వాగ్దానం …..సాయి@366 డిసెంబర్ 28….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


గాడ్గే మహారాజ్ కు అనేకమంది శిష్యులు, సేవకులు ఉన్నారు.

ఒకసారి ఆయన బొంబాయిలో ఉన్న జంగ్లీరాం ఠాకూర్ కు మూడు వేల రూపాయలు పంపవలసి వచ్చింది. దగ్గర ఎవరూ లేరు.  విశ్వనాథ్ వాగ్ అనే ఒక శిష్యుడు మాత్రం ఉన్నాడు.

వాగ్ తో గాడ్గే మహారాజ్ “నీవు బొంబాయికి వెళ్ళి జంగ్లీరాం ఠాకూర్ కు ఈ డబ్బు ఇవ్వాలి” అన్నాడు.

అతడు “సరే” అన్నాడు. గాడ్గే మహారాజ్ “ఇది ప్రజల ధనం. నేను నీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా ఆ డబ్బును అందచేయాలి.

దారిలో నీవు నిద్రపోకూడదు. అలా కాకుంటే కొంప మునుగుతుంది” అని హెచ్చరించారు. వాగ్  ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాడు.

ఆ రాత్రి బొంబాయికి పోయే ప్యాసింజర్ బండిలో ఎవ్వరు లేని పెట్టెను చూచుకొని డబ్బుతో ఆ పెట్టెలోకి ఎక్కాడు. రైలు కదిలింది.

నిద్ర ముంచుకు వస్తోంది. సీటుపై కళ్ళు జాపి పడుకున్నాడు. అంతే! నిద్రలోకి జారుకున్నాడు. పక్కకు చూచాడు వాగ్. గాడ్గే మహారాజ్ కూర్చుని ఉన్నారు. ఇది కల కాదుగదా అనుకున్నాడు.

బాబా “నీ నిద్రమత్తు వదిలిందా?” మృదువుగా ప్రశ్నించాడు గాడ్గే  మహారాజ్.. “ఆబ్బె నిద్రపోలేదు. చిన్న కునుకు తీసాను” అన్నాడు తనను తాను సమర్ధించుకుంటూ వాగ్.

“ఇదే నీ కునుకు ఐతే నిద్ర ఎలా ఉంటుందో? నేను నీవు కునుకు తీస్తున్నప్పటి నుండి నిన్ను చూస్తూ ఇక్కడే కూర్చున్నాను” అన్నారు గాడ్గే. వాగ్ తెల్లబోయాడు.

నిద్రమత్తులో గురుదేవులకిచ్చిన మాటను మరచినందుకు, అబద్దం చెప్పినందులకు సిగ్గుపడ్డాడు వాగ్.

1915 డిసెంబరు నెలలో బలారాం కర్మలు చేయటానికై అతని కుమారుడు గోవింద్ మాన్కర్ షిరిడీపోతూ ఆత్మారాం భార్యను కలిశాడు.

ఆమె సాయికి ఏదైనా పంపదలచింది. ఏదీ సమయానికి దొరకలేదు. అప్పటికే నైవేద్యం పెట్టబడిన పేడాను సాయికి సమర్పించమని ఇచ్చింది గోవింద్ మాన్కర్  కు.

అతను షిరిడీ చేరాడు పేడాతో. సాయిని దర్శించాడు గోవింద్. గోవింద్ పేడాను బాబాకు సమర్పించటం మరిచాడు.

మరల సాయంకాలం సాయిని దర్శించాడు. ఈసారి కూడా పేడాను సాయికి సమర్పించటం మరచాడు.

“నాకోసమని ఎవరైనా, ఏమైనా ఇచ్చారా?” అడిగాడు సాయి. “లేదు” అన్నాడు గోవింద్. అలా కాదని పేడాను గురించి వివరంగా అడిగాడు సాయి.

అప్పటికి గుర్తువచ్చి సిగ్గుపడి  వాడాకు వెళ్ళి పేడాను తెచ్చి బాబాకు సమర్పించాడు. సక్రమంగా చేయగలిగితేనే వాగ్దానం చేయాలి, చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవాలి.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles