షిరిడీలో నివాసం …..సాయి@366 జనవరి 23….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


షిరిడీకి ప్రయాణ మవ్వాలంటే సాయిబాబా అంగీకరించాలి. ఇక షిరిడీ చేరిన తరువాత?

శ్రీమతి లక్ష్మీబాయి కౌజల్గీ జనవరి 23, 1912న ఎప్పటికి షిరిడీలోనే ఉండి పోదామను కున్నది. అలా ఉండటం ఉండకపోవటం కౌజల్గీ ఇష్టప్రకారం కాదు సాయి అంగీకరిస్తే తప్ప.

హరి వినాయక్ సాఠే బాబాకు అంకిత భక్తుడు. సాయి అంగీకరిస్తేనే వివాహం చేసుకున్నాడు.

భక్తులకు వీలుగా ఉంటుందని ఒక వాడాను కూడా కట్టించుకున్నాడు. రిటైరయ్యాడు. కాని సాఠే కొన్ని కారణాలవల్ల షిరిడీలో కాక పూనాలో స్థిరపడ్డాడు.

షిరిడీలో నివసిద్దామని ముచ్చటపడి వాడాను కట్టించుకున్నాడు బుట్టీ. కాని అందులో నివసించలేకపోయాడు.

బాబా ఆజ్ఞపై షిరిడీలో నివసించటానికని 1953 శ్రీరామనవమి తరువాత షిరిడీ చేరారు శివనేశన్ స్వామి.

ఆ సమయంలో సంస్థానము వారు ఏ సాధువును 3 రోజులకు మించి షిరిడీలో ఉండటానికి అనుమతించే వారు కాదు. అయితే శివనేశన్ స్వామిని వారిని కాదనలేదు.

స్వామి షిరిడీలో అష్ట కష్టాలు అనుభవించారు. అయన పస్తులున్న రోజులను లెక్కించలేము.

దక్షిణ లభించిన రోజున భోజనం చేసేవారు. కొద్ది డబ్బులే ఉంటే టీ, బన్నుతో సరి పెట్టుకున్నారు.

పస్తులైనా ఉండేవారు గాని ఎవ్వరిని చేయి చాచి యాచించేవారు కాదు. భారమంతా బాబాపై వేసి షిరిడీలోనే సాయి సేవ లోనే జీవితాన్ని గడిపారు.

ఒకటి రెండు పర్యాయములు మాత్రము షిరిడీ పొలిమేరలు దాటారు. మిగిలిన సమయమంతా సాయి, సాయి భక్తులకై వినియోగించిన పుణ్యమూర్తి.

అయన తుది శ్వాసవరకు షిరిడీలోనే ఉంటూ సాయి సేవలోనే తనువు చాలించిన ధన్యజీవి.

షిరిడీలో జీవితంలో చరమాంకం గడుపుదామని వచ్చారు పోలీసు శాఖకు చెందిన నాగేష్ ఆత్మారాం సావంత్.

అలాగే సాయి సన్నిధిలో ఉన్నారు చీకు, చింతా లేకుండా.  ఒకసారి షిరిడీ విడిచి వెళ్ళి అపాయానికి లోనై బొంబాయిలో కన్ను మూశాడు.

సాయి అంటే తెలియని పంజాబీ రామలాల్ కు బొంబాయిలో స్వప్నంలో కనిపించి ‘షిరిడీకి రా’ అన్నారు సాయి.

కలలో కన్పించిన వ్యక్తి సాయి అని తెలుసుకొని సాయి ఆదేశాన్ని పాటిస్తూ షిరిడీకి వచ్చి సాయి మహాసమాధి వరకు షిరిడీలో ఉండిపోయాడు.

సాయి అనుజ్ఞ అయితే షిరిడీలో ఉండవచ్చు.

షిరిడీ నివాసి సాయిని మన హృదయ నివాసిగా చేసుకొని తరిద్దామా!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles