Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఆ చేతులు ఎవరివి?
త్యాగరాజు గారి అమ్మాయి అనుభవాన్ని మీకు వివరిస్తాను. ఆ అమ్మాయి కూడా బాబా భక్తురాలే.
అక్టోబరు 2011 సంవత్సరములో మా పెద్ద అమ్మాయి హైదరాబాదులో మెటర్నిటీ ఆస్పత్రిలో చేరింది. మా అమ్మాయికి సిజేరియన్ తప్పదనుకున్నారు డాక్టర్ గారు. డెలివరీకి యింకా 10 రోజులు ఉంది కాబట్టి డాక్టరు యింటికి వెళ్ళిపొమ్మని సాయత్రం చెప్పింది. కాని తెల్లవారిన తరువాత వెళ్ళవచ్చని ఆస్పత్రిలోనే ఉండిపోవడం జరిగింది.
ఆ మరునాడు తెల్లవారుఝామునే నొప్పులు మొదలయ్యాయి. వెంటనే డాక్టర్ గారు వచ్చి సిజేరియన్ కి అన్నీ ఏర్పాటు చేసుకుంటుండగానే నొప్పులు తీవ్రం అయిపోయి నార్మల్ డెలివరీ కే ప్రయత్నించాల్సి వచ్చింది. కానీ శిశువు కొంతవరకు వచ్చి ఆగిపోయింది. ఆ సమయంలో ఆపరేషన్ చేయడానికి కూడా వీలులేని పరిస్థితి. భగవంతుడు తప్ప ఎవరూ సహాయం చేయలేరు. అప్పుడే విచిత్రం జరిగింది. రెండు చేతులు మా అమ్మాయి తల వద్ద నుంచీ పొట్ట గట్టిగా నొక్కుతున్నట్టుగా కనిపించింది. ఆ వెంటనే సుఖ ప్రసవం జరిగి శిశువు క్షేమంగా బయటికి వచ్చింది. ఆ చేతులు అంతవరకు నొప్పి వచ్చినప్పుడల్లా పొట్ట నొక్కుతూ ప్రయత్నిస్తున్న అక్కడి డాక్టర్లు, నర్సుల చేతులకన్నా వేరుగా ఉన్నాయి. మా అమ్మాయి తల వద్దనే నిలబడిన అల్లుడివి కూడా కావని తరువాత తెలిసింది. మరి ఆ చేతులు ఎవరివి? బాబావి.
త్యాగరాజు
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బిడ్డను రక్షించేందుకు ధుని లో నా చేతులు ఉంచి బిడ్డ ప్రాణాలు కాపాడాను.
- గురువుగారు చేతులు తట్టుతూ భజన చేస్తూనే ఉన్నారు.
- ఆ సాయి నాధుడే కదిలి వచ్చాడు ఒక కొత్త డాక్టర్ రూపం లో
- నా నాలుగు చేతులు చాచి వానిని రక్షింతును–Audio
- సంకటాలను దూరం చేసిన సాయి నామం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఆ చేతులు ఎవరివి? బాబావి”
Sreenivas Murthy
February 24, 2017 at 5:49 amSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba