Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-81-1109-నా నాలుగు చేతులు చాచి వానిని రక్షింతును 3:56
శ్రీ సాయి బాబా కూడా దేవుడేనా? ఉన్న దేవుళ్ళు చాలకనా?” అని ఒక మిత్రుడు శ్రీ బాపట్ల హనుమంతరావు గారిని అడిగిరి. ఇది 1953లొ జరిగిన సంఘటన.
అప్పుడు సాయిలీలా మాసపత్రిక చీరాల నుండి ప్రచురించబడుచున్నది.
శ్రీ బాపట్ల హనుమంతరావు గారు సాయితత్వ ప్రచారములో ఈ పత్రికకు చందాలు సేకరించుచూ, భక్తులకు పత్రికలను అందించుట ఒక సాధనముగా చేసుకొనిరి.
ఒక రోజున ఒక మిత్రుని వద్దకు వెళ్ళి ఆ సాయిలీల మాసపత్రికకు చందా చెల్లించమని అతనిని హనుమంతగారు కోరినారు.అప్పుడు ఆ మిత్రుడు “పంతులుగారు! శ్రీ సాయిబాబా కూడా ఒక దేవుడేనా? ఉన్నదెవుళ్ళు చాలకనా?” అని హనుమంతరావుగారిని ప్రశ్నించిరి.
అనుకోని ఈ ప్రశ్నకు పంతులుగారు “అవును శ్రీ సాయిబాబా కూడా దేవుడే, చాలకనే” అని మిత్రునికి సమాధానమిచ్చిరి.
తన మిత్రుడు పలికిన ఈ మాటలకు హనుమంతరాగారి అభిమానం దెబ్బతిన్నది.
మిత్రుడు పత్రికకు చందా చెల్లిం చకపోయిన పోనిమ్ము.
కానీ సాయిబాబాను ఇట్లు కించపరచునట్లు మాట్లాడుట సమంజసం కాదు. అది అతనికి తగదు అని హనుమంతరావు గారు బాధపడిరి.
ఆసమయమున పంతులు గారికి బాబా దేహముతో యున్న ఒక సంఘటన గుర్తుకువచ్చినది.
సాయిబాబా చెప్పగా బాంద్రాబాలుడు బాపుసాహేబ్ జోగ్ వద్దకు దక్షిణ తెచ్చుటకు సాఠె వాడకు వెళ్ళగా అక్కడ జోగ్ మరికొందరితో కలసి ధృవచరిత్రను చదువు చుండెను.
“సాధువులు భగవదనుగ్రహం వలన కొన్ని శక్తులను సంపాదించగలిగినను వారు దైవము కాదు”. అని వ్యాఖ్యనమును చేయుచుండిరి.
ఈ వ్యాఖ్యనమును విన్న బాంద్రాబాలుడు అది బాబాను గురించి అన్నట్లుగా భావించి, బాబా చెంతకు వచ్చి
“బాబా నన్ను అచ్చటకు ఎందుకు పంపితిరి? వారు మిమ్ము దేముడవు కదనుచున్నారు” అని బాబా తో అనినాడు. అప్పుడు బాబా వారు నిజమే చెప్పిరని, నేను ఫకిరునని, దేవునితో ఎవరు సరిపోలరని బాబా చెప్పెను.
అదే సమయములో కొందరు భక్తులు శ్రీ సాయి బాబా వద్దకు వచ్చి తమ బిడ్డ మేడఫై నుండి క్రిందపడుచుండ బాబా బిడ్డను రక్షించిన విధానమును తెలిపిరి.
వారి మాటలను విన్న బాబా “నా బిడ్డలు అపదలోయున్న నేను ఉపెక్షించెదనా?
నా నాలుగు చేతులు చాచి వానిని రక్షింతును” అని బాబా అనుచుండ “బాబా మీరిప్పుడే నేను దేవుడను కానంటిరే! మీరు దేవుడు కాకున్నా నాలుగు చేతులేట్లు కలిగియున్నారు?
అని బాంద్రాబాలుడు ప్రశ్నించగా బాబా దానికి సమాధానము ఏమియు చెప్పక భగవంతుడనేనన్నట్లు అంగీకారంగా చిరునవ్వు నవ్విరి.
ఈ లీలను గుర్తు చేసుకున్న హనుమంతరావుగారు నా మిత్రుని వద్ద పత్రికకు చందవసూలు చేయుటకు పంపినది బాబాయేనని నన్ను పరిక్షించుట కొరకే అట్లు చెప్పించిరని తలచిరి.
తన మిత్రుడు అడిగిన “సాయి బాబా కూడా దేవుడేనా? ఉన్న దేవుళ్ళు చాలకనా?” అన్న పేరుతొ బాబా దేవుడేనని చూపబడిన లీలలతో ఒక పుస్తకమును వ్రాసి ప్రచురించిరి. ఇంతకీ సాయి బాబా దేవుడే కదా!
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా నాలుగుచేతులు చాచి వానిని రక్షింతును.
- బాబా శక్తిమంతుడైన, నా భార్య వెంటనే ప్రసవించాలి, హైదరాబాద్–Audio
- బిడ్డను రక్షించేందుకు ధుని లో నా చేతులు ఉంచి బిడ్డ ప్రాణాలు కాపాడాను.
- మీరు నాలుగు ముద్దలు తింటే నా ఆకలి తీరుతుంది.
- గురువుగారు చేతులు తట్టుతూ భజన చేస్తూనే ఉన్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments