తన కుమార్తెకు మాటలు వచ్చాయి షిరిడీలో. అప్పటినుండి ఆయనకు సాయి భక్తి ఎక్కువైంది.
ఒకరోజు ఇంకా తెల్లవారలేదు.ఆయన రెండు చేతులలోను రెండు సంచుల చిల్లర నాణెములతో బయలుదేరాడు. ఇంకా వెలుతురు రాలేదు, సూర్యోదయం కాలేదు.
అది ఆయనకు తెలిసిన దారి. అకస్మాత్తుగా తన చేతులలోని సంచులలోనున్న చిల్లర నాణెములు రోడ్డుమీద జారీ పడిపోయాయి.
వెదుకుదామంటే చీకటి. ఇంటికి పోయి దీపం తెచ్చేలోగా ఎవరైనా నాణేలను తీసుకుపోవచ్చును. ఇక సాయియే దిక్కు ఆయనకు.
రోడ్డుమీద వెలుతురు వచ్చింది. ఆ వచ్చిన వెలుతురులో నాణేలన్నీ ఏరుకున్నాడు. తరువాత చూడగా అంతా చీకటిమయం. కారు చీకటిలో కాంతి పుంజం సాయి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి చీకటిలో వెలుతురును నింపుట–Audio
- ఉపాసనీ మహారాజ్ విగ్రహం …..సాయి@366 జనవరి 13….Audio
- కల నిజ మాయెగా! …..సాయి@366 డిసెంబర్ 27….Audio
- చీపురే ఆస్తి …..సాయి@366 డిసెంబర్ 20…Audio
- కోరుకున్న బీదరికం…. మహనీయులు – 2020… జూలై 16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments