Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
శంకర్ కోహిజోకర్ తండ్రి పేరు బల్వంత్ కోహిజోకర్. బల్వంత్ మామలతదారునిగా పనిచేసి రిటైరు అయ్యాడు.
బల్వంత్ ఒకసారి అంటే 1911 డిసెంబరులో షిరిడీకి వెళ్ళాడు. ఆ తరువాత ఆయన షిరిడీకి వెళ్ళలేదు. ఆయన షిరిడీలో వారం రోజులున్నారు. ఎన్నో అనుభవాలు కలిగాయి ఆయనకు.
అది సాయంకాలం, సమయం సుమారు ఐదు గంటలు. ఆ సమయంలో సాయి ద్వారకామాయిలో అసీసుడై ఉన్నాడు.
భక్తులందరూ ఆయన దగ్గర కూర్చున్నారు. ఆ సమయంలో బల్వంత్ కూడా అక్కడే ఉన్నాడు.
సాయిబాబా ఉన్నట్టుండి, “ఈ ప్రసవవేదనను నేను భరించలేకున్నాను” అంటూ కేకలు వేయసాగాడు. అందరకు ఆశ్చర్యం వేసింది.
ఎదో దూర ప్రాంతంలో ఏ గర్బిణియో, ప్రసవవేదన పడుతున్నట్లున్నది. ఆమె ప్రసవవేదనను సాయి తీసుకుంటున్నాడు. కాబోలు అనుకున్నారు. సాయి తత్వము ఎరిగిన వారు.
సాయిబాబా భక్తులకు వెంటనే ద్వారకామాయి నుండి వెళ్లిపొమ్మన్నారు.
భక్తులందరూ మారుమాట్లాడక ద్వారకామాయి నుండి వెళ్ళిపోయారు. కొంత సమయం గడిచింది.
అందరికంటే ముందుగా ద్వారకామాయిలోనికి అడుగుపెట్టిన అదృష్టవంతుడు బల్వంత్.
లోనికి పోయి చూడగా గద్దెపై సాయినాధుడు కనిపించలేదు. సాయి స్థానంలో ముద్దులొలికే పసిబాలుడు దర్శనమిచ్చాడు బల్వంత్ కు.
ఆ పసిబాలునకు మూడు శిరములున్నాయి. ఆ శిశువే దత్తాత్రేయునిగా బల్వంత్ గ్రహించాడు. ఆ దృశ్యం ఎక్కువసేపు లేదు. మరల కఫ్నీధారియైన సాయిబాబా సాక్షాత్కరించాడు.
సాయియే దత్తుడని బల్వంత్ గ్రహించాడు. ఆ ఒక్క నిదర్శనము చాలును జన్మను పునీతం చేయటానికి.
సాయినాధుడు ఉదయము, మధ్యాహ్న సమయములలో గాక, సాయం సమయమున ఏల కనిపించాడు? అనే ప్రశ్న రావచ్చును. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది. సంధ్యాసమయములోనే.
బల్వంత్ తిరిగి వెళ్ళబోయే సమయంలో “నువ్వు ఎక్కడికైనా వేళ్ళు నేను నీ వెంటనే ఉంటాను” అన్నాడు ఆ దత్త సాయి.
ఆ క్షణం నుండి బల్వంత్ తుది శ్వాస విడిచే వరకు ఏ కష్టం వచ్చినా దత్త సాయిని తలంచినంత మాత్రాన ఆ కష్టం తీరిపోయేది.
సాయి వేరు దత్తుడు వేరు కాదు. ఇద్దరూ ఒక్కటే!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి! కన్నులలో నీరెందులకు?…..సాయి@366 నవంబర్ 1….Audio
- సువాసనలంటే మక్కువా! …..సాయి@366 మే 4….Audio
- జై సచ్చిదానంద! …..సాయి@366 ఆగస్టు 11….Audio
- షిరిడీ మసీదులో శ్రీరామనవమి…..సాయి@366 మార్చి 27…..Audio
- వివేక వైరాగ్యాలు ….సాయి@366 డిసెంబర్ 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments