సత్య స్తంభం . …. మహనీయులు – 2020… డిసెంబరు 18



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గురు ఘూసీదాస్ 1756 డిసెంబర్ 18న గిరోద్ అనే గ్రామంలో జన్మించారు. ఈయనది వైవాంశ.

ఆ కాలంలో పేద వారికి జరుగుతున్న అన్యాయాలను చూచి ఈయన తట్టుకోలేకపోయేవాడు.

ఒకసారి ఈయన పూరి వెళ్లి జగన్నాథుని దర్శిద్దామని బయలుదేరాడు.  దారిలోనే శరన్ ఘర్ (Saran – Garh)లో ఆయనకు సత్యం అవగతం కావటం మొదలుపెట్టింది.

ఇంక ప్రాపంచిక బంధాలను వదలి “సత్ నాం, సత్ నాం’ అంటూ తన గ్రామం దగ్గరగా ఉన్న ఒక అడవిలోనికి వెళ్లి తునికి చెట్టు అనే పెద్ద వృక్షము క్రింద ధ్యానం చేయనారంభించాడు.

ఆ వృక్షము పవిత్రంగా భావింపబడి, అక్కడ మందిరాలు నెలకొల్పబడ్డాయి.

ఈయనకు తెలియకుండానే అనేక అజ్ఞాత శక్తులు వచ్చాయి. నోటి మాటే చాలు, పిల్లలు లేని వారికి పిల్లలు, ధనములేని వారికి ధనము, కష్టములు తొలగుట జరిగేవి. ఆయన నివసించిన ప్రదేశం ఎందరికో ఊరట కలిగించేది.

ఒకసారి ఈయన కుమారుడు ఒక చేపను తెచ్చాడు. గురు ఘూసీదాస్ చూచి దానిని ఆహార పదార్థంగా వాడవద్దు అని చెప్పారు.

అయితే ఆయన భార్య, ఇంకను ఇద్దరు కుమారులు గురు ఘూసీదాస్ ఆదేశాన్ని పాటించలేదు. ఆ చేపను ఆహార పదార్థంగా ఆ ముగ్గురు భుజించారు. ఆ ముగ్గురకు మరణం సంభవించింది.

సద్గురువు మాటలను లోకం హర్షించి పాటించటం జరుగుతుంది.

ఎంతైనా కుటుంబ సభ్యులు కొంత స్వేచ్ఛను పాటించటం జరుగుతుంది. ఆ ముగ్గురి మరణాన్ని చూచిన గురు ఘూసీదాస్ తట్టుకోలేకపోయారు.

సాయిబాబా  కూడా తన భక్తులైన నూల్కర్, మేఘుడు మరణించినప్పుడు, ఆయన దుఃఖించటం జరిగింది.

ఇక గురు ఘూసీదాస్ ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కారు. అక్కడ నుంచి దుముకి ప్రాణత్యాగం చేయాలని ఆయన ఆలోచన.

ఆయన భూమిపై పడకుండా, ఆ వృక్షమే నేలకు తాకింది. ఇక నేలబారుగా ఉన్న అంత పెద్ద వృక్షం ఉంటే, ప్రాణత్యాగాన్ని విరమించుకున్నాడు.

ఇంతలో ఒక దివ్య శక్తి ప్రత్యక్షమై కుమారుల నిద్దరిని బ్రతికించింది.

తన మాటను విననందుకు వారు ప్రశ్చాత్తాపం చెందగా, గురు ఘూసీదాస్ వారిని క్షమించాడు. ఇక అయన భార్య ‘సత్ నాం’ అంటూ పునర్జన్మ పొందింది.

ఈయన సర్వజనులు సమానమని చాటి, సర్వులకు ఒకే ఒకడైన సత్ నాముని పూజించటం, బోధించటం చేశారు.

మద్యము, మాంసం నిషేదించారు. ఈ సత్ నామీలు ఆవులచేతను, మధ్యాహ్న భోజనం చేసిన జంతువుల చేతను భూమిని దున్నించుట చేయరు.

తెల్లటి రంగువేయబడ్డ స్తంభంపై, తెల్లటి జెండా ఎగురుతుంది. ఇది గురు ఘాసిదాస్ ఏర్పరచాడు.

సత్యాన్ని పాటించే వ్యక్తి తెల్లటి స్తంభంగా ఉండి ఆహ్లాదకరమైన శాంతిని పొందుతాడు. దీనినే జైత్ కంబ అంటారు.

నేడు డిసెంబర్ 18. గురు ఘూసీదాస్ జయంతి.

‘సత్ నాం’ను స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles