క్రీస్తు శకము – సాయి యుగము…. .. …. మహనీయులు – 2020… డిసెంబరు 25



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“ఆయా దేశాలను, కాలాలను, ప్రజలను అనునరింబి అన్ని చోట్లకు ప్రవక్తలను మేమే వంపాము” అంటుంది ఖరాన్‌, “సంభవామి యుగేయుగే” . అంటుంది గీత.

నేడు తెలుగు కాలమాన ప్రకారం గీతా జయంతి దినం. ఆంగ్ల కాలమాన ప్రకారం జీసస్‌ క్రీస్తు‌ జయంతి దినం.

సామాన్యంగా సత్పురుషుల జోధల కంటే, వారు చూపించిన చమత్మారాలే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో జీసస్‌ సాయిబాబా కానీ భిన్నం కారు.

వీరిద్దరు ప్రథమ చమత్మారాలను చూపారు, ఒకరు నీటిని దాక్ష రసంగా చేస్తే, వేరొకరు నూనెగా మార్చారు.

ఒకసారి ఏసు ప్రభువు 5 రొట్టెలు, 2 చేపలతో కొన్ని వేలమందికి విందు చేశారు. సాయిబాబా కూడా ఇద్దరు, ముగ్గురకు వండిన వంటకాలతో రఘవీర భాస్మర పురందరేచేత 20 మందికి పైగా సుష్టుగా భోజనం పెట్టించారు.

ఒకసారి ఏసు ప్రభువు గద్దిస్తే, గాలివాన ఆగిపోయింది. సాయిబాబా కూడా ప్రథాన్ తన కుటుంబంతో ఊరుకు వెళ్లవలసినప్పుడు వచ్చిన భారీ వర్షాన్ని ఒక్క కేకతో అపారు.

క్రీస్తు “ఎందరో నన్నార్దానికి ఆకర్షింప బడతారు. కానీ వారిలో భగవంతునిచే అమోదింవబడే వారు కొద్దిమంది మాత్రమె” అంటారు.

సాయిబాబా “మామిడి చెట్టుకు ఉన్న పూతంతా పండ్లవుతాయా? పూత గాను, పిందెలు గాను ఉన్నప్పుడే ఎక్కవ భాగం రాలిపోతాయి. చివరిదాక నిలిచి ఉండి పండ్లయ్యేవి ఏ కొద్దో ఉంటాయి” అన్నారు.

క్రీస్తు “నీ జీవిత విషయమున, నీ దేహా విషయమున నీవేమి త్రాగవలెనో, ఏమి తినవలెనో ఏమి ధరింవ వలెనో అనే విషయాలను గూర్చి విచారింవకుము” అంటారు.

సాయి “విధి విధానము నందు గాఢ విశ్వానము ఉండవలెను. తిండి, గుడ్డలకై వారు ఆరాటవడకూడదు. వాటి నిమత్తము జీవితమును వ్యర్థము చేసికొన కూడదు” అంటారు.

ఆ ఇద్దరి మాటలు, చేతలు ఒకటిగా నుండుటయే కాదు. ఒకరు చెప్పునది వేరొకరి వాక్కునకు వ్యాఖ్యానమా, లేదా వివరణా? అన్నట్లుంటాయి.

క్రీస్తు, సాయి రోగులను స్వస్తత పరచేవారు. ఒకరిని మించిన కరుణామూర్తులు ఇంకొకరు.

వేర్వేరు కాలాలలో వారు జీవించి, నేడు కనుమరుగైపోయినా వారు చిరంజీవులు.

క్రీస్తు శకమని, సాయి యుగమని పలికి ఆ ఇద్దరిని కీర్తించుట కాదు. వారి బోధలను, ఏ మాత్రమైనా ఆచరణలో పెడితో చాలు!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles