Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
- Mir-11-newhouse-by-Lakshmi-Prasanna 6:33
ఓం సాయి రామ్.
సాయినాదుని ఒక్కసారి నమ్మితే చాలు, ఇక మన బాద్యతలు అన్నీ ఆయనే చూస్తారు.
బాబా వారి ఏకాదశ సూత్రాలు అక్షరాలా నిజ సత్యాలు అని ముక్తకంఠంతో చెప్పగలను.
నా జీవితంలోని ప్రతి రోజు ఆయన పెట్టిన బిక్ష, అదే తరుణం లో నాకు ఉండడానికి ఒక గూడు అంటే ఇల్లు కావాలి.
ప్రతి మనిషి జీవితంలో సొంత ఇల్లు, అదీ నచ్చే విదంగా ఉండాలి అని కోరిక ఉంటుంది.
అలాగే నాకు కూడా నచ్చె ఇల్లు కావాలి. ఇది జరిగి సుమారు ఏడు సంవత్సరాలు అయ్యింది.
ఇల్లు కొనాలి అని ఆలోచన రాగానే మొదట నేను బాబాకి చెప్పిన మాటలు. తాత ఇప్పుడు ఇల్లు కోనేంత పెద్ద మొత్తం డబ్బు లేదు, పైగా నాకు కొత్త ఇల్లు కావాలి, దానిలో నీకు గది ఉండాలి. నా ఉద్దేశ్యం, పూజ గది.
నేను మొదట గృహప్రవేశం చేయాలి. కాని నాకోరికలకు తగ్గట్టు డబ్బు లేదు. నీ మూటలోంచి కాస్త తీసి మనవరాలికి ఇల్లు కొను. అని బాబా కి చెప్తూ ఉంటాను, వినకుండా ఉంటారా. విన్నారు !!!
కాకపోతే బాగా తిరిగాము ప్రయాస పడాలిగా మరి! ఎంత వెదికినా మనసుకు నచ్చిన ఇల్లు కనిపించదే. అదే సమయం లో ఒక రోజు బాబుని స్కూల్ లో దింపాము.
ఆ గేటు దగ్గర ఒక ముసలి వ్యక్తి ముస్లిం లా ఉన్నారు చూడడానికి, నేను బండి ఎక్కుతుండగా అతను మా దగ్గరకు వచ్చి రెండు రూపాయలు ఇవ్వు, ఇది రంజాన్ నెల మీకు ఇల్లు కావాలి అని నేను అల్లాని ప్రార్దిస్తా అని చెప్పారు.
వచ్చే రంజాన్ లోపు మీరు ఇల్లు కొంటారు అని చెప్పారు. బాబానే ఆ రూపంలో వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు, ఇక మన కల నెరవేరుతుంది అని అనుకున్నాము.
ఈలోగా ఒక ఫ్లాట్ చూసాము , అది కట్టి అప్పటికి ఏడు సంవత్సరాలు అయ్యింది. దానిలో తాతకి గది ఉంది అంటే పూజ గది. అసలు ఆ ఫ్లాట్ ఎవ్వరికి అద్దెకు కూడా ఇవ్వలేదు. అంటే కొత్తది !!!!
అది కట్టాక ఆ ఓనర్ తాళం వేసారు. దానిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కనీసం రెంట్ కోసం కూడా ఆశ పడలేదు ఇది ఏమి చిత్రం. ఈ ఏడు సంవత్సరాలలో ఎంతోమంది చూసారు కాని ఆమె ఎవ్వరికి అమ్మలేదు. ఎందుకు అంటే ఏమో అంటారు.
ఆ అపార్ట్ మెంట్ లో ఇంకే ఫ్లాట్ కి పూజ రూమ్ లేదు ఒక్క మా ఇంటికి మాత్రమె ఉంది. దాని వల్ల మా పక్కన ఫ్లాట్ కాస్త చిన్నది కూడా అయ్యింది. ఆమె కావాలి అని నాకోసం కట్టించినట్టుగా ఉంది.
ఇది చూసి నాకు ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి. ఇన్ని ఏళ్ళు ఖాళీగా ఎందుకు ఉంది? ఎవరు ఎందుకు కొనలేదు? ఇదే ఆలోచనతో బాబా ని అనుమతి కోరాను కొనాలా, వద్దా, అని.
దానికి తాత సమాదానం అది నీదే ఊధీ, ప్రసాదాలతో నువ్వు ఇల్లు చేరుతావు అన్నారు.
ఇక ఆలస్యం చేయక ముందుకు అడుగు వేసాము. (కాని చాలా ఒడిదుడుకుల మద్య, అంతేలే ఏదో కర్మ ఇంకోలా సులువుగా పెడతారు కదా మన తండ్రి) చివరకు రిజిస్ట్రేషన్ రోజు అంతా బాబా దయవల్ల అంతా సవ్యముగా అయ్యింది.
కాని ఆ ఓనర్ దంపతులు ఇద్దరు ఆరోజు మధ్యాహ్నం మాకు భోజనం పెడతారా అని అడిగి మరీ మా ఇంటికి వచ్చి భోజనం చేసి , ఆ ఇంటి తాళాలు మాకు ఇచ్చారు. కనీసం మొహమాట పడకుండా మీ ఇంట్లో ఏది ఉంటె అదే పెట్టండి అని అడిగారు నాకు చాలా ఆనందంగా అనిపించింది.
ఎందుకు అంటే అనుకోని అతిదికి ఆతీద్యం ఇవ్వడం అంటే అది బాబా వారే కదా. అలా ఆ రోజు రాత్రి అయ్యింది పెద్దగా వర్షం పడుతుంది కాని బాబా ఊది, ప్రసాదాలు అన్నారుకదా? అవి ఏవి? అని ఆలోచిస్తూ అందరమూ ఉన్నాము.
ఆ రోజు రిజిస్ట్రేషన్ కదా అందరూ ఉన్నారు. అప్పుడే మా తలుపు చప్పుడు అయ్యింది మా ఎదురు ఇంటి ఆవిడ ఆ వర్షంలో గొడుగు వేసుకొని మరీ కేదారనాధ్, బదరీనాథ్, షిర్డీ, ఊధీ, ప్రసాదాలు తెచ్చి ఇచ్చారు.
తాత కి ఎలా thanks చెప్పాలి. అప్పుడు మా అమ్మ ఒక మాట అన్నారు. అది ఏమి అంటే “మీ తాత ఆ ఇల్లు కట్టే అప్పటి నుండి ఇది నా మనవరాలికి అని ఆ ఇంటి ముందు సటకా పట్టుకొని కూర్చున్నారేమో, అందుకే అది ఇన్ని ఏళ్ల నుండి ఎవరికీ దక్కలేదు అని.” నాకు ఆమాట ఇప్పటికి గుర్తు ఉంది.
మేము ఆ ఇంటికి కలర్స్ కూడా వేసే పని లేదు. ఎందుకు అంటే కొత్తది కదా, కాకపోతే మేము వుడ్ వర్క్ అంతా చేయించి, మళ్ళీ మాకు నచ్చే కలర్స్ వేసుకోని విజయదసమి రోజు గృహప్రవేశం చేసాము. అది అంతా కూడా మా బడ్జెట్ లో జరిగింది.
పైగా ఇంటి ఓనర్ నేను ఇచ్చిన రేట్ ఎవ్వరికి చెప్పవద్దు అన్నారు. చూసారా తాత ప్రేమ నాకు ఇప్పుడు కూడా ఆనందబాష్పాలు వస్తున్నాయి.
ఎందుకు అంటే గంగని ఎటు వైపు నుండి తిప్పి చదివినా గంగ కదా.
బాధతో కన్నీరు, ఆనందంతో కన్నీరు. ఈ కలికాలంలో ఆయనను పట్టుకుంటే ఆయనే నడిపిస్తారు.
ప్రేమను పంచె తాతకే ప్రేమతో తాత మనవరాలు.
సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు
Latest Miracles:
- అప్పుడే పెళ్ళి వద్దనుకున్న నాకు, బాబా భక్తురాలిచ్చే వివాహం జరిపించిన బాబా వారు.
- ఈ మధ్య నేను బాబా ను నమ్ముకున్నాను , అప్పటి నుండే నాకు ఈ భోగం
- నా నమ్మకమే బాబా. నాకు ఉన్న దిక్కు కూడా తనే.
- బాబా ఊదీ మహిమతో ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు మాయమగుట.
- కంప్యూటర్ అవగాహన ఏమాత్రం లేని నాకు GE కంపెనీ లో జాబ్ ఇప్పించిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments