గురువుల కన్న అమ్మ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 9



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా వివాహం చేసుకోలేదు. కానీ అయన విశ్వ కుటుంబీకుడు.

సిక్కుల మత సంప్రదాయంలో బీబీ భానీకి ప్రత్యేక స్థానముంది.

మూడవ శిక్కు గురువైన అమర్ దాస్ కుమార్తె.

నాలుగవ శిక్కు గురువైన రాందాస్ భార్య (ధర్మపత్ని).

ఐదవ శిక్కు గురువైన అర్జున్ దేవ్ తల్లి (వీరమాత),

ఆరవ శిక్కు గురువైన హర్ గోవింద్ నాయనమ్మ….

అంతే కాదు ఆదర్శ శిక్కు మహిళ, గురు భక్తురాలు.

ఒకనాడు బీబీ భాని తండ్రి అమర్ దాస్ ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో అయన చెక్కబల్లపై ఆసనంలో కన్నులు మూసుకున్నారు.

అక్కడే బీబీ భాని ఉండి. ఆ చెక్కబల్ల ఒక కోడు విరిగిపోయి స్థితిలో ఉంది. ఆ క్షణంలో గాని మరు క్షణంలో గాని విరగవచ్చు. అప్పుడు అమర్ దాస్ క్రింద పడటం జరుగుతుంది.

దానివలన పెద్ద గాయం అవుతుంది. చుట్టుపక్కల ఎవరూలేరు. తండ్రి అమర్ దాస్ కన్నులు తెరిచే స్థితిలో లేదు.

ధ్యానానికి భంగం కలగకూడదని, తన తండ్రికి ఏ ఆపదా రాకూడదని, ఆమె తన మోచేతిని పడబోయే కోడు స్థానంలో ఉంచింది. ఆమె చేతి నుండి రక్తం కరుతొంది.

చెయ్యి నెప్పిపుడుతొంది. ఐనా ఆమె చలించలేదు. ఒక గురువుకు సేవ చేసే భాగ్యం కల్గిందనుకున్నది. ఒక కూతురిగా తన తండ్రిని కాపాడుకుంది.

ధ్యానం అవగానే అమర్ దాస్ లేచాడు. అక్కడ కూతురు చేసిన పనిని చూశాడు. గురు హృదయం, పితృ హృదయం చలించిపోయింది. గురు అమర్ దాస్ దీవించాడు ఆమెను.

గురు కుమార్తె, అంటే బీబీ భానీకి యుక్త వయస్సు వచ్చింది. గురు కుమార్తె కాబట్టి ఎందరో శ్రీమంతులు ఆమెను కోడలిగా తెచ్చుకోవటానికి సుముఖంగా ఉన్నారు.

తండ్రి ఎంపిక చేసిన బీదవాడిని వివాహం చేసుకుంది. తండ్రి మాటను జవదాటని కుమార్తె ఆమె.

గురు అమర్ దాస్ చేసే అన్నదానాన్ని చూచి సంతోషించాడు అక్బరు. కొంత భూమిని ఇస్తానన్నాడు. కానీ అమర్ దాస్ అంగీకరించలేదు.

అక్బరు ఆ భూమిని అమర్ దాస్ కుమార్తె బీబీ భాని వివాహ సందర్భంగా, తన కూతురిగా భావించి ఇస్తున్నానని ఇచ్చాడు. కాదనలేకపోయాడు అమర్.

ఆమెకు పెళ్ళి కానుకగా వచ్చిన స్థలంలో ఆమె భర్త గురు రాందాస్ ప్రజల అవసరార్థం ఒక జనవాసాన్ని నిర్మించాడు. ఆ స్థలమే పవిత్ర అమృత్ సర్ నగరమైంది.

పెళ్ళి కానుకను ప్రజల కోసం వినియోగించిన ఆమె త్యాగశీలి. తన భర్త గురురాందాస్ కాబోయే శిక్కుల గురువుగా మూడవ కుమారుని ఎంపిక చేయమన్నాడు.

ఆమె మొదటి కుమారునికి గురుత్వం ఇవ్వమని కోరలేదు. భర్త నిర్ణయానికి కట్టుబడిన ధర్మపత్ని. అర్జున్ దేవ్ ను తీర్చిదిద్దిన మాతృమూర్తి.

ఈమె ఏప్రియల్  9న (1598)న దేహాన్ని విసర్జించింది.

ఆమెను స్మరిద్దాం, ఆమెవంటి త్యాగ బుద్ధి అందరకూ కలగాలని ఆశిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles