Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
ఆ మద్యకాలములో ఇద్దరు సాయి భక్తులతో నేను మా పెద్దమ్మాయి అయ్యప్ప మాల వేసుకున్నాము. వారితోపాటు మేము బాబా పూజకు వెళ్ళాము . వారితో కలసి శబరిమల వెళ్లినప్పుడు ప్రయాణంలో ఆస్వాములు నాకు మా అమ్మాయికి బాబా గారి చరిత్రలో విషయాలు చెప్పి పారాయణ చేయమని book ఇచ్చారు .
చాలా రోజులు అలంకారముగా మా ఇంటిలో వున్నాది. నేను వ్యాపారంలో చాలా busy గా వుండే వాడిని. షిరిడీీ వెళ్లాలి బాబా అనుమతి ఎలా పొందాలి ఆని అలోచిస్తూవుంటే నాకు సచ్చరిత్ర ఇచ్చిన మిత్రుని సలహా మేరకు వరి వదిలి {సప్తాహ పారాయణ 8 రోజులూ వరి గాని వరితో (rice) చేసిన పదార్దములు వదిలి పారాయణ చేయడం /Refer Sai Sacharitra లో గోవా పెద్దమనసుల chapter (36 chapter)} పారాయణం చేసి బాబా అనుమతికై ప్రార్దించ్చాము.
షిరిడీ వెళ్లి వచ్చిన ఒక దూరపు బందువు దగ్గర directions తీసుకొని మేము 9 మంది కుటుంబసభ్యులం pongal సెలవుల్లో షిరిడీ బయిలుదేరి 3days బాబా సన్నిధిలో పారాయణ,హరతిలు,దర్సనాలు చేసుకొని మంచి మరువలేని అనుబూతితో బాబాను వదల లేక వదల లేక ధ్వారకామాయి లో బాబా అనుమతి తీసుకొని మావూరు వచ్చి ఆ రోజునుంచి ఈ రోజువరకూ మేము పారాయణ చేస్తూ బాబా లీలలు ఎన్నో అనుభవిస్తున్నాము.
.
తరువాత భరద్వాజ మాష్టారు రచనలు చదివి బాబా తత్వమును కొంత అర్దము చేసుకొని నేను నా wife, పిల్లలు బాబా మందిరంకు వీలయనప్పుడల్లా వెళ్ళి సేవ చేసేవారం. సచ్చరిత్రలో వర్నించినట్లు చందనొత్సవం, గోదావరిజలాభిషేకం , పుస్పాభిషేకం 3 సార్లు, 108 మందితో సామూహిక వ్రతములు,పల్లకి ఉత్సవం మొదలైన కార్యక్రమములు ఎన్నో గురుబంధువుల సహయసహకారములతో బాబా జరపించుకున్నారు.
ఆ next year నుండి నాకు విపరీతమైన మెడనోప్పి, వెన్నునోప్పి వచ్చేవి.ఎందరో Doctors దగ్గరకు వెళ్లాను , ఎన్నో మందులు వాడేను. తగ్గలేదు సరికదా రోజు రోజుకు నా యాతన ఎక్కవయిపోతుంది. వ్యాపారం చేయలేకపోతున్నాను.
కుటుంబ బాధ్యతలు ఏమీ నెరవెరలేదు. బాబా నాకు కనీసం నా ఇద్దరమ్మాయిల పెళ్ళి అయినంత వరకూ అయినా నా ఈ జబ్బు బారినుండి విముక్తి చేయమని వేడుకున్నాను. గాని ఫలితం లేకపోయింది.
నేను నా wife బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం కి వచ్చాము 1) ఈ రోజు నుండి మందులు మానివేద్దాము 2)షిరిడీకి వెళ్లి ఒక 10 days వుండి బాబాను వేడుకుందాం.
ఆ వారంలోనే నేను నా wife షిరిడీ వెళ్లి సప్తాహపారాయన, హారతులు, బాబా గారికి తాలీతో మధ్యాహ్నం భోజనం పెట్టడం, అబభిషేకతీర్థం పదిరోజులూ మెడకురాసుకొని, గురుస్థాన ప్రదక్షిణలు,ఊదీ వెసుకొనడం మొదలైన సేవలు చేస్తూ గడిపాము.ఏమి ప్రయోజనం కనబడలేదు. బరించలేని నోప్పి నా కర్మ అని తలచి మా వూరు వచ్చితిని.
సబూరి కొల్పోకుండా బాబా థ్యానములోనే వున్నాము. 3 days తరువాత నొప్పి నన్ను ఆటంకపరచలేదు. నా పని నేను సక్రమమంగా చేసుకుంన్నాటున్నాను. ఇప్పుడు నాకు నొప్పి వుందనుకుంటే వుంది లేదు అనుకుంటే లేదు.ఇంకా ఎన్నో అనుభూతులు తో మేము మా పిల్లలు బాబా సేవలోవున్నాము.
K హరి గోపాల్
విజయనగరం
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- బాబా వారి ఊధీ ధారణతో మానసిక వ్యధ తొలగిపోవుట.
- నేనుండగా భయమేల? బాబా వారి కృపతో సుఖప్రసవం–Audio
- బాబా నీ దగ్గర నాకు రెండు పూటలా రెండు రొట్టెలు పెట్టి చీపురు తో ఊడ్చే పని అయినా నాకు ఇప్పించు
- బాబా నాకు నచ్చే విధంగా ఉన్న ఇంటినే నాకు కానుకగా ఇచ్చారు…Audio
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments