Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు రమాదేవి. నేను పుట్టింది పెరిగింది దాదాపు అంతా కూడా చెన్నై లోనే.
నా వివాహం అయిన తర్వాత మా వారి ఉద్యోగ రీత్యా ఢిల్లీ రావటం జరిగింది. మాది సాంప్రదాయకమైన కుటుంబం. అంతా కూడా భగవత్ భక్తులు.
ఇంట్లో అలా పూజలు చేయడం అవి ఉండేసరికి సహజంగానే నాకు దైవారాధన అలవాటు అయ్యింది.
నేను ఎక్కువగా హనుమాన్ చాలీసా, అమ్మవారి స్తోత్రాలు చాలా బాగా చదువుతూ, పారాయణ చేస్తుండేదాన్ని.
హనుమాన్ చాలీసా మండలం రోజులు 108 సార్లు పారాయణ చేసేదాన్ని, అలా ఆంజనేయస్వామి, అమ్మవారు తప్ప నాకు మిగతా దేవుళ్ళు అంత పరిచయం లేదు.
మా వదిన గారు బాబా భక్తురాలు. ఒక సారి మేమంతా ఎదో సందర్భంలో కలిసినప్పుడు, మా వదిన నాకో పుస్తకం చూపించి, ”వదినా! ఇటు చూడు ఇది శ్రీ సాయి సచ్చరిత్ర, చాలా బావుంటుంది పారాయణ చెయ్యి”, అంటూ నాకో పుస్తకం ఇచ్చింది.
”నేను సరే ! చేస్తాలే వదినా”! అని పుస్తకాన్ని నా కూడా తెచుకున్నానే కానీ, చదవటానికి నాకు సమయం కుదరలేదు. అలా రెండేళ్లు గడిచిపోయాయి.
ఒక రోజు ఒక ముసలాయన తలకి గుడ్డ కట్టుకొని, నాకు కలలో కనపడి ”ఆ ఏంటీ ? పుస్తకం తెచ్చుకున్నావు! చదువుతానని చెప్పావు! ఇంకా ఎప్పుడు చదువుతావు?” అని అడిగారు. అదీ కల నాకు మెలకువ వచ్చిన తర్వాత ఆ కల గుర్తు చేసుకుంటే నాకు అర్ధమైంది , నాకు కలలో కనబడింది సాక్షాత్తు శ్రీ సాయి నాథుడేనని.
నేను ఒక గురువారం శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టి కాస్త కాస్త చదవటం వల్ల చాలా ఎక్కువ రోజుల సమయం పట్టింది.
అది పూర్తి అవడానికి ముందురోజు పడుకున్నాక మధ్యరాత్రిలో నా పొట్ట మీద చెయ్యి స్పర్శ స్పష్టంగా నాకు తెలిసేటట్లు అటు నుంచి ఇటు రాసి నట్లు అయింది . నాకు మెలకువ వచ్చేసింది చూస్తే ఎవరూ లేరు.
మా వారు మంచానికి అటు చివర దూరంగా నిద్ర పోతున్నారు. ఆయన చెయ్యి అయితే పొరపాటున కూడా ఇంత దూరం తగిలే అవకాశం లేదు. బాబానే నాకు స్పర్శ కలిగించాడని నాకు అర్ధం అయ్యింది, నేను పులకించి పోయాను.
ఈ సారి అందరు సప్తాహంలాగా చేస్తారు, నేను కూడా అలా చేస్తే బావుంటుందని అనిపించింది. ఒక గురువారం నాడు మొదలుపెట్టాలని అనుకొని, తెల్లవారుఝామున నాలుగు గంటలకు లేచి, స్నానం చేసి బాబాకి గంధంతో అభిషేకం చేశాను.
అలా చెయ్యాలని నాకు ఎవరూ చెప్పలేదు, నాకే అలా చెయ్యాలని అనిపించింది. పారాయణ ఏ రోజు కారోజు పూర్తి చేసి, బాబా కి పండో, పాలో, పంచదారో, పటికబెల్లమో ఎదో ఒకటి నైవేద్యం పెట్టుకుంటూ వచ్చాను. వారం రోజులు కూడా అలాగే అయ్యాయి.
అలా అప్పుడప్పుడు, బాబా పారాయణ ఒక ఎనిమిది సార్లు పారాయణ చేశాను, ఇలా అయ్యాక నాకు మరలా బాబా కలలో కనపడి ” 100 సార్లు సచ్చరిత్ర పారాయణ చెయ్యి ” అని ఆదేశించారు.
నాకు హనుమాన్ చాలీసా 108 సార్లు చదివే అలవాటు ఉంది కదా, అందుకని బాబా సచ్చరిత్ర కూడా 108 సార్లు చదవాలని ఆయన నిర్ణయం కాబోలు.
సరే వరుసగా కాకుండా వారం రోజులు చదివి, ఒక వారం పదిహేను రోజులు మధ్యలో ఉరుకుంటూ అలా చదువుతున్నాను.
మా ఇంటి దగ్గరే రోజూ ఒక వీధి కుక్క మా గుమ్మలోకి వస్తుండేది. రోజూ వస్తుండటంతో దానికి అన్నం పెట్టడం, పాలు పొయ్యడం చేస్తుండేదాన్ని. అది మాకు బాగా మాలిమి అయ్యింది.
అది ఆడ కుక్క కావటనా అయిదారు పిల్లల్ని ఒక్కసారే పెట్టేది. అవి ముద్దుగా, బొద్దుగా బావున్నాయి. అతి కష్టం మీద అవన్నీ అందరికీ పంచి పెట్టాను.
అది తరచూ పిల్లల్ని ఇలా పెడుతుంటే నేను అస్తమానం ఎవరికీ ఎన్నిసార్లు పంచిపెట్టగలను. అందుకని బాగా అలోచించి, ఆ కుక్కని హాస్పిటల్ కి తీసుకెళ్లి, పిల్లల్ని కనకుండా ఆపరేషన్ చేయించాను.
అప్పటినుంచి ఆ కుక్క కి ఎదో ఇన్ఫెక్షన్ అయ్యింది. అది బాగా నిరసించి బక్కగా అయిపోయింది. ఎత్తుగా గుర్రం లాగా ఉన్న కుక్క ఎముకల గూడు లాగా అయిపోయింది.
రేపో మాపో అయిపొతుందెమో దీని పని అన్నట్లుగా తయారైంది. దాన్నలా చూస్తుంటే నా ప్రాణం ఉసూరుమనేది. దానికి ఏదైనా చెయ్యాలని అనిపించేది.
నేను సచ్చరిత్ర పారాయణ చేస్తుండటాన, అందులో తాయత్తు మహిమ గురించి కథలు ఉన్నాయి. నాకు ఆ కుక్కకి తాయత్తు ఒకటి వేస్తే బావుంటదేమో అనిపించింది.
అనుకున్నదే తడవు నేను వెళ్లి ఒక తాయత్తు కొనుక్కొచ్చి అందులో బాబా ఊదీ, గంధం, అక్షింతలు, పూరెక్కలు వేసి మూసేసి ఆ కుక్కకి మెడలో కట్టాను.
అది వీధిలోకి వెడితే వేరే కుక్కలు ఆ తాయత్తు కాస్తా లాగేస్తాయని అనిపించినా ఏదైతే అది అవుతుందని అంతా బాబా పైన భారం వేసి ఊరుకున్నాను.
అంతే ! వారం అంటే వారం రోజులు తిరిగేసరికల్లా ఆ కుక్క మాములుగా అంటే మునపటిలాగా ఆరోగ్యంగా అందంగా, పుష్టిగా తయారైంది.
బాబా మహత్యం కథల్లో చదవటమే కానీ, స్వయం గా చవి చూడటం ఇదే మొదటిసారి.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- అవగాహన లేకుండా చేసిన సచ్చరిత్ర పారాయణం, కానీ ఫలితం మాత్రం అమోఘం ……
- తలచిన వెంటనే స్వయం గా వచ్చి తన భక్తురాలి జ్వరాన్ని తొలగించిన బాబా గారు.
- బాబా స్వప్న దర్శనం….
- సబూరి తో ఉన్న నాకు బాబా వారి కృపతో మెడనోప్పి, వెన్నునొప్పుల భాదలు తొలగిపోవుట
- బాబా ప్రసాదించిన సంతానం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments