Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-79-1108-నా భార్య వెంటనే ప్రసవించాలి 2:45
శ్రీత్రిపురనేని గోపీచందు గారి పేరు తెలియని వారు ఉండరు, వీరు ప్రముఖ నవలా రచయత.
1954లొ వీరు కర్నూలు పట్టణంలో పని చేయచుండిరి.
అచ్చట యున్న సమయంలో వీరి శ్రీమతి గర్బినీతో యుండగా ప్రసవ సమయమునకు ఆమెను ఆసుపత్రియందు చేర్చిరి.
ఆసుపత్రిలో నొప్పులతో ప్రసవ వేదన పడుచున్నది.
ఆ సమయమున గోపీచందు గారు తమ దారిలో శ్రీ సాయిబాబా మందిరము ముందుగా వెళ్ళుట తటస్థించినది.
వారు శ్రీ సాయి భక్తులు కాదు.
అప్రయత్నముగా మందిరము ముందు నిలిచి “బాబా శక్తిమంతుడైన నా భార్య కు వెంటనే ప్రసవం కావాలి” .
అని తన మనస్సున తలచినాడు. ఆసుపత్రికి వస్తున్నాడు.
ఇంతలో ఆసుపత్రి వద్ద ఒక ఫకీరు వచ్చి గోపీచందు గారి భార్య ప్రక్కన కూర్చుని ఆమె నుదిటిపై విభూతిని పెట్టి, కొంచెము ఉదిని నీటిలో వేసి, ఆ నీటిని ఆమెకు త్రగించుచూ “నీకు సుఖ ప్రసవము అవుతుంది. భయము లేదు.” అని అనుచు బయటకు వెళ్ళెను.
ఇంతలో గోపి చందు గారు ఆసుపత్రికి చేరిరి. వారి శ్రీమతికి ప్రమాదము తప్పి సుఖ ప్రసవమైనది.
మగ పిల్లవాడు కలిగెను. ఆ బాలునుకు సాయిచంద్ అను పేరు పెట్టిరి.
వారు హైదరబాదులో యుండి రచయితగా యుండిరని తెలిసినది. ఈ విషయము ఒక మిత్రుడు ద్రువపరిచిరి.
శ్రీ గోపి చందు గారికి భక్తీ లేకపోయినను, తన భౌతిక అవసరముకైనను బాబాను ఆశ్రయించుటలో కుడా ఒక షరతును పెట్టెను. భక్తిలేనివాడు తన ప్రక్కకు ఒక అడుగు వేశాడు.
ఇప్పుడు బాబా అతని ప్రక్కకు ఏడడుగులువేసి తన పై విశ్వాసం కలిగించి తన దారికి తెచ్చు కోవాలి.
ఇది ఆత్మజ్ఞానం కాదుగా ఇచ్చేముందు పరీక్ష పెట్టడానికి. భౌతికమైతే అడిగినదే తడవుగా ఇస్తున్నన్నారుగా.
ఈ విధముగా బాబాతో మాలెంగావ్ డాక్టరు కూడా ఆనాడు చేయలేదా? కనుక బాబా యందు ప్రేమ -భక్తీ -విస్వసములున్నవారు తప్పక ఉద్దరించాబడుదురు.
ఇలా బాబా అనుగ్రహంతో జన్మించిన శ్రీ సాయి చంద్ గారు ప్రస్తుతము హైదరాబాద్ లో ఉన్నారు.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా మట్టి సమాధానమిస్తుంది,నా సమాధినుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని బాబా ఇచ్చిన అభయ హస్తపు జల్లులను గురూజీ నిరూపించారు.
- సమాధి నుండి వెంటనే వచ్చి నా పక్కన నిలిచారు
- సద్గురు సాయినాథుని కృపాజల్లులు. ఎన్. రాజ్యలక్ష్మి ,హైదరాబాద్
- బంగారు బాబు రూపంలో వచ్చి నా భార్య కాలు నొప్పిని సరి చేసినా బాబా వారు ……!
- ఆత్మారాముని భార్య పంపినవాటిని బాబా ప్రేమగా స్వీకరించుట —Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబా శక్తిమంతుడైన, నా భార్య వెంటనే ప్రసవించాలి, హైదరాబాద్–Audio”
kishore Babu
March 18, 2016 at 7:59 amగర్బంతో ఉన్న ప్రతి స్త్రీకి ఇలాగే బాబా వారు మేలు చేకుర్చాలి అని, బాబాని కోరుకుందాము.