Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
గాడ్గే మహారాజ్ అసలు పేరు దేబూజీ ఝంగ్ రాజ్ జానోర్మర్ (Debuji Zhingraji Janorkar). సాయిబాబాను షిరిడీలో దర్శించారు.
దాసగణు తనను మసీదును ఊడ్చే చీపురుగా పోల్చుకున్నాడు. నెవాస్కర్, రాధాకృష్ణమాయి, అబ్బుల్ షిరిడీలో సాయి తిరిగే ప్రాంతాలను చీవురుతో పరిశుభ్రంచేసేవారు. గాడ్గే మహారాజ్ కూడా అంతే.
గాడ్గే మహారాజ్ కర్మ మార్గాన్ని అనుసరించే వాడు. ఈయన పాడే కీర్తనలను వినటానికి ఎక్కడెక్కడి నుండో జనులు వెళ్లేవారు.
రంగు రంగుల గుడ్డ పీలికలతో దుస్తులను కుట్టించుకునే వాడు. మట్టి పాత్రను, తలపై, చేతిలో చీవురుతో గ్రామ గ్రామాలకు వెళ్లి చెత్త చెదారాన్ని తీసివేసి భిక్షను స్వీకరించే వాడు. స్వచ్భ భారతానికి ఏనాడో పునాది వేశాడు.
గాడ్దే మహారాజ్ జీవితంలోని ప్రతి సంఘటన ‘ప్రబోధాత్మకంగా ఉంటుంది.
అహంభావహీనుడు అంటే గాడ్దే బువానే. ఒకసారి ఆయన, తన మరో సహచరునితో కాలి నడకన రాత్రి పూట, చలికాలంలో ప్రయాణం చేస్తున్నారు.
ఎముకలు కొరికే చలి. ఆ రాత్రి ఆ గ్రామంలో కనబడిన పుల్లలన్నీ ఏరి ఒక చోట ప్రోగు చేసి పెట్టాడు ఆయన. ఇతరులను ఇబ్బంది పెట్టి వారింట్లో బస చేయదలచుకులేదు.
ఆయన ఏ గ్రామానికి పోయినా ఘన స్వాగతం పలుకుతారు ఆ (గ్రామస్థులు. ఆ సమయంలో ఆయన వద్ద చితుకులు అంటించేందుకు అగ్గి పెట్టె లేదు.
ఒక ఇంటికి పోయి తలుపు తట్టాడు గాడ్దే బాబా. ఎవరో వచ్చి తలుపు తీశారు “అగ్గి పెట్టె కొంచెం ఇవ్వండి” అన్నారు గాడ్దే సౌమ్యంగా. నిద్రలేపినందుకు ఆమె చాలా చిరాకుగా ఉంది. “లేదు” అన్నది ఆమె కర్మశంగా.
“అమ్మా! నేను, గాడ్డే బాబాను” అంటే ఆమె తక్షణమే ఇచ్చేది. ఆయన తన పేరును వాడుకో దలచుకోలేదు.
దీనంగా “అమ్మా! బయట బాగా చలిగా ఉంది. చితుకులతో మంట వేసుకుందామని అడుగుతున్నాను”అన్నాడు గాడ్డే.
ఈ మాటలను అప్పుడే నిద్ర లేచిన ఆమె భర్త విన్నాడు. ఆ గొంతు గాడ్డే బాబాదిగా గుర్తించి, వెంటనే వచ్చి, ఆయన పాదాలకు గౌరవంగా మ్రొక్కాడు. భర్త చెప్పాడు – “వీరే గాడ్గే మహారాజు” అని.
ఆమె కూడా అలానే చేసి క్షమింపమని వేడుకుంది కూడా. గాడ్గే బువా “ఎవరిపై కోపగించుకో వద్దు. తినేందుకు కొంచెమైనా పెట్టు. అదీ వీలుకాకుంటే సంతోషంగా మాట్లాడి పంపివేయి” అన్నారు ఆమెతో.
ఈ నీతి ఆమెకే కాదు, అందరకూ, అన్ని సమయాలలోను, అన్ని స్థలాలలోను వర్తిస్తాయి.
గాడ్గే మహారాజ్ డిసెంబర్ 20, 1956న దేహాన్ని విడిచారు.
నేడు గాడ్గే మహారాజ్ వర్ధంతి. బాహ్య శుభ్రతతోపాటు, అంతరంగాన్ని దినం, దినం పరిశుద్ధం చేసుకుందాం.
ఇదే గాడ్గే మహారాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- చీపురే ఆస్తి …..సాయి@366 డిసెంబర్ 20…Audio
- వాగ్దానం …..సాయి@366 డిసెంబర్ 28….Audio
- నాకెందుకు? …. మహనీయులు – 2020… మే 20
- జ్ఞానేశ్వరుని పుత్రిక …. మహనీయులు – 2020… డిసెంబరు 19
- శ్రీ సాయి దత్తావతారం మూడవ బాగం – శ్రీ పాద శ్రీ వల్లభుడు, సాయి ఒక్కరే
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments