ఇదంతా బాబా దయ నాదేమీ లేదు. ఆ సమయం లో బాబా అలా ప్రేరణ కలిగించాడు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా వారు P.H.D. డాక్టర్. ఆయన పని చేసే దగ్గర పని చేస్తున్న మరో డాక్టర్ గారబ్బాయి 12th స్టాండర్డ్ చదువుతున్నాడు.

ఆ కుటుంబం మాకు చాలా ఆప్తులు. మేమంతా కలిసి, మెలిసి ఉంటాము. అబ్బాయి వయసు పదహారేళ్లు ఉండవచ్చు.

ఆ అబ్బాయి బాగా చదువుతూ, చురుగ్గా ఉంటాడు. ఆ దంపతులకి ఆ పిల్లవాడొక్కడే సంతానం.

అబ్బాయి పరీక్షలకి చాలా కష్టపడి చదివాడు. అనుకున్న పరీక్షలు రానే వచ్చాయి. రెండు పరీక్షలు అయ్యాయి, బాగానే రాసాడు.

మూడవ పరీక్షకి బయలుదేరుతుండగా ఉన్నట్లుండి, ఆ అబ్బాయికి ఫిట్స్ లాగా వచ్చి నట్టింట్లో పడిపోయాడు. ఆ పడిపోవటం, ఆ లక్షణాలు బట్టి, తండ్రి కేదో అనుమానం వచ్చింది.

వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి రకరకాల పరీక్షలు చేయించారు. రిపోర్ట్స్ వచ్చాయి. ఆ తండ్రి అనుమానం నిజమైంది.

పరీక్షలకు ఎక్కవగా చదివాడు. నిద్రలేమి, ఆదుర్దా వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకున్నారంతా. కానీ వాళ్ళ నాన్న గారు చేయించిన పరీక్షలు వల్ల అతనికి నమ్మలేని, ఎవరు ఊహించని జబ్బు బయట పడింది.

అంత చిన్న వయసులో అటువంటి వ్యాధి వస్తుందని ఎవరూ ఊహించలేదు. బ్లడ్ కాన్సర్ అని తేలింది.

ఈ వార్త విన్న మాకే మతులు పోయాయి, దాదాపు పిచ్చివాళ్ళము అయిపోయాము. మెదడు మొద్దు బారిపోయింది.

విన్న మాకే అలా ఉంటే కన్నవాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుంది. ఆ తండ్రి పాపం చాలా బాధ పడ్డాడు. ఆయనకి ఏం చెయ్యాలో ఏమీ తోచని అయోమయంలో పడ్డాడు. నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది.

పిల్లవాడ్ని అమెరికాకైనా తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని ఆలోచిస్తున్నాడు. ఆ వ్యాధి రావటం వరకేనాయే.  బ్రతికి బట్టకట్టిన వాళ్ళు ఎవరున్నారు?

దానికి ఎదో మందుల ద్వారా మృత్యువును కొంతకాలం కబళించకుండా ఆపవచ్చు కానీ శాశ్వతంగా తొలగించడం సాధ్యం కాదు. పిల్లవాడి తల్లి బాధ వర్ణనాతీతం.

వాళ్ళకి ఎవరు మాత్రం  ధైర్యం చెప్పగలరు? ఆ భయంకర రోగానికి పిల్లవాడు బలైపోతున్నా, ఏమీ చేయలేని స్థితి, తమ కళ్ల ముందే ఎదిగి వస్తున్న కొడుకు ఇలా అయిపోతుంటే ఏ తల్లి తండ్రులు మాత్రం తట్టుకోగలరు.

ఆ పిల్ల వాడి తల్లి కన్నీరు, మున్నీరు గా ఏడుస్తూనే ఉంది. తలబాదుకుంటూ, పిచ్చిచూపులు చూస్తూ నన్ను చూడంగానే

”రమా! ఎదో ఒకటి చెయ్యి, వాడు మాకు దక్కకుండా పోతాడేమో అని భయం గా ఉంది. ఏం చేస్తే మా వాడు మృత్యువాత పడకుండా ఉంటాడో అది చెయ్యి ” అంటూ ఉన్మాది లాగా అరుస్తూ నన్ను పట్టుకొని కుదిపేస్తూ  ఏడుస్తోంది.

నాకు ఒక్కటే తోచింది. ”నువ్వు నమ్ముతానంటే బాబా తాయత్తు ఒకటి తీసుకొచ్చి బాబుకి కడతాను ఏమంటావు ?” అన్నాను.

అన్నదే తడవుగా పిల్లవాడికోసం ఆవిడ ఏదైనా చెయ్యటానికి సిద్ధం గా ఉందా ఇల్లాలు . ” వెళ్ళు వెళ్ళు , తొందరగా వెళ్లి ఆ తాయత్తు తీసుకొచ్చి మా వాడికి కట్టేయి ” అంది.

అప్పుడే ఆ బాబుని ఆఖరిగా మరో పరీక్ష ఉందని లోపలికి తీసుకువెడుతున్నారు. నేను తాయత్తు తేవటానికి హాస్పిటల్ బయటికి వచ్చాను.

ఆటో ఎక్కి తిన్నగా షాపుకి వెళ్లి తాయత్తు కొని, అక్కడనుండి తిన్నగా ఇంటికి వచ్చి, బాబా ముందు ఆ తాయత్తు పెట్టి, అందులో గంధం, అక్షింతలు, పూరెక్కలు, ఊదీ అంతా తయారు చేసి, బాబాకి నమస్కారం చేసి,

”బాబా ! ఒక సాధారణ వీధి కుక్కకి నయం చేసావు. ఈ పిల్లవాడి మీద నీ చల్లని దయ కురిపించు వీడి మీద వీడి తల్లి తండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీడికి ఎంతో భవిష్యత్తు ఉంది. నువ్వు తలచుకుంటే కానీ పని అవదు. మరి నీ ఇష్టం బాబా ! ఆ పిల్లవాడికి కట్టడానికి తాయత్తును తయారు చేశాను. ఏం చేస్తావో మరి నీ ఇష్టం. వెళుతున్నాను” అని బాబాకి చెప్పి హాస్పిటల్ కి బయలుదేరాను.

నేను హాస్పిటల్ కి వెళ్ళేటప్పటికి, ఆ పరీక్ష పూర్తయి ఆ అబ్బాయిని తెచ్చి పడుకోబెట్టారు. నేను లోపలి కి వెళ్ళాను. నన్ను చూడంగానే గుర్తింపుగా ఒక అర నవ్వు నవ్వాడు వాడు.

” ఏం కాదు నాన్నా! తగ్గిపోతుంది అని ” వాడికి చెప్పి, నేను వెంట తెచ్చిన తాయత్తు వాడి జబ్బకి కట్టాను.

ఆ పిల్లవాడి తల్లి తానొక పేరున్న హాస్పిటల్ లో, ఇంకా పేరున్న డాక్టర్ నడుమ ఉన్నానన్న సంగతిని పూర్తిగా మర్చిపోయింది.

మొట్టమొదటిసారిగా బాబాకి, తాయత్తు తెచ్చిన నాకూ దండాలు పెడుతూనే ఉంది. కాసేపుండి నేను ఇంటికి వచ్చేసాను.

సాయంత్రం ఏడు గంటలకి ఆ పిల్లవాడి తల్లి నాకు ఫోన్ చేసింది. ” రమా ! మా వాడికి ఏ కాన్సర్ లేదట ” అంటూ ఇంచుమించు అరిచేసింది.

నేను ఆశ్చర్యంగా ఏం జరిగింది? అని అడిగాను. సాయంత్రం ఆరున్నరకు మా వారు మధ్యాహ్నం చేయించిన టెస్ట్ తాలూకా రిపోర్ట్ తీసుకువచ్చారు. ఆరు నలభయ్ కి డాక్టర్ గారు వచ్చారు.

పిల్లవాడి తాలూకా రిపోర్ట్ చూసి, ఆశ్చర్యంగా, ఇది ఈ పిల్లవాడిదేనా? అంటూ వివరాలన్నీ పరీక్ష చేసి, మీరు చాలా అదృష్టవంతులు నిన్నటి దాకా వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా కాన్సర్ అని నిర్ధారణ చేస్తున్నాయి. ఈ రోజు అసలైన రిపోర్ట్ లో ఏమీ లేదు అని వచ్చింది. you are very lucky అన్నారు.

మా వాడికి ఏ జబ్బు లేదు. వాడు నిండు నూరేళ్లు బ్రతుకుతాడు కదా రమా ! ఇదంతా నీ దయే. రమా నీ వల్లే మా వాడు బ్రతికి బట్ట కట్టాడు.

నువ్వు కట్టిన తాయత్తు వల్లనే ఇదంతా జరిగింది అంటూ స్తోత్రం చేసింది.

అయ్యయ్యో! నేనేమి చేశాను, భలే దానివే, ఇదంతా బాబా దయ నాదేమీ లేదు. ఆ సమయం లో బాబా అలా ప్రేరణ కలిగించాడు, అంతే తప్ప నాదేమీ లేదు అన్నాను.

సరే ! నేను హాస్పిటల్ కి వస్తున్నాను బాబా అని చెప్పి బయలు దేరి, దారిలో పళ్ళు, స్వీట్స్ తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాను.

సంతోషం తో ఆ బాబుని, వాళ్ళమ్మకి అభినందనలు తెలిపాను. వాళ్ళు నన్ను అభినందించారు.

ఇదంతా బాబా దయ తప్ప మరొకటి కాదని, ఆయన తలచుకుంటే కాన్సర్ లాంటి భయంకర రోగాల బారినపడకుండా మనం రక్షింపబడతాము.  వాళ్ళు కూడా అప్పటినుండి బాబాకి భక్తులయ్యారు.

ఆ పిల్లవానికి ఇంకే ఇతర ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు.

కాన్సర్ లాంటి కంప్లైంట్స్ ఉంటే ఎవరూ కూడా పిల్లనివ్వడానికి భయపడతారు కదా ! కానీ, ఒక ఏడాదిన్నర క్రితం ఆ అబ్బాయికి పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఒక బాబు కూడా.

The above miracle has been typed by: Mrs Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles