Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సియెనాలో 25వ బిడ్డగా సెయింట్ కాథరిన్ జన్మించింది. ఆమెకు చిన్నతనం నుండి దైవసేవకు అంకితం కావాలనుకునేది.
యుక్త వయసు రాగానే ఆమెకు వివాహ ప్రయత్నాలు చేయసాగారు తల్లిదండ్రులు.
ఆమె వివాహం చేసుకోనని నిక్కచ్చిగా చెప్పింది. ఒకసారి వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు తన జుట్టును కత్తిరించుకుని అందవిహీనంగా తయారైంది. ఇక తల్లిదండ్రులు ఆమె వివాహ ప్రయత్నాలను ఆపివేశారు.
జీసస్ తో తనకు మార్మిక వివాహం జరిగిందని ఆమె చెప్పసాగింది. దైవంతో వివాహబంధం కొందరి మహిళల జీవితాలలో చూడవచ్చును.
మీరాబాయి కృష్ణుడిని తన భర్తగా తెలిపేది. ఆండాళ్ విష్ణుమూర్తితో వివాహం జరిగేందుకు కోవెలకు కూడా వెళ్ళింది. నిన్న మొన్నటి గౌరీమా ప్రతిమ రూపంలోని విష్ణువునే భర్తగా భావించేది.
కాథరిన్ తన వివాహ సందర్భంలో క్రీస్తు తన వ్రేలికి ఉంగరాన్ని తొడిగాడని చెప్పేది. ఐతే ఆ ఉంగరం ఇతరుల కంటికి కనబడదు.
ఈమె తరచు దైవం నుండి స్పందనలు పొందుతుండేది. జీసస్ క్రైస్తును గాయపరిచిన పంచ గాయాలు ఆవిడా శరీరంపై కనబడేవి.
ఆమె కేవలం దైవానికి అర్పితమైన ఒక రొట్టెను మాత్రమే తినేది. ఆ దైవ ప్రసాదం కాక ఇతర పదార్థములను ఆమె తీసుకునేది కాదు.
బలవంతంగా తినవలసినప్పుడు అవి ఆమె శరీరంలో ఉండేవి కాదు, ఆ ఆహారం తన శరీరంలో ఉన్నంతకాలం నరకయాతనను అనుభవించేదామె.
ఆమెను ఆహారం ఎందుకు తీసుకోవు అని ప్రశ్నిస్తే దైవ ప్రసాదం తింటున్నాను కదా అనేది. ఆ ప్రసాదమే ఆమెకు శక్తిని ప్రసాదించేది.
ఆమె దైవ ప్రసాదం తినగానే మరింత ఉత్సాహంతో పనులను త్వరత్వరగా చేసేది.
ఆమెను ఎవరైనా మీకు ఆకలి ఎందుకువేయదు? అని ప్రశ్నిస్తే, దైవ దర్శనంతో కడుపు నిండిపోతుంది. ఇక భౌతిక పదార్దాలను తినవలసిన అవసరమే ఏర్పడదు అని ఆమె బదులిచ్చేది.
ఆమె తన కొరకు ఎవరినీ, ఏమి అడిగేది కాదు. అవసరమే ఏర్పడదు అని ఆమె బదులిచ్చేది.
ఆమె తన కొరకు ఎవరినీ, ఏమీ అడిగేది కాదు. ఎవ్వరికైనా ఆహార పదార్దములు గాని వస్తువులు గాని అవసరమైతే ముందు, వెనక చూడకుండా ఇచ్చివేసేది.
ఆమె ఈ చర్య ఆమె కుటుంబాన్ని (తల్లిదండ్రులను, సోదరీ సోదరులను) ఇబ్బంది పెట్టేది.
“దైవంతో సంభాషణలు” అనే గ్రంథాన్ని ఆమె దైవ సన్నిహితులతో చెప్పినది.
ఇంకా ఆమె ఉత్తరాలు, ప్రార్థనలు ఆమెను భక్తురాలిగానే కాకుండ క్రైస్తవ మత రచయిత్రిగా పేరు తెచ్చిపెట్టాయి.
ఈమె 29 ఏప్రియల్ 1347లో భౌతిక కాయాన్ని వీడినా నేటికి భక్తుల, ఆర్తుల పాలిట కల్పవృక్షం.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గురువుల కన్న అమ్మ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 9
- కాని భర్త అడుగుజాడల్లో…. మహనీయులు – 2020… అక్టోబరు 18
- బాబా ఆశీర్వాదంతో నా వివాహం జరిగింది.-3
- తెలుగు వారి శారదా మాత! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 12
- సువర్ణాక్షరాలు …. మహనీయులు – 2020… ఆగస్టు 11
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments