Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా వలె ఎక్కడో జన్మించి, చివరకు షిరిడీలో స్థిరపడినట్లు శ్రీహనుమత్ కాళీప్రసాద బాబూజీగా పేరు గాంచిన ఈ మహనీయుడు నంబూరులో స్థిరపడ్డారు.
డిసెంబర్ 3, 1988లో దేహ త్యాగం చేసారు.
అనేక ప్రదేశాలను పర్యటించారు. ఒక వసతి గృహంలో ఆసీనులై ఉండగా, 5, 6 ఏండ్ల బాలుడు ఒక పెద్ద కోటి వచ్చి కూర్చుందని, లోనికి వెళ్లి తండ్రిని తీసుకువచ్చాడు.
ఆ తండ్రికి ఈయన కాళీ మాత లాగ దర్శన మిచ్చారు. వీరు చేసే దేవతార్చన మూర్తులలో కాళీ మాత, హనుమలుండుటం చేత, ఈయనను శ్రీహనుమత్ కాళీప్రసాద్ బాబూజీ అంటారు.
అయినా వీరు ఏ మతానికి, ఈ కులానికి చెందిన వారో నిర్ణయించటం అసాధ్యం. మన మందారం ఆ జగన్మాత బిడ్డలమే అంటారాయన.
ఈయన సమాధి మందిరం (బృందావనం) గోపురంపైన ప్రపంచంలో 8 ప్రసిద్ధ మతాల చిహ్నాలున్నాయి.
అన్ని మతాల పర్వ దినాలలో ఒకే పూజ – గురు పూజ, ఒకే నివేదన, ఒకే పంక్తి భోజనం – ఇవి ఆయన జీవితం తెలిపే ప్రత్యేకతలు.
భీమవరంలో ఒక భక్తుని ఇంటికి వస్తానని మాట ఇచ్చారు స్వామీజీ. ఆ సమయంలో ఒక బెంగాలీ యువతి వచ్చి “బాబు గారు వచ్చారా?” అని ఆ ఇంటి వారిని అడిగింది.
కొంత కాలం తరువాత ఆ ఇంటి వారికి తెలిసింది. ఆ మహిళ ఎవరో కాదు బాబూజీయేనని.
సాయిబాబా కూడా బెంగాలీ సాధువు వలె ఒక విందుకు వెళ్ళటం సాయి సచ్చరిత్రలో ఉంది.
ఒక భక్తుని కోడలు ఎన్నటికి సంతానవతి కాలేదని డాక్టర్లు బల్ల గుద్ది చెప్పారు. కానీ, బాబూజీ దీక్షను ఆమెకు ఇవ్వగా సంతానవతి అయింది.
మరో భక్తుని భార్య కడుపులో ఉంది బిడ్డ కాదని, అది గడ్డ అని డాక్టర్లు చెప్పారు.
అది బిడ్డడే అని, పుట్టబోయే బిడ్డకు అంజిబాయి అని పేరు పెట్టమన్నారు. అలాగే బిడ్డడు పుట్టాడు. డాక్టర్ అంజి బాబు అయ్యాడు.
ఒకసారి ఆయన మాట్లాడుతున్నప్పుడు, కాలమే తెలిసేది కాదు. వినే వారికి.
కానీ ఆకలికి కాల నియమం అంటూ లేదు. ఆకలి అయినప్పుడు కడుపులో గంట కొడుతుంది గుర్తుగా.
ఒకసారి బాబూజీ, ఐదు, ఆరు గంటలు మాట్లాడారు. వినువారలకు ఆకలైంది. ఏమని, ఎవరు చెప్పగలరు? బాబూజీ వెంటనే మంచి నీరు తెప్పించారు.
ఒక గుటికెడు నీటిని మాత్రము ఆయన త్రాగారు. ఇక శ్రోతలకు ఆకలి కలుగ లేదు. ఇటువంటి సంఘటన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో రామకృష్ణ పరమహంస చేసి చూపారు.
“నేను భగవంతుడిని కాను. అవతార పురుషుడిని కాను, భక్తుల, జ్ఞానుల భృత్యుడిని. అమ్మ చేతిలోని కీలు బొమ్మను, ఏజెంటును, పోస్టుమాన్ ను” అంటారాయన వినయంగా.
ఆయన డిసెంబర్ 3, 1988లో మహాసమాధి చెందారు. నేడు ఆయన వర్థంతి.
ఆయనను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- గురు శిష్యులు వేరు కాదు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 6
- ఓం నమో భగవతే గోపీనాథాయ …. మహనీయులు – 2020… జూలై 3
- సద్గురుదర్శనం – అభయహస్తం. సామవేదం శ్రిరంగానాయకమ్మ, కోట, నెల్లూరు జిల్లా.
- మధ్యముడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 22
- సాయిబాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments