Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మౌనస్వామి పూర్వాశమ నామం అచ్చుతుని పిచ్చయ్య. నీతి, నిజాయితీలతో ఉద్యోగం చేసేవాడు. వివాహమైంది.
సాయి భక్తుడైన శ్రీ బీ.వి. నరసింహస్వామి వలె, ఈయన కుటుంబంలోని వారి అకాల మరణం ఆధ్యాత్మిక పథంలోనికి దారి చూపింది.
వాసుదేవానంద స్వామి శుశ్రూష చేసి, యోగారూఢుడైనాడు. మౌనాన్ని స్వీకరించి మౌన స్వామిగా అయ్యాడు.
ఎంత కాలమీ మౌనం?
శృంగేరీ జగద్గురువుల ఆదేశంతో కుర్తాళంలో మఠం నిర్మింపదలచారు. ఇక మౌనాన్ని వీడారాయన.
ప్రసాదాన్ని రాగి డబ్బులిచ్చి కొనుక్కుని తినేవారు. ఇప్పుడు వట్టి చేతులు దులిపితే రాగి డబ్బులు వచ్చేయి. ఆ డబ్బులతోనే ప్రసాదం తినేవారు.
దండాయుధపాణి, ఆదిశంకరుల విగ్రహాలు ప్రతిష్టించే సమయంలో ఈయన వట్టి చేతులతో నవరత్నాలు సృష్టించి, విగ్రహాల క్రింద నిక్షేపించినారు.
ఇంకా ఒక విగ్రహం క్రింద ప్రతిష్టించబడటానికి చేయబడిన యంత్రం, ప్రతిష్టా సమయానికి అపరంజి యంత్రంగా మారింది.
సిద్ది వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి, కర్పూర హారతి ఇచ్చిన తరువాత ఆ విగ్రహానికి మానవుల వలె నాడి కొట్టుకొనసాగింది.
ఈ మహిమాపూరిత విగ్రహాలను దర్శించిన కొందరు పాశ్చాత్యులు మౌనస్వామి భక్తులైనారు.
ఒక సమయాన, సంతర్పణలో నేయి అందుబాటులోనికి రాలేదు. కానీ అక్కడ, కిరసనాయిలు ఉంది. ఆయన వెంటనే కొన్ని మూలికలను కలిపి కిరసనాయిలును నేయి క్రింద మార్చినారు.
ఈయన ప్రసాదంగా ఇచ్చే కుంకుమ దివ్య బెషధంగా పనిచేసేది. సాయి కూడా ఇచ్చే విభూతి దివ్య బెషధంగా పనిచేసేది.
ఈయన దత్తాత్రేయ మందిరములో సిద్ధేశ్వరీ పీఠాన్ని ఏర్పరచారు. మౌనస్వామి సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులు.
మంచి నీరు త్రాగేవారు కాదు. అన్ని పదార్ధములకు కలిపి ముద్దలుగా భక్తులు చేతిలో పెడితే తినేవారు. అవి కూడా మానివేసి వేపాకు రెండు లేక మూడు ఆకులు మాత్రమే తినేవారు.
సాయిబాబా కూడా తాను 12 సంవత్సరాలు వేపాకు తిని జీవించానని చెప్పారు.
యోగ శక్తితో గాలి, వెలుతురును ఈయన ఆహారంగా గైకొనేవారు.
“ప్రపంచం ఒక అంగడి వీధి. నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే ఉత్తమం. గృహస్థుడు బంధాలు విడగొట్టుకో గలిగితే చెడు మార్గం తొక్కకుండా ఉంటే, అతడే గొప్పవాడు. జనకునితో సమానం” అనేవారాయన.
సాయిబాబా కూడా ఆత్మ జ్ఞానం కోసం సన్యసింపుమని ఎవరినీ కోరలేదు.
మౌనస్వామి యోగాసన స్థితులై 28 డిసెంబర్ 1943న దేహాన్ని త్యజించారు. ఆయన సంకల్పతోనే నిర్మితమైన సిద్ధెశ్వర పీఠం శతాధిక వసంతాలతో విరాజిల్లుతోంది.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- గురువుకు నామం…. మహనీయులు – 2020… నవంబర్ 18
- పరీక్షలున్నాయి … …. మహనీయులు – 2020… డిసెంబరు 5
- గురు శిష్యులు వేరు కాదు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 6
- సత్య స్తంభం . …. మహనీయులు – 2020… డిసెంబరు 18
- శృంగేరి పీఠం … మహనీయులు @2020 – జనవరి 8
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments