Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
- Mir-15-Boy-by-Lakshmi-Prasanna 3:46
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
బాబా వారి బొటనవేలు నుండి పాలు – పసివాడి ఆకలి తీర్చిన బాబా
శ్రీ సత్ చిత్ ఆనంద సమర్ధ సద్గురు సాయినాథ్ కీ జై ..సమర్థ సద్గురు సాంబశివ గురుదేవ కీ జై.
దేవ్ బాబా (అనంత్ ప్రభు వాల్వాల్కర్ ) గారి జీవితం లో బాబా చూపిన లీలలు::
విట్టల భక్తుడయిన రాజారామ్ కాకా , మరియు దభోల్కర్ పుత్రిక అయిన సీతాబాయి దంపతులకి దేవ్ బాబా జన్మించెను.
దేవ్ తన తల్లి గర్భం లో వున్నప్పుడు ఆమె చాల ఇబ్బందులు పడెను.
ఆమె చాల అనారోగ్య పరిస్థితుల్లో ఉండెను.ఆమె టెట్నస్ వ్యాధి తో బాధ పడగా తండ్రి అయిన ధబోల్కర్ చాలా చింతిస్తూ బాబా వద్దకి పరిగెత్తి పరిస్థితి వివరిస్తాడు.
బాబా అతడిని ఓదారుస్తూ ,’ఏ కష్టం లేకుండా ప్రసవం అవుతుంది. మగ బిడ్డ పుడతాడు ‘ అని దీవిస్తాడు.
ప్రసవ సమయం వస్తుంది, దభోల్కర్ బాబా ని సహాయం కోసం ప్రార్థిస్తూ బయట వేచివుంటాడు. రాజారామ్ కూడా తనకి జ్ఞానేశ్వర్ లాంటి కొడుకు కావాలని విట్టల్ ని ప్రార్థిస్తాడు.
ప్రసవం బాబా చెప్పినట్లుగా సుఖం గా అవుతుంది .మగ బిడ్డ పుడతాడు
ధబోల్కర్ లోనికి వెళ్లి చూడగా, తన కూతురు, పుట్టిన ఆ శిశువు ని దగ్గరికి తీసుకోకుండా ఒక మూలన పడుకోబెట్టడం చూసి బాధపడతాడు.
ఆ శిశువు తల చుట్టూ కాంతివంతమైన వలయం అతడికి కనిపించగా ఆశ్చర్య పోతాడు.
ఆ కాంతి తో వున్న ఆ శిశువు ని ఎత్తుకోడానికే భయపడి వాడి కి స్తన్యం ఇవ్వడానికి ఆమె నిరాకరించగా ధబోల్కర్ మనమడిని తీసుకొని షిరిడి వెళ్తాడు .
బాబా కి మొత్తం వివరించి బాధపడగా, బాబా ఆ శిశువు ని తన వడి లో కి తీసుకుని ఊరడిస్తూ తన బొటన వేలిని శిశువు నోట్లో పెట్టగా ఆ శిశువు చప్పరించగానే పాలు బొటన వేలి నుండి ధార గా వస్తాయి.ఇలా బాబా పసివాడి ఆకలి తీరుస్తాడు
పెరిగి పెద్దవాడయ్యాక దేవ్ బాబా p.e t టీచర్ గా పని చేస్తుండెను.
అతను తన విద్యార్థులందరినీ సమానం గా ప్రేమించేవాడు. కానీ విద్యార్థుల్లో రెండు వర్గాలు ఉండేవి.
ఒక వర్గం వారు దేవ్ బాబా తమను పక్షపాతం తో చూస్తున్నాడని మరో అధ్యాపకుడికి ఫిర్యాదు చేస్తారు.
ఆ అధ్యాపకుడు దేవ్ బాబా ని కొట్టి గాయపరచాలని పధకం వేసుకుంటాడు.
వేరే టీచర్స్ ఈ విషయం దేవ్ కి చెప్పగా, అతను “తాను రేపు పాఠశాల కి రానే రాడు” అంటాడు.
నిజంగానే , అతను ఆ సాయంత్రం ఈత కి వెళ్ళినపుడు నీటి లో మునిగి చనిపోతాడు .
అపుడు దేవ్ బాబా తనకి బాబా కొన్ని సిద్ధులనిచాడని తెలుసుకుంటాడు..జై సాయిబాబా
(తరువాతి భాగం మరల ఇవ్వబడును )
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆరతి జ్ఞానరాజా!…..సాయి@366 అక్టోబర్ 25….Audio
- బాబా గురువుగారి అనుగ్రహం వల్ల మగ బిడ్డ ప్రసవం.
- తప్పు ! ….. సాయి@366 ఫిబ్రవరి 22….Audio
- ఎవరికీ తలవంచకు…. మహనీయులు – 2020… మే 30
- ఆ చేతులు ఎవరివి? బాబావి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “బాబా అతడిని ఓదారుస్తూ ,’ఏ కష్టం లేకుండా ప్రసవం అవుతుంది. మగ బిడ్డ పుడతాడు ‘ అని దీవిస్తాడు.–Audio”
Maruthi Sainathuni
October 1, 2017 at 4:33 amSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
kishore Babu
October 1, 2017 at 4:33 amhttp://saileelas.com/m/sounds/view/10Chapter7-mp3
10Chapter7-mp3
శ్రీ సాయి గురు చరిత్ర….ఏడవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ దాసగణు మహారాజ్…. తెలుగు అనువాదం శ్రీ యస్వీయల్. నారాయణ రావు ….. ధ్వని అనుకరణ శ్రీమతి భాగ్యలక్ష్మి