Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబాను పరీక్షించటానికి కాకా మహాజన్ తో పాటు అయన యజమాని కూడా షిరిడీ వచ్చాడు. సాయి భక్తుడై, కాకా మహాజన్ తో తిరిగి వెళ్ళాడు.
డా|| ఫ్రిట్జ్ గెర్లిడ్ అనే వ్యక్తి థెరాసా న్యూమన్ అనుభవించే ‘క్రీస్తు వ్యధ’ బండారాన్ని బయటపెట్టడానికి కానర్ స్రాత్ వెళ్ళాడు. కానీ చివరకు గౌరవ ప్రపత్తులతో ఆ మహనీయురాలి జీవితాన్ని రచించాడు.
భారత దేశానికి చెందిన పరమహంస యోగానంద కూడా ఆమెను దర్శించాడు. ఆమె మార్మికురాలు, భక్తురాలు ఇంకా పరోపకారి.
శుక్రవారంనాడు ఆమెను దర్శించినప్పుడు, ఆమె క్రీస్తు వ్యధను అనుభవిస్తోంది.
ఆమె కనురెప్పల నుంచి నెత్తురు అంగుళం వెడల్పు ధారగా, పలచగా, ఎడతెరిపిలేకుండా స్రవించింది.
ఆమె దృష్టంతా నుదిటి మధ్యనున్న జ్ఞాన నేత్రంవైపు కేంద్రీకరించి ఉండి, ఆమె తలకు చుట్టి ఉన్న గుడ్డ క్రీస్తు మళ్ళీ ముళ్ళ కిరీటం తాలూకు గాయాలనుండి వచ్చిన నెత్తుటితో తడిసి ముద్దయింది.
ఆమె గుండె మీద ఉన్నా తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరక అయ్యింది. అది చివరగా ఒక సైనికుడు బల్లెపు పోటుతో క్రీస్తును గాయపరచినచోటు.
బౌతికంగా ఆమెను అలా దర్శించినప్పటి తీరు అది. ఆమె కేవలం క్రీస్తు వ్యధనే భరించటంలేదు. ఏదో విదేశీ భాషలో గొణుగుతొంది ఆమె.
ఆమె క్రీస్తు జీవితంలోని తుది పది రోజులను దర్శించగలిగేది. క్రియా యోగి పరమహంస ఆమె ఆ దృశ్యాలను దర్శించటం కూడా చూడగలిగాడు.
ఆయన ఆమెను దర్శించే సమయంలో శిలువ కొయ్యలను మోస్తున్న ఏసును చూస్తోంది.
ఆ కౄర భారం క్రింద ఏసు పడిపోయాడు. గుండె తరుక్కుపోయే జాలితో ఆమె విలపించసాగింది.
ప్రతి శుక్రవారం ఆమె క్రీస్తు వ్యధను చూడటానికి ఎంతోమంది వస్తుండేవారు. ఆ దృశ్యాన్ని చూచి తట్టుకోలేక క్రిందపడ్డ వారున్నారు.
ఆమె ప్రతి దినం దైవార్పితమైన ఒక పలుచని పిండి రొట్టెను తీసుకునేది. అది దైవార్పితం కాకుంటే, ఆమె తినేది కాదు.
నీరు త్రాగటం ఆమె పూర్తిగా మానివేసింది. ఆమె తిండి లేకుండా ఎలా జీవిస్తోంది అంటే కేవలం రొట్టెవల్ల కాకుండా, దేవుడి అదృశ్య కాంతి వలన అని చెప్పింది.
బైబిలు కొత్త నిబంధనలో గ్రంథస్థమైన ప్రకారం ఏసు జీవితంలో శిలువ వేయటము అనే చారిత్రక యదార్థతను, ధృవపరచేందుకే ఆమె జన్మించినట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే ఆమె జన్మించిన దినం గుడ్ ఫ్రైడే (గుడ్ ఫ్రైడే ఏసుని శిలువ వేసిన దినం) 1898.
నేడు ఏప్రియల్ 8.
ఆమెను, ప్రభువును స్మరిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఎవరిపై విశ్వాసం? …. మహనీయులు – 2020… ఏప్రిల్ 7
- క్రీస్తు శకము – సాయి యుగము…. .. …. మహనీయులు – 2020… డిసెంబరు 25
- తీయని బాధ .. …. మహనీయులు – 2020… అక్టోబరు 4
- ఆకలుండదు, దహముండదు. …. మహనీయులు – 2020… ఏప్రిల్ 29
- క్రీస్తు శకం – సాయి యుగం …..సాయి@366 డిసెంబర్ 25….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments