సుప్రభాతానికి మూలం … …. మహనీయులు – 2020… డిసెంబరు 4



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా “ఈ భగవానుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచినప్పుడు, నా వంటి ఫకీరనగా దానికి ఎంతమాత్రము?” అంటారు.

ఆళ్వార్లలో ఒకడు తొండరడిప్పొడి ఆళ్వారు. ఈయననే “భక్తంఘ్రి రేణు’ అని ‘మందంగుడి ముని’ అనియే కాక ‘విప్రనాయణుడు’ అని పిలుస్తారు.

ఈయనను విష్ణువు యొక్క వన మూలాంశ అంటారు.

బాల్యం నుండి విష్ణు భక్తి కలిగి, వివాహ ప్రసక్తిని తొలగించి, శ్రీరంగం చేరి, అచట రమ్యమైన పుష్పోద్యానము నిర్మించి, శ్రీరంగనాథునికి ప్రతి దినం పుష్పమాలా కైంకర్యం చేసేవాడు.

పెరియాళ్వారు కూడా దైవానికి పూలమాలలు సమర్పించి సంతసించే వాడు.

తోడరడిప్పొడి ఆళ్వారు మాయా నాటకమున చిక్కినాడు. దేవ దేవి అను వేశ్య మాయా జలమున చిక్కినాడు.

ఆ వేశ్యను తృప్తి పరచుటకై శ్రీరంగనాథుడే ఒక బంగారు పాత్రను మారు రూపమున ఇచ్చినాడు.

ఒకనాడు ఆ బంగారు పాత్రాపహరణ జరిగింది. తొండరడిప్పొడి ఆళ్వారు పని అని, ఆ దేశపు రాజు ఆళ్వారును కారాగారంలో బంధించాడు.

కారాగారంలో తొందరడిప్పొడియాళ్వారు ఇదంతా భగవానుని మాయ అని గ్రహిస్తాడు.

ఆళ్వారు నిరపరాధి అని, ఇదంతా తన లీల అని భగవానుడు రాజునకు చెబుతాడు. ఆళ్వారు కారాగారము నుండి విముక్తుడవుతాడు.

ఇక రంగనాథునకు పుష్ప మాలలు కాదు, పాశుర మాలలను కూడా సమర్పించసాగాడు.

హనుమంతుడు ఒక్క శ్రీరామునే అర్చించినట్లు, తొండరడిప్పొడి యాళ్వారు శ్రీరంగనాథు నామమునే తన అర్చనకు ఉపయోగించారు.

వేరొక నామమును తలువలేదు, పలుక లేదు, వేరొక దైవమును దర్శించ లేదు.

తిరుమాలైలో 45 పాశురాములు, తిరుప్పళ్ళి యొళ్ళుచ్చిలో 10 పాశురాములు గల దివ్య ప్రబంధములు.

తిరుప్పళ్ళి యెళ్ళుచ్చిని ఆధారం చేసుకునే ప్రతివాది భయంకర అణ్ణన్ అనే ఆచార్య పురుషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం రచించాడు.

తోడరడిప్పొడి యాళ్వారు మార్గశిర చతుర్దశినాడు జన్మించారు. మార్గశిర మాసం సామాన్యంగా డిసెంబర్ నెలలో వస్తుంది.

శ్రీరంగంలో శేష శయనుడైన విష్ణువు రూపాన్ని చూచి ఈయన పులకరించిపోయేవాడు. శ్రీరంగంలో స్థిరపడ్డాడు – శ్రీరంగంలో రంగనాథుడు ఆ భంగిమలోనే ఉంటాడు.

ఇంకా ఈయన తన పేరును ‘భక్త పాద రేణు’ వుగా మార్చుకున్నాడు.

ఇలా తన నామాన్ని స్వయంగా మార్చుకున్న ఆళ్వారు ఈయనే అంటారు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles