సద్గురుకృప – శిరిడి నివాసం !—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-78-1108-సద్గురుకృప - శిరిడి నివాసం 2:11

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!

నేను సుమారు 2 సం: క్రితము అనగా 2010వ సం:లో బాబా గురుంచి తెలుసుకున్నప్పుడు నేను కరీంనగర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగము చేస్తున్నాను.

నేను చదువు కొరకు బ్యాంకులో లోను తీసుకొన్నాను.

ఆ లోను ఇప్పటికి కడుతున్నాను. నా తల్లిదండ్రులకు నా జీతములో కొంత పంపుతూ బ్యాంకు లోను కడుతూ, నా బార్య, ఇద్దరి పిల్లలను పోషించు కొనేదానికి వచ్చే జీతము సరిపోయేదికాదు.

నేను 2012 మే నెల నుండి బాబా సమాధి మందిరంలో, పూజ్యశ్రీసాయినాధుని శరత్ బాబుజి సమాధి వద్ద నాకు మంచి ఉద్యోగము, ఇప్పుడు వచ్చే జీతము కంటే ఎక్కువ జీతము వచ్చేది శిరిడిలో ఇప్పించమని ప్రార్దించాను.

శిరిడిలో ఎందుకు అడిగానంటే రోజు బాబా, గురూజీల సమాధులను దర్శించుకోవచ్చు మరియు సేవ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే.

బాబా గురూజీల ఆశీర్వాదంతో శిరిడికి 15 కిలో మీటర్లలో నున్న కోపర్ గాంలోని “సంజీవనీ ఇంజనీరింగ్ కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగము లబించింది.

గతంలో నేను తీసుకొనే జీతం కన్నా 5000 రూ/- ఎక్కువ జీతముతో ఉద్యోగము ప్రసాదించారు.

ప్రతిదినము బాబా గూరుజీలను దర్శించుకొనే భాగ్యాన్ని ప్రసాదించినందుకు చాల సంతోషముగా ఉంది.

ఉద్యోగము కోపర్ గాంలో, నివాసము శిరిడిలోని విఠల్ వాడలో. శిరిడిలో వుంటూ బాబా, గురూజీలను ఇలాగే జీవితాంతము సేవించుకోంటూ వుండాలని ప్రార్ధిస్తూ సాస్టాంగ నమస్కారములు సమర్పిస్తున్నాను.

టి భాస్కర్
శిరిడీ 9766466079

సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles