ఒదుగుతూ ఎదగాలి …..సాయి@366 జనవరి 24….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


ఒక్కొక్కరు తనను ఎంతటి ఉన్నత  స్థితిలో దైవము ఉంచాడో అర్ధం చేసుకోలేరు.

మురళీధరుని కడగంటి చూపైనా కడు పావనము కదా! అట్లే షిరిడీలో వేంచేసిన సాయీ మురళీధరుని విషయం కూడా.

ఒక్కొక్కరు సాయిని దర్శించటానికి షిరిడీ పోలేరు. ఎన్నో ఆటంకాలు వచ్చి, ఆ ప్రయాణాన్ని జరగనీయవు.

చేతిలో ఎంతో ధనమున్నా, ఇవ్వటానికి ఇష్టం ఉన్నా, సాయి అందరి వద్దనుండి దక్షిణను స్వీకరించేవాడు కాదు.

సాయితో మాట్లాడటానికి అవకాశం అందరకూ దక్కేది కానేకాదు. ఇక సాయి ప్రక్కన కూర్చుండటము, ఒక రోజా, రెండు రోజులా, ఎన్నో సంవత్సరములు అంటే సాయి మహాసమాధి చెందేవరకు అట్టి అదృష్టాన్ని పొందిన ఏకైక వ్యక్తి బడే బాబా.

తన ప్రక్కన కుర్చోపెట్టుకోవటమే కాదు, బడే బాబాకు సాయి ఎంతో గౌవరం ఇచ్చేవాడు. సాయి ఆయనను అతిధిగా గౌరవించేవాడు.

ఆయన తన ప్రక్కన లేనిదే, భోజనం చేసేవాడు కాదు సాయి. అంతే కాదు, బడే బాబా తిరిగి తన నివాసానికి పోతుంటే, సాయి కూడా ఆయన వెంట కొంత దూరం వెళ్ళేవాడు గౌవర సూచకంగా.

ఇంకా, సాయి ప్రతి దినం డబ్బును ఇచ్చేవారు, తనకు వచ్చిన దక్షిణ నుండి. అలాగే ఇంకెన్నో….

ఇవన్నీ చూసిన బడే బాబాకు మానవ సహజమైన గర్వం  పొటమరించింది.

సాయి భక్తుల నుండి గౌరవ మర్యాదలను ఆశించేవాడు. సాయి భక్తులు పాల్గొనే ఆరతులో ఏ మాత్రం పాల్గొనేవాడు కాదు.

ఇంకా షిరిడీలో గ్రామా ద్వారాన్ని షిరిడీ ప్రజలు నిర్మించదలచి ధన సాయం అడిగితే కాదన్నాడు.

ఇతర భక్తుల విషయాల్లో, సాయి అడగకున్నా, సాయితో ఎలా మెలగాలో చెప్పేవాడు.

అయితే సాయి సముద్రమంత సహనం చూపేవాడు. ఒక్కొక్కసారి తాను (బడే బాబా) వెళ్ళిపోతున్నాను అని సాయికి చెప్పేవాడు.

సాయి తనతో కొంత దూరం రావాలని, సాయి తనకెంతటి గౌవరం ఇస్తున్నారో, అందరకూ తెలుసుకోవాలని బడే బాబా తపన.

సాయి ఏమనేవారు కాదు. సాయి మహాసమాధి చెందాడు. బడే బాబాను షిరిడీలో ఆదుకునే నాథుడే కరువయ్యాడు.

అందుకే ఆయన నాగపూర్ లో జనవరి నెలలో ఫకీరుగానే(భిక్షాటన చేస్తూ) కన్నుమూసాడు.

కొండ కూడా అద్దంలో చిన్నగా కనిపిస్తుంది!

షిరిడీ ప్రజలతో, భక్తులతో గౌవరంగా మెసలితే, బడే బాబా కూడా ఆదర్శ వ్యక్తి అయ్యేవాడు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles