Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
గాడ్గే బువాను గురుంచి మహాత్మాగాంధీ విన్నాడు. ఆయనను చూడాలనుకున్నాడు.
మహారాష్ట్రలోని ప్రముఖ కాంగ్రెస్ నేత బి.జి.ఖేర్ ( షిరిడి సాయిబాబా గ్రంథకర్తలైన ఎం.వి.కామత్, వి.బి.ఖేర్ లలో వి.బి.ఖేర్ గారి తండ్రి ) గాడ్గే బువాను సేవాగ్రాం పంపాడు.
గాంధీజీ, గాడ్గే బువ్వలు చాలాసేపు సంభాషించుకున్నారు.
“అవును నువ్వు చాలా, చాలా కట్టించావట, ఇంతకీ నీ ఆస్తి ఎంత?” అని చనువుగా గాంధీజీ ప్రశ్నించాడు.
“ఇదిగో, ఈ చీపురు, ఈ కుండ పెంకు” అని గాడ్గే బాబా సమాధానమివ్వగా ఇద్దరు నవ్వుకున్నారు.
స్వచ్ఛత అనేది ఒక అంశం కాదు గాడ్గే బువాకి, పరిశుభ్రతే దైవం అనటమే కాదు ఆచరించి చూపేవాడు అయన.
గాడ్గే బువా ఏ ఊరు వెళితే ఆ ఊళ్ళో మురికిని, చెత్తను ఊడ్చేసే వాడు. బిచ్చమెత్తుకునే మట్టి పాత్రను నెత్తిమీద బోర్లించుకునే వాడు.
మరాఠీలో మూకుడును గాడ్గే అంటారు. అందుకే దేవూజీ గాడ్గే బువా అయ్యాడు.
అయితే సాయినాథుని కొలువు కూడా శుభ్రతకు మారు పేరే. బాలాజీ పాటిల్ నెవాస్కర్, రాధాకృష్ణమాయి మొదలైన వారు ఉన్నారు ఆ పనిలో.
ఇంకా గాంధీజీ “చాలా, చాలా కట్టించావట” అన్నారు. అవే గాడ్గేబువా కట్టించిన ధర్మశాలలు.
ఆయనకు నాసిక్ లో ధర్మశాల కట్టిద్దామనే ఆలోచన వచ్చింది. వెంటనే పని ప్రారంచించాడు.
డబ్బు వడి, వడిగా రావటం ప్రారంభించింది. కొంతకాలం తరువాత పనికి తగ్గ వేగంతో ధన సేకరణ కావటం లేదు.
గాడ్గే బువాకు ఏమీ తోచలేదు. పనిని ఆపలేదు. ధనం ఇవ్వటానికి చేతిలో చిల్లి గవ్వ లేదు. ఆలోచించాడు.
గతంలో గాడ్గే బువాకు సాయిబాబాకు సంబంధించిన కొన్ని సంఘటనలు ఉన్నాయంటారు.
ఏది ఏమైనా గాడ్గే బువా షిరిడీకి వెళ్ళాడు సాయిని చూచాడు. అతనిని చూడగానే సాయి తిట్ల వర్షం కురిపించాడు.
గాడ్గే బువాయే కాదు అక్కడున్నవారు కూడా వింటారు గదా ఆ తిట్లను. గాడ్గే బువా నోరు విప్పలేదు. నవ్వాడు.
సాయి తిట్టటం అపి నవ్వసాగాడు. అంతే! గాడ్గే బువా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అంతే ఆయనకు డబ్బు లోటు రాలేదు. అనేక ప్రదేశాలలో ధర్మశాలలు కట్టించాడు.
సాయి తిట్టింది గాడ్గే బువాను కాదు. ధన ప్రవాహాన్ని ఆపుచేసే అసురీ శక్తులను. ఆ సంగతి గాడ్గే బువాకు తెలుసు.
నేడు గాడ్గే బువా సమాధి రోజు డిసెంబరు 20 , 1956
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శుభ్రత!…. మహనీయులు – 2020… డిసెంబరు 20
- వాగ్దానం …..సాయి@366 డిసెంబర్ 28….Audio
- జీవ నిర్జీవ రూపి సాయి …..సాయి@366 జూన్ 20….Audio
- శ్రీ సాయి దత్తావతారం మూడవ బాగం – శ్రీ పాద శ్రీ వల్లభుడు, సాయి ఒక్కరే
- గాడ్గే మహరాజ్ గారి శిష్యుడు రామచంద్ర మహరాజ్ గారికి బాబా సహాయం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments